
'కడియం, తలసాని భయపడుతున్నారు'
హైదరాబాద్ : తొమ్మిది నెలల సమయంలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, దీంతో ఉప ఎన్నికలకు వెళ్లాలంటే టీఆర్‌ఎస్ భయపడుతోందని టీడీపీ శాసనసభా పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆయన సోమవారమికక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుత సమయంలో తెలంగాణలో ఉప ఎన్నికలకు వెళితే ఓడిపోతామనే వరంగల్ ఎంపీ పదవికి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే పదవికి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేసేందుకు భయపడుతున్నారన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉప ఎన్నికలు వస్తే టీఆర్‌ఎస్ పార్టీ గల్లంతు కావడం ఖాయమని ఎర్రబెల్లి జోస్యం చెప్పారు.