పక్కింటివారి వలన మనం ఒక్కొక్కసారి ఇబ్బందులు పడుతుంటాం. ఇటువంటి సందర్బాల్లో వారికి అభ్యంతరం చెప్పలేక మనకి మనమే సతమతమైపోతుంటాం. ఒక మహిళకు ఇటువంటి అనుభవమే ఎదురయ్యింది. పక్కింటివారి వ్యవహారం వలన ఆమెకు నిద్ర కూడా కరువయ్యింది. దీనిని ఎదుర్కొనేందుకు ఆమె చేసిన ఒక పని అవతలివారి ఆట కట్టించింది.
‘నిద్ర కూడా పోనివ్వడంలేదు’
ఆ మహిళ రెడిట్‌లో తన అనుభవాన్ని షేర్ చేసింది. తన పక్కింట్లో ఉన్నవారు ప్రతీరోజూ సాయంత్రం పార్టీలు నిర్వహిస్తూ, పెద్ద ఎత్తున మ్యూజిక్ సౌండ్ వినిపిస్తుడటంతో ఆమెకు నిద్ర కూడా పట్టేదికాదు. వీరి ఇళ్ల మధ్య సన్నని గోడ మాత్రమే అడ్డుగా ఉన్న కారణంగా రాత్రివేళ ఆ ఇంటిలోని సౌండ్ హోరు ఈ మహిళను తెగ ఇబ్బంది పెట్టేది. దీంతో ఆ మహిళ నిద్ర పట్టక ఆ విషయాన్ని పక్కింటివారికి చెప్పింది. సౌండ్ తగ్గించాలని కూడా కోరింది.
పక్కింటివారు మాట విన్నప్పటికీ..
ఆ మహిళ చెప్పింది విన్న పక్కింటివారు మ్యూజిక్ సౌండ్ తగ్గించినప్పటికీ, అక్కడి వారి మాటల హోరు కారణంగా ఆమె ఇబ్బంది ఏమాత్రం తగ్గలేదు. ఇక ఆ ఇంటిలో ఉండటం కష్టమని ఆమెకు అనిపించింది. ఏ మాత్రం ప్రశాంతత లేదని భావించింది.
‘ఇది మా సమస్య కాదు’
ఈ విధంగా అమె ఐదు నెలల పాటు పక్కింటివారితో ఇబ్బందులను ఎదుర్కొంది. తిరిగి మారోమారు వారిని సౌండ్ తగ్గించాలని కోరింది. అయితే పక్కింటివారు ఆమెతో ‘ఇది మా సమస్య కాదు’ అని సమాధానం ఇచ్చారు. ఈ మాట విన్నవెంటనే ఆమెకు ఆగ్రహం కలిగింది. దీంతో పక్కింటి వారికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది.
వారి శైలిలోని సమాధానం చెప్పాలని..
ఈ మాట వినగానే ఆమె పక్కింటివారికి వారి శైలిలోనే సమాధానం చెప్పాలని అనుకుంది. వెంటనే ఒక పెద్ద స్పీకర్ కొనుగోలు చేసింది. ఫుల్ వాల్యూమ్‌తో రాత్రంతా మ్యూజిక్ వినిపిస్తూనే ఉంది. దీంతో పక్కింటిలోని వారికి నిద్ర ఎగిరిపోయింది. వెంటనే వారు ఆ మహిళ దగ్గరకు వచ్చి.. మ్యూజిక్ సౌండ్ తగ్గించాలని కోరారు. అప్పుడు ఆమె ‘ఇది నా సమస్య కాదు’ అని సమాధానం చెప్పింది.
‘ఇది పిల్లల ఆట’
ఆ మహిళ పోస్టును చూసిన పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ‘ఇది పిల్లల ఆట’లా ఉందని పేర్కొనగా, మరొకరు ‘పక్కంటి వారు పార్టీ చేసుకునే సమయంలో మీరు పడుకుంటే అది మీ సమస్య. దానిలో వారి తప్పేమీ లేదు’ అని అన్నారు. ఇంకొక యూజర్ ‘మీరు మంచి పని చేశారు. ఇటువంటి వారికి బుద్ది చెప్పడం ఎంతో అవసరం’ అని అన్నారు.
ఇది కూడా చదవండి: సినిమాల్లో నటి నుంచి సెక్స్ రాకెట్ దాకా..
పక్కింట్లో పార్టీ హోరు.. నిద్ర పట్టని ఆమె తీసుకున్న నిర్ణయం ఇదే..
Published Sat, Jul 8 2023 10:54 AM | Last Updated on Sat, Jul 8 2023 11:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment