కత్తులతో పొడిచి.. ఆపై గొంతుకోసి.. | brutal murder of a man in nalgonda | Sakshi
Sakshi News home page

కత్తులతో పొడిచి.. ఆపై గొంతుకోసి..

Published Sat, Mar 12 2016 3:49 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

కత్తులతో పొడిచి.. ఆపై గొంతుకోసి.. - Sakshi

కత్తులతో పొడిచి.. ఆపై గొంతుకోసి..

* నారెగూడెంలో వ్యక్తి దారుణ హత్య
* పోలీసుల అదుపులో అనుమానితులు

కట్టంగూర్ (నల్లగొండ): దుండగులు కత్తులతో పొడిచి.. ఆపై గొంతుకోసి ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు. ఈ ఘటన కట్టంగూరు మండలం నారెగూడెంలో శుక్రవారం వెలుగుచూసింది.  శాలిగౌరారం రూరల్ సీఐ ప్రమీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి గ్రామానికి చెందిన కొండబత్తుల కృష్ణ (32) తన భార్య రమ్యతో కలిసి నాలుగు నెలల క్రితం గ్రామంలోని శ్యామల శేఖర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డికి చె ందిన సుమారు 100 ఎకరాల మామిడి, బత్తాయి తోటలో జీతం కుదిరారు. వీరితో పాటు మరో ఐదు కుటుంబాలు జీతం కుదిరి జీవనం సాగిస్తున్నాయి.
 
కిరాణ సామాగ్రి కోసం వెళ్లి..
గురువారం సాయంత్రం కృష్ణ తన భార్య రమ్యతో చెప్పి సుమారు 6 గంటల ప్రాంతంలో కిరాణ సామగ్రి తెచ్చేందుకు గ్రామంలోకి వెళ్లాడు. రాత్రి పొద్దుపోయేంతవరకు భర్త ఇంటికి రాకపోవటంతో రమ్య విషయాన్ని తోటలోని తోటి కూలీలకు తెలియజేసింది. దీంతో కూలీలందరూ కలిసి బాట వెంట వెతుకుతుం డగా డొంక పక్కన స్కూటర్ కనబడింది. ఆ ప్రాంతం లో వెతకగా చెట్లపొదల్లో వ్యక్తి కనబడ్డా డు. దగ్గరికి వెళ్లి చూసే వరకు అప్పటికే కృష్ణ మృతి చెందాడు. తలపై తీవ్ర గాయాలతో పాటు, శరీరంలో నాలుగు కత్తిపోట్లు, గొంతు కోసి హతమార్చినట్లు ఆనవాళ్లు ఉన్నాయి.
 
ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
హత్యోదంతం విషయం తె లుసుకున్న సీఐ ప్రవీణ్‌కుమార్, కట్టంగూర్, శాలిగౌరారం, నార్కట్‌పల్లి ఎస్‌ఐలు సత్యనారాయణ, మోతిరాం సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అదే రాత్రి నకి రేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న నల్లగొండ డీఎస్పీ సుధాకర్ శుక్రవారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

క్లూస్ టీం, డాగ్‌స్వాడ్‌ను రప్పించి పరిశోధించారు. మృతుడి భార్య, తోట సూపర్‌వైజర్‌తో తోటలోని కూలీలను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. కృష్ణ హత్యకు వివాహేతర సంబంధమే కారణమై ఉండవచ్చని పోలీసులు భావి స్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. మృతుడి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement