భయం గుప్పిట్లో కలెక్టరేట్ ఉద్యోగులు
Published Sun, Oct 27 2013 2:02 AM | Last Updated on Thu, Mar 21 2019 8:31 PM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లా పాలనకు కేంద్రబిందువైన కలెక్టరేట్ శిథిలావస్థకు చేరుకోవడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగులు భయం గుప్పెట్లో కాలం వెళ్లదీస్తున్నారు. నాలుగేళ్లుగా కలెక్టరేట్ పరిస్థితి అధ్వానంగా మారిం ది. వర్షం పడితే నీరు పలు కార్యాలయాల్లోకి చేరడంతో పాటు శ్లాబు పెచ్చులూడి కిందపడుతున్నాయి. దీనికి తోడు ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కలెక్టరేట్ లోని అన్ని కార్యాలయాలూ నీరు చిమ్ముతున్నాయి. వర్షపు నీరు కార్యాలయాల్లోకి చేరడం తో ఉద్యోగులు తీవ్రఅవస్థలు పడుతున్నారు. సీట్లు తడిసిపోవడంతో కూర్చోవడానికే వారికి కుదరడం లేదు. మరికొన్ని కార్యాలయాల్లో పెచ్చులూడి పడుతుండడంతో శ్లాబ్ ఎప్పుడు కూలుతుందో తెలియని దుస్థితి నెలకొంది.
కలెక్టరేట్‌లో వివిధ శాఖలకు చెందిన 35 ప్రభు త్వ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. వందలాది మంది విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ప్రస్తుతం కలెక్టరేట్ పరిస్థితి చూసిన వారంతా అవాక్కవుతున్నా రు. పోర్టికో నుంచి కలెక్టర్ చాంబర్‌తో పాటు అన్ని కార్యాలయాలు నీరు చిమ్మడంతో నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందరి కీ మార్గదర్శకంగా ఉండాల్సిన కలెక్టరేట్ నిర్వహణే అధ్వానంగా ఉంటే మిగిలిన కార్యాల యాల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
గతంలో బీసీ సంక్షేమశాఖ కార్యాలయం వద్ద, జేసీ చాంబర్ పిట్టగోడలు కూలిపోవడంతో అప్పటి కలెక్టర్ జి.రామనారాయణరెడ్డి హయాంలో కలెక్టరేట్ నిర్మాణానికి రూ.1.80 కోట్లు కావాలని చేసిన ప్రతిపాదనలకు ఇంతవరకు దిక్కులేని పరిస్థితి. నెల్కొంది. ఆ తరువాత కలెక్టర్ వీరబ్రహ్మయ్య హయాంలో ఏయూ ఇంజినీరింగ్ బృందతో సర్వే చేయించగా భవనాన్ని కూల దోయాల్సిన అవసరం లేదు. మరమ్మతులు చేపడితే చాలని ఆ బృందం నివేదిక ఇచ్చింది. అయితే ఆ మరమ్మతులు కూడా సక్రమంగా చేయకపోవడంతో మళ్లీ లీకులమయమవుతోంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి కలెక్టరేట్‌కు మరమ్మతు లు చేపట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు.
Advertisement
Advertisement