ఉక్రెయిన్‌పై దాడి చేసి యావత్ ప్రపంచాన్ని వణికించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా భయపడుతున్నారు! తనకు ఎవరైనా విషం పెట్టి హత్య చేసే కుట్రలు పన్నతున్నారేమోనని పుతిన్ ఆందోళన పడుతున్నాడట. అందుకే దాదాపు వెయ్యి మంది వ్యక్తిగత సిబ్బందిని తొలగించారని సమాచారం. తొలగించబడిన ఉద్యోగులలో అంగరక్షకులు, వంటవాళ్లు, లాండ్రీలు, వ్యక్తిగత కార్యదర్శులు ఉన్నారు. అయితే ఈ ఉద్యోగులందుర్నీ ఇటీవలే తొలగించారు.
వీరి స్థానంలో క్షుణ్ణంగా విచారణ చేసి కొత్తవారిని నియమించారు. పుతిన్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 24న రష్యా సైన్య ఉక్రెయిన్‌పై రోజుల తరబడి యుద్ధం కొనసాగిస్తోంది. దక్షిణ కరోలినాకు చెందిన యుఎస్ చట్టసభ సభ్యుడు లిండ్సే గ్రాహం కూడా రష్యా అధ్యక్షుడి హత్యకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పైగా గ్రాహం.. పుతిన్‌ను నియంత అయిన అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చిన సంగతి తెలిసిందే. యుద్ధం ముగియాలంటే ఒకరిని చంపడమే మార్గమని అన్నారు. పుతిన్‌పై విష ప్రయోగం చేసే సాహసం ఏ విదేశీ ప్రభుత్వమూ చేయదని అది కేవలం రష్యా అధ్యక్ష కార్యాలయం లోపల నుంచే జరుగుతుందంటూ కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
దీంతో పుతిన్ తనను ఎవరైనా హత్య చేస్తారన్న భయంతోనే వ్యక్తిగత సిబ్బందిని తొలగిస్తున్నాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదీ గాక రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్నప్పటి నుంచి పుతిన్‌కి శత్రువులు ఎక్కువయ్యారు. పైగా అమెరికాతోపాటు పలు పాశ్చాత్య దేశాలు కఠినమైన ఆంక్షలు విధించాయి. మరోవైపు స్వదేశంలోనూ పుతిన్‌పై వ్యతిరేకత ఎక్కువైంది. పైగా ఈ యుద్ధం కారణంగా పుతిన్‌కి వ్యతిరేకంగా చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా రష్యన్లు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
(చదవండి: పుతిన్‌తో చర్చలు విఫలమైతే.. మూడో ప్రపంచ యుద్ధమే!: జెలెన్‌స్కీ)
Comments
Please login to add a commentAdd a comment