Chinese man gets 6 months in jail for scaring 1,100 of his neighbour's chickens to death - Sakshi
Sakshi News home page

విచిత్ర ఘటన.. పక్కింటి వ్యక్తిపై ప్రతీకారంతో 1,100 కోళ్లను భయపెట్టి చనిపోయేలా చేసి.. చివరకు..

Published Mon, Apr 10 2023 1:11 PM | Last Updated on Mon, Apr 10 2023 1:34 PM

Chinese Man Jailed For 6 Months For Scaring 1100 Chickens To Death - Sakshi

బీజింగ్‌: పక్కింటి వ్యక్తిపై ప్రతీకారంతో ఓ వ్యక్తి విచిత్ర చర్యకు పాల్పడ్డాడు. అతనికి చెందిన 1,100 కోళ్లను భయభ్రాంతులకు గురి చేసి వాటి మరణానికి కారణమయ్యాడు. వినడానికి కాస్త వింతగా ఉన్న ఈ ఘటన చైనాలో గతవారం జరిగింది.

ఏం జరిగిందంటే..?
గూ, జోంగ్ అనే ఇద్దరు పక్కపక్క ఇళ్లలో నివసిస్తారు. గతేడాది ఏప్రిల్‌లో జోంగ్‌.. గూ అనుమతి లేకుండా అతని చెట్లను నరికివేశాడు. దీంతో అప్పటి నుంచి గూ పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో తరచూ జోంగ్‌కు చెందిన కోళ్ల ఫాంకు రాత్రివేళల్లో పలుమార్లు వెళ్లాడు.

కొద్ది రోజుల క్రితం ఓ రాత్రి జోంగ్‌ కోళ్ల ఫాం వద్దకు వెళ్లిన గూ.. సడన్‌గా ఫ్లాష్‌లైట్ ఆన్ చేశాడు. దీంతో అవి భయభ్రాంతులకు గురై అన్నీ ఓ మూలకు వెళ్లాయి. ఈ క్రమంలో ఒకదానిపై మరొకటి పడి 500 కోళ్లు చనిపోయాయి.

జోంగ్ ఫిర్యాదు మేరకు గూను పోలీసులు అరెస్టు చేశారు. 500 కోళ్ల మరణానికి కారణమైనందుకు అతనికి రూ.35,713 జరిమానా కూడా విధించారు. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన గూకు పక్కింటి వ్యక్తిపై పగ మాత్రం చల్లారలేదు.

దీంతో మరోసారి రాత్రివేళ  కోళ్లఫాంకు వెళ్లి మళ్లీ ఫ్లాష్ లైట్ ఆన్‌ చేశాడు. ఈ సారి దాదాపు 640 కోళ్లు మరణించాయి. పోలీసులు మళ్లీ అతడ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. గూ కావాలనే జోంగ్ కోళ్లను చంపి నష్టం కలిగేలా చేశాడని కోర్టు నిర్ధరించింది. అతడ్ని దోషిగా తేల్చి ఆరు నెలల కఠిన కారాగార శిక్ష విధించింది. చనిపోయిన 1,100 కోళ్ల విలువ రూ.1,60,000కు పైనే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
చదవండి: నిరుపేదలుగా మారిన బిల్‌ గేట్స్, ట్రంప్, మస్క్, ‘ఇంత ఘోరంగా ఉన్నారేంటి!’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement