brutal
-
పక్కింట్లో పార్టీ హోరు.. నిద్ర పట్టని ఆమె తీసుకున్న నిర్ణయం ఇదే..
పక్కింటివారి వలన మనం ఒక్కొక్కసారి ఇబ్బందులు పడుతుంటాం. ఇటువంటి సందర్బాల్లో వారికి అభ్యంతరం చెప్పలేక మనకి మనమే సతమతమైపోతుంటాం. ఒక మహిళకు ఇటువంటి అనుభవమే ఎదురయ్యింది. పక్కింటివారి వ్యవహారం వలన ఆమెకు నిద్ర కూడా కరువయ్యింది. దీనిని ఎదుర్కొనేందుకు ఆమె చేసిన ఒక పని అవతలివారి ఆట కట్టించింది. ‘నిద్ర కూడా పోనివ్వడంలేదు’ ఆ మహిళ రెడిట్‌లో తన అనుభవాన్ని షేర్ చేసింది. తన పక్కింట్లో ఉన్నవారు ప్రతీరోజూ సాయంత్రం పార్టీలు నిర్వహిస్తూ, పెద్ద ఎత్తున మ్యూజిక్ సౌండ్ వినిపిస్తుడటంతో ఆమెకు నిద్ర కూడా పట్టేదికాదు. వీరి ఇళ్ల మధ్య సన్నని గోడ మాత్రమే అడ్డుగా ఉన్న కారణంగా రాత్రివేళ ఆ ఇంటిలోని సౌండ్ హోరు ఈ మహిళను తెగ ఇబ్బంది పెట్టేది. దీంతో ఆ మహిళ నిద్ర పట్టక ఆ విషయాన్ని పక్కింటివారికి చెప్పింది. సౌండ్ తగ్గించాలని కూడా కోరింది. పక్కింటివారు మాట విన్నప్పటికీ.. ఆ మహిళ చెప్పింది విన్న పక్కింటివారు మ్యూజిక్ సౌండ్ తగ్గించినప్పటికీ, అక్కడి వారి మాటల హోరు కారణంగా ఆమె ఇబ్బంది ఏమాత్రం తగ్గలేదు. ఇక ఆ ఇంటిలో ఉండటం కష్టమని ఆమెకు అనిపించింది. ఏ మాత్రం ప్రశాంతత లేదని భావించింది. ‘ఇది మా సమస్య కాదు’ ఈ విధంగా అమె ఐదు నెలల పాటు పక్కింటివారితో ఇబ్బందులను ఎదుర్కొంది. తిరిగి మారోమారు వారిని సౌండ్ తగ్గించాలని కోరింది. అయితే పక్కింటివారు ఆమెతో ‘ఇది మా సమస్య కాదు’ అని సమాధానం ఇచ్చారు. ఈ మాట విన్నవెంటనే ఆమెకు ఆగ్రహం కలిగింది. దీంతో పక్కింటి వారికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. వారి శైలిలోని సమాధానం చెప్పాలని.. ఈ మాట వినగానే ఆమె పక్కింటివారికి వారి శైలిలోనే సమాధానం చెప్పాలని అనుకుంది. వెంటనే ఒక పెద్ద స్పీకర్ కొనుగోలు చేసింది. ఫుల్ వాల్యూమ్‌తో రాత్రంతా మ్యూజిక్ వినిపిస్తూనే ఉంది. దీంతో పక్కింటిలోని వారికి నిద్ర ఎగిరిపోయింది. వెంటనే వారు ఆ మహిళ దగ్గరకు వచ్చి.. మ్యూజిక్ సౌండ్ తగ్గించాలని కోరారు. అప్పుడు ఆమె ‘ఇది నా సమస్య కాదు’ అని సమాధానం చెప్పింది. ‘ఇది పిల్లల ఆట’ ఆ మహిళ పోస్టును చూసిన పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ‘ఇది పిల్లల ఆట’లా ఉందని పేర్కొనగా, మరొకరు ‘పక్కంటి వారు పార్టీ చేసుకునే సమయంలో మీరు పడుకుంటే అది మీ సమస్య. దానిలో వారి తప్పేమీ లేదు’ అని అన్నారు. ఇంకొక యూజర్ ‘మీరు మంచి పని చేశారు. ఇటువంటి వారికి బుద్ది చెప్పడం ఎంతో అవసరం’ అని అన్నారు. ఇది కూడా చదవండి: సినిమాల్లో నటి నుంచి సెక్స్ రాకెట్ దాకా.. -
కామారెడ్డి జిల్లాలో దారుణం
-
వ్యక్తి దారుణ హత్య
జలమూరు: శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలం శ్రీముఖలింగం వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు నర్సన్నపేటకు చెందిన నల్లా విజయ్‌కుమార్(25)గా గుర్తించారు. ఎక్కడో చంపేసి ఇక్కడ పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వృద్ధరాలి దారుణ హత్య
అద్దె ఇంటి కోసం వచ్చి హత్యచేసిన దుండగుడు మూడు తులాల బంగారు గొలుసుతో పరారీ ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ, క్లూస్‌టీం కోదాడ : పట్టణ పరిధిలోని బాలాజీనగర్‌లో ఓ వృద్ధురాలు దారుణహత్యకు గురైంది. సోమవారం పట్టపగలు చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు పోలీసుల కథనం ప్రకారం.. బాలాజీనగర్‌కు చెందిన చిల్లంచర్ల అనసూర్యమ్మ (70) భర్త పాండురంగారావుతో కలిసి అదే కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో ముగ్గరు వేరే ప్రదేశంలో ఉంటుండగా మరో కుమారుడు ఇదే గ్రామంలో వేరుగా ఉంటున్నాడు. వృద్ధ దంపతులు మాత్రమే కిరాణ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆదివారం ఓ అపరిచిత యువకుడు అద్దెకు ఇల్లు కావాలని అనసూర్యమ్మ ఇంటికి వచ్చాడు. ముందు గది ఖాళీగా ఉండడంతో అద్దెకు ఇవ్వడానికి వృద్ధ దంపతులు అతనికి గదిని చూపించారు. గది అద్దె మాట్లాడుకుని సోమవారం మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. అన్న ప్రకారం సోమవారం సదరు యువకుడు మధ్యాహ్నం వచ్చాడు. అద్దెకు తీసుకున్న గదిని కడుక్కున్నాడు. అనసూర్యమ్మతో ముచ్చట్లు పెట్టసాగాడు. గంటల తరబడి అతను మాట్లాడుతుండడంతో విసుగుపుట్టిన పాండురంగారావు ఇంట్లోకి వెళ్లి పడుకున్నాడు. సాయంత్రం 4.30 గంటలకు నిద్ర లేచిన పాండురంగారావు అనసూర్యమ్మ కనపడకపోవడంతో అద్దెకు ఇచ్చే గదిలోకి వెళ్లి చూడగా ఆమె రక్తపు మడుగులో పడిఉంది. అతను కేకలు పెట్టడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి చూడడంతో అప్పటికే అనసూర్యమ్మ మరణించింది. ఆమె మెడలో ఉండాల్సి మూడు తులాల బంగారపు గొలుసు లేదు. దుండగుడు దాని కోసమే ఆమెను మాటల్లో పెట్టి వెనుక నుంచి తలపై కర్రతో బలంగా కొట్టడంతో ఆమె మరణించినట్లు భావిస్తున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పట్టణ సీఐ రజితారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికుని చేరుకొని పరిసరాలను పరిశీలించారు. నల్లగొండ నుంచి క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్ రప్పించి వివరాలు సేకరించారు. సూర్యాపేట డీఎస్పీ సునీత రాత్రి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కత్తులతో పొడిచి.. ఆపై గొంతుకోసి..
* నారెగూడెంలో వ్యక్తి దారుణ హత్య * పోలీసుల అదుపులో అనుమానితులు కట్టంగూర్ (నల్లగొండ): దుండగులు కత్తులతో పొడిచి.. ఆపై గొంతుకోసి ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు. ఈ ఘటన కట్టంగూరు మండలం నారెగూడెంలో శుక్రవారం వెలుగుచూసింది. శాలిగౌరారం రూరల్ సీఐ ప్రమీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి గ్రామానికి చెందిన కొండబత్తుల కృష్ణ (32) తన భార్య రమ్యతో కలిసి నాలుగు నెలల క్రితం గ్రామంలోని శ్యామల శేఖర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డికి చె ందిన సుమారు 100 ఎకరాల మామిడి, బత్తాయి తోటలో జీతం కుదిరారు. వీరితో పాటు మరో ఐదు కుటుంబాలు జీతం కుదిరి జీవనం సాగిస్తున్నాయి. కిరాణ సామాగ్రి కోసం వెళ్లి.. గురువారం సాయంత్రం కృష్ణ తన భార్య రమ్యతో చెప్పి సుమారు 6 గంటల ప్రాంతంలో కిరాణ సామగ్రి తెచ్చేందుకు గ్రామంలోకి వెళ్లాడు. రాత్రి పొద్దుపోయేంతవరకు భర్త ఇంటికి రాకపోవటంతో రమ్య విషయాన్ని తోటలోని తోటి కూలీలకు తెలియజేసింది. దీంతో కూలీలందరూ కలిసి బాట వెంట వెతుకుతుం డగా డొంక పక్కన స్కూటర్ కనబడింది. ఆ ప్రాంతం లో వెతకగా చెట్లపొదల్లో వ్యక్తి కనబడ్డా డు. దగ్గరికి వెళ్లి చూసే వరకు అప్పటికే కృష్ణ మృతి చెందాడు. తలపై తీవ్ర గాయాలతో పాటు, శరీరంలో నాలుగు కత్తిపోట్లు, గొంతు కోసి హతమార్చినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు హత్యోదంతం విషయం తె లుసుకున్న సీఐ ప్రవీణ్‌కుమార్, కట్టంగూర్, శాలిగౌరారం, నార్కట్‌పల్లి ఎస్ఐలు సత్యనారాయణ, మోతిరాం సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అదే రాత్రి నకి రేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న నల్లగొండ డీఎస్పీ సుధాకర్ శుక్రవారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్‌స్వాడ్‌ను రప్పించి పరిశోధించారు. మృతుడి భార్య, తోట సూపర్వైజర్తో తోటలోని కూలీలను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. కృష్ణ హత్యకు వివాహేతర సంబంధమే కారణమై ఉండవచ్చని పోలీసులు భావి స్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. మృతుడి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
వ్యక్తి దారుణ హత్య