mirror
-
అద్దాల ముస్తాబులో, డ్రీమ్ వెడ్డింగ్ ఫోటోలు వైరల్ (ఫోటోలు)
-
అద్దాల మిలమిలల్లో పెళ్లికూతురి లుక్ వైరల్
ప్రముఖ స్టైలిస్ట్ ఆకృతి సెజ్పాల్ డ్రీమ్ వెడ్డింగ్ నెట్టింట ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆమె ధరించిన ముసుగు, లెహంగా అతిథులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ముఖ్యంగా మొత్తం అద్దాలతో తయారు చేసిన లెహెంగాలో వధువు ‘ఆకృతి’ మరింత ఆకర్షణగా నిలిచింది.వధువు ఆకృతి సెజ్పాల్ 3డీ డిజైన్, పూర్తిగా పూలతో చేసిన పెళ్లి కూతురు వేసుకునే మేలి ముసుగులను చూశాం. కానీ పూర్తిగా మిర్రర్ వర్క్‌తో రూపొందించడం విశేషంగా నిలిచింది. లెహెంగాకు తోడుగా ఏమాత్రం క్లాత్ వాడకుండా తయారు చేసిన దుపట్టా కమ్ మేలి ముసుగుతో పెళ్లి కళతో కళకళలాడింది ఆకృతి. ఇంకా స్వీట్హార్ట్-నెక్లైన్ బ్లౌజ్, హెవీ లెహంగా స్కర్ట్, ఓపెన్ హెయిర్‌స్టైల్‌పై పిన్ చేసిన షీర్ దుపట్టాలో అందంగా మెరిసిపోయింది. చోకర్ నెక్‌పీస్, మ్యాచింగ్ జుమ్కీలు, పాపిట బిళ్లతో తన లుక్‌ను మరింత అద్భుతంగా ముస్తాబైంది.< View this post on Instagram A post shared by Itrh (@itrhofficial)br> -
పురావస్తు తవ్వకాల్లో విచిత్ర అద్దం.. అది అట్టాంటి ఇట్టాంటిది కాదట!
ఇజ్రాయెల్‌లో ఒక విచిత్ర ఉదంతం వెలుగు చూసింది. ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాంతానికి చెందిన 10వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల యువతికి పురాతన అద్దం దొరికింది. ఇది 1500 ఏళ్ల క్రితం నాటిదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ అద్దాన్ని పురాతన కాలంనాటి ప్రజలు తమపై చెడు దృష్టి పడకుండా ఉండేందుకు ఉపయోగించేవారని సమాచారం. హైఫాకు చెందిన ఆ అమ్మాయి పేరు అవివ్ వీజ్‌మన్. ఈ అమ్మాయి ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ చేపట్టిన పురావస్తు తవ్వకాల కార్యక్రమంలో పాల్గొంది. ఈ సమయంలో ఆమెకు అద్దం లభించింది. ఇజ్రాయెల్ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ తవ్వకాల పనుల్లో 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో అవివ్ వీజ్‌మన్ ఒకరు. పురావస్తు శాస్త్రానికి సంబంధించిన సమాచారాన్ని విద్యార్థులకు తెలియజేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం. బైజాంటైన్ కాలం నాటి అద్దం ఈ అద్దం దొరికిన ప్రదేశానికి ఉష అని పేరు పెట్టారు. ఇది బైజాంటైన్ కాలం నాటిదని సమాచారం. ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ క్యూరేటర్ నెవిట్ పోపోవిచ్ తెలిపిన వివరాల ప్లేట్ మధ్యలో ఉన్న ఈ గాజు అద్దం 6వ శతాబ్దపు బైజాంటైన్ కాలం నాటి 'మ్యాజిక్ మిర్రర్'లో భాగమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అద్దం అంత్యక్రియలకు బహుమతిగా ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. భవనం గోడ నుండి బయటపడిన అద్దం తవ్వకాల్లో భాగంగా డిగ్గర్లు తమ పనిలో నిమగ్నమై ఉండగా, 17 ఏళ్ల అవియాకు ఆ అద్దం కనిపించింది. ఆమె దానిని సీనియర్ అధికారులకు చూపించింది. దానిని పరిశీలించిన అధికారులు అది1500 సంవత్సరాల నాటి అద్భుత అద్దం అని, దానిని చెడు దృష్టిని పోగొట్టుకునేందుకు ఉపయోగించేవారని తెలిపారు. ఇది దెయ్యాలు తరహా దుష్టశక్తులను దూరం చేస్తుందని నాటి కాలంలో నమ్మేవారట. దుష్టబుద్ధి కలిగినవారు ఈ అద్దంలో వారి ప్రతిబింబాన్ని చూసుకున్నప్పుడు, అద్దం యజమానిపై చెడు ప్రభావం ఉండదని నమ్మేవారట. అంత్యక్రియలకు బహుమతులుగా ఇలాంటి అద్దాలు ఇచ్చేవారని చరిత్ర చెబుతోంది. ఇది కూడా చదవండి: వింతజీవుల అకస్మాత్తు దాడులు.. గ్రహాంతరవాసులే అంటున్న జనం! -
RTC: ప్రమాదాల విరుగుడుకు మూడో మిర్రర్!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు దిగిన భార్యాభర్తలు మరో బస్సు ఎక్కాలన్న ఆత్రుతలో దిగిన బస్సు ముందు నుంచే రోడ్డు దాటబోయారు. వారు రోడ్డు దాటుతున్నది కనిపించక బస్సు డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. బస్సు తగిలి ఇద్దరూ కింద పడిపోగా బస్సు చక్రాలు వారిని చిదిమేశాయి. కొద్దిరోజుల క్రితం సికింద్రాబాద్‌లో జరిగిన దుర్ఘటన అక్కడి వారిని కలిచివేసింది. ఇందులో తప్పెవరిది..? బస్సు డ్రైవర్‌కు కొన్ని కోణాల్లో ముందున్న ప్రాంతం కనిపించదు. అందులో ముఖ్యమైంది బస్సు ముందు దాదాపు మూడునాలుగు అడుగుల స్థలం. దాన్నే బ్లైండ్స్పాట్గా చెబుతారు. తక్కువ ఎత్తున్న వారు, బస్సు రేడియేటర్ ముందు నుంచి ద్విచక్రవాహనంపై వెళ్లేవాళ్లు ఆ ప్రాంతంలో బస్సును దాటుతున్నప్పుడు వారిని గుర్తించటం డ్రైవర్‌కు సాధ్యం కాదు. ఆ ప్రాంతంలో ఎవరూ బస్సు దాటకూడదని తరచూ ఆర్టీసీ అధికారులు ప్రకటనలు చేస్తున్నా చాలామంది అవగాహన లేక దాటుతూ బస్సు చక్రాల కింద నలిగిపోతున్నారు. దానికి విరుగుడుగా ఆర్టీసీ బస్సు ముందుభాగంలోని ‘కనపడని ప్రాంతం’డ్రైవర్‌కు కనిపించేలా ప్రత్యేకంగా మిర్రర్ ఏర్పాటు చేస్తోంది. ప్రత్యేక ఏర్పాటు కొంతకాలంగా ఆర్టీసీ బస్సులకు ముందు భాగంలో మూడు మిర్రర్లు కనిపిస్తున్నాయి. ఆయా డిపోల్లో ప్రత్యేకంగా వాటిని బిగిస్తున్నారు. బస్సు ముందు భాగంలో ఉండే రెండు అద్దాల మధ్య బయటి నుంచి ఈ మిర్రర్ ఏర్పాటై ఉంటోంది. ఇటీవల కొత్తగా కొనుగోలు చేసిన సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులకు మాత్రం బస్సు ముందు రెండు వైపులా ఉండే సైడ్ మిర్రర్ రాడ్లకే ఈ ప్రత్యేక మిర్రర్ బిగించి ఉంది. బస్సు బాడీని నిర్మించేటప్పుడే వీటిని బిగిస్తుండటం విశేషం. బస్సు ఆగినప్పుడు అందులోంచి దిగిన వారో, ఆ బస్సు ఎక్కాలన్న ఆత్రుతలో పక్క నుంచి వచ్చిన వారో బస్సు ముందు భాగం నుంచి దాటుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. అలాంటి ప్రమాదాల్లో ఎక్కువ మంది మృత్యువాతపడుతున్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్టీసీ పెద్దమొత్తంలో నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తోంది. దీంతో ఈ సమస్యకు పరిష్కారంగా ఆర్టీసీ అధికారులే ఈ ఆలోచన చేశారు. ఆ మిర్రర్ లో బస్సు ముందు భాగం డ్రైవర్‌కు స్పష్టంగా కనిపిస్తుంది. బస్సును ముందుకు కదిలించేప్పుడు ఆ మిర్రర్‌ను చూసి ముందు భాగంలో ఎవరూ లేరని నిర్ధారించుకున్నాకే కదిలించాలని డిపో మేనేజర్లు డ్రైవర్లకు సూచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని బస్సులకు వీటిని బిగించారు. కొద్ది రోజుల్లో అన్ని బస్సులకు ఏర్పాటు చేయనున్నారు. -
కోర్టు బోనెక్కి సాక్ష్యం చెప్పనున్న ప్రిన్స్ హ్యారీ
లండన్: బ్రిటన్ రాజు చార్లెస్ –3 చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ సాక్ష్యం ఇవ్వడానికి వచ్చే వారంలో కోర్టుకు హాజరుకానున్నారు. రాజకుటుంబానికి చెందినవారు ఇలా కోర్టు బోనెక్కడం 130 ఏళ్లలో ఇది తొలిసారి. డైలీ మిర్రర్, సండే మిర్రర్ వంటి వార్తా పత్రికల ప్రచురణ సంస్థ మిర్రర్ గ్రూప్ న్యూస్‌పేపర్స్ (ఎంజీఎన్) సెలిబ్రిటీల వ్యక్తిగత అంశాలను సేకరించడం కోసం చట్ట విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందన్న ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై 100 మంది సెలిబ్రిటీలతో పాటు ప్రిన్స్ హ్యారీ కూడా మిర్రర్ గ్రూప్‌పై కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును విచారిస్తున్న లండన్ హైకోర్టులో ప్రిన్స్ హ్యారీ హాజరై ఫోన్ ట్యాంపింగ్‌పై సాక్ష్యం ఇవ్వనున్నారు. గతంలో 1870లో ఎడ్వర్డ్–7 ఒక విడాకుల కేసులో సాక్ష్యమిచ్చారు. -
Viral Video: జస్ట్ మిస్! లేదంటే.. తల పుచ్చకాయలా పగిలిపోయేది
ఒక్కోసారి మనం అనుకున్నట్లుగా జరగదు. ఎంత ప్రీ ప్లాన్‌గా ఉన్న ఊహించిన విధంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. అచ్చం అలానే ఒక జంట ఫ్రాంక్ వీడియో కోసం చేస్తుండగా ఊహించని విధంగా ప్రమాదం ఎదురైంది. ఐతే కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ...భార్యలకు తెలియకుండా ఫ్రాంక్ చేసేందుకు యత్నిస్తాడు. అందులో భాగంగానే విచిత్రమైన వేషధారణలో ఒక గదిలో ఉంటాడు. ఇంతలో అనుకోకుండా అతడి భార్య ఆ గదిలోకి వస్తుంది. అక్కడ ఉన్న తన భర్తను ఎవరో అపరిచిత వ్యక్తి అనుకుని సుత్తితో దాడి చేస్తుంది. ఐతే అతను జస్ట్ తప్పుకుంటాడు కాబట్టి సరిపోతుంది లేదంటే అతడి తల కచ్చితంగా పగిలిపోయేది. అతడి భార్య చేసిన దాడికి అక్కడే ఉన్న అద్దం పగిలిపోతుంది. పాపం అతడి భార్య ఐమ్ సారీ అంటూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. View this post on Instagram A post shared by NowThis (@nowthisnews) (చదవండి: విలన్ రేంజ్లో రెచ్చిపోయిన వ్యాపారి..మహిళను కాలితో తన్ని...) -
వైరల్ వీడియో: అద్దంలో చూసుకుని ఖంగుతిన్న ఎలుగుబంటి
-
అద్దంలో చూసుకుని ఖంగుతిన్న ఎలుగుబంటి: వీడియో వైరల్
చిన్నప్పటి కథలలో విని ఉంటాం. జంతువులు తమ ప్రతిబింబాన్ని చూసుకుని దడుచుకుని పారిపోతాయని. గానీ అవి తమను తాము చూసుకుని ఏం చేస్తాయో నిజంగా ఐతే తెలియదు కదా. ఇప్పడు నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ద్వారా అవి ఏం చేస్తాయో చూస్తే నవ్వాగదు. వివరాల్లెకెళ్తే...ఎవరో కొంతమంది ఒక చెట్టుకి పెద్ద అద్దాన్ని కట్టి ఉంచారు. ఇంతలో అటుగా ఒక ఎలుగు బంటి వచ్చింది. అది ఆహారం కోసం అటు ఇటూ చూస్తూ...ఈ అద్దం వైపు చూసింది. అంతే ఒక్కసారిగా అద్దంలో తన ముఖాన్ని అది చూసుకుని కంగారుపడిపోతుంది. ఇంకో ఎలుగుబండి ఉందనుకుని ఒక్కసారిగా పరుగెత్తేందుకు ప్రయత్నిస్తుంది. ఇంతలో అద్దం కాస్త కిందపడిపోతుంది. ఈ ఘటనకు సంబందించిన వీడియోను టైమ్స్ నౌ' వార్త సంస్థం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. సరదాగా మీరు కూడా ఓ లుక్కేయండి. -
దెబ్బ తిన్న జేమ్స్ వెబ్ టెలిస్కోప్.. నాసా ఆందోళన
వాషింగ్టన్ డీసీ: అంతరిక్ష పరిశోధనల్లో అత్యంత సంచలనంగా.. అదే సమయంలో కీలకంగానూ మారింది జేమ్స్ వెబ్ టెలిస్కోప్. ప్రపంచంలోనే అత్యంత భారీ, శక్తివంతమైన టెలిస్కోప్‌గా దీనికి ఒక పేరు ముద్రపడింది. అంతెందుకు అంతరిక్ష శూన్యంలో ఆరు నెలల కాలం పూర్తి చేసుకుని.. అద్భుతమైన చిత్రాలను విడుదల చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే, తాజాగా ఓ నివేదిక అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా National Aeronautics and Space Administration ను ఆందోళనకు గురి చేస్తోంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ దెబ్బ తిందని.. రాబోయే రోజుల్లో అది టెలిస్కోప్ పని తీరుపై ప్రభావం చూపనుందన్నది ఆ నివేదిక సారాంశం. కమీషనింగ్ ఫేజ్‌లో టెలిస్కోప్ పని తీరును పరిశీలించిన సైంటిస్టుల బృందం ఈ విషయాన్ని ధృవీకరించినట్లు సదరు కథనం పేర్కొంది. ప్రస్తుతం, అనిశ్చితి యొక్క అతిపెద్ద మూలం సూక్ష్మ ఉల్కలతో దీర్ఘకాలిక ప్రభావాలు ప్రాధమిక అద్దాన్ని నెమ్మదిగా క్షీణింపజేస్తాయి అని సైంటిస్టులు చెప్తున్నారు. మే 22వ తేదీన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రాథమిక అద్దం, ఆరు మైక్రోమెటీరియోరైట్స్(సూక్ష్మ ఉల్కలు) కారణంగా దెబ్బ తింది. చివరి ఉల్క ఢీకొట్టడంతోనే టెలిస్కోప్ అద్దం దెబ్బతిందని సైంటిస్టులు స్పష్టం చేశారు. ప్రభావం చిన్నదిగానే చూపిస్తున్నప్పటికీ.. అది రాబోయే రోజుల్లో ఎంత మేర నష్టం చేకూరుస్తుందన్న విషయంపై ఇప్పుడే ఒక అంచనాకి రాలేమని సదరు సైంటిస్టులు పేర్కొన్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన అబ్జర్వేటరీ ప్రభావం ఎంతవరకు ఉందో చూపించే చిత్రాన్ని శాస్త్రవేత్తలు విడుదల చేశారు. అదే సమయంలో డ్యామేజ్ గురించి స్పందించిన జేమ్స్ వెబ్ రూపకర్తలు.. టెలిస్కోప్ అద్దాలు, సన్‌షీల్డ్(టెన్నిస్ కోర్టు సైజులో ఉంటుంది)లు ఉల్కల దెబ్బతో నెమ్మదిగా పని చేయడం ఆపేస్తాయని తేల్చడంపై నాసా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో ఈ సమస్యను వీలైనంత త్వరగతిన పరిష్కరించాలనే ఆలోచనలో ఉంది నాసా. ఇదిలా ఉంటే హబుల్ టెలిస్కోప్ తర్వాత.. ప్రపంచంలోనే అత్యంత భారీ టెలిస్కోప్‌గా పేరు దక్కించుకుంది జేమ్స్ వెబ్ టెలిస్కోప్. నాసా NASA, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ESA), కెనడియన్ స్పేస్ ఏజెన్సీ(CSA)ల సహకారంతో సుమారు 10 బిలియన్ల డాలర్లు వెచ్చించి తయారు చేయించింది. ఈ టెలిస్కోప్ మిర్రర్స్ చాలా చాలా భారీ సైజులో ఉంటాయి. డిసెంబర్ 25, 2021లో దీనిని అంతరిక్షంలోకి ప్రయోగించగా.. ఫిబ్రవరి నుంచి భూమికి 1.6 మిలియన్ కిలోమీటర్ల దూరంలో L2 పాయింట్ వద్ద ఇది కక్ష్యలో భ్రమిస్తూ ఫొటోలు తీస్తోంది. వెబ్ యొక్క అద్దం అంతరిక్షంలో తీవ్ర వేగంతో ఎగురుతున్న దుమ్ము-పరిమాణ కణాలతో బాంబు దాడిని తట్టుకునేలా రూపొందించబడిందని నాసా గతంలో ప్రకటించుకుంది. కానీ, ఇప్పుడు చిన్న చిన్న ఉల్కల దాడిలో దెబ్బ తింటుండడం ఆసక్తికరంగా మారింది. -
కథ: అద్దం.. అప్పుడు అసహ్యంగా కనిపించింది.. ఇప్పుడేమో!
ఇవ్వాళ పదవీ విరమణ. పోలీసుశాఖలో ఉద్యోగం. అలవాటు కొద్దీ త్వరగా నిద్రలేచాను. నాలుగింటికే వచ్చే పేపరు బాయ్ ఇంకా రాలేదు. సీనియర్లు రిటైరైయినప్పుడు మా ఆఫీసులో పెద్ద అట్టహాసమే జరుగుతుంది. ఆలోచిస్తూ బ్రష్ చేసుకొని స్నానానికని బాత్రూమ్లోకి వెళ్లా. యాథాలాపంగా చిన్నలైట్కు బదులు పెద్దలైట్ వేశాను. అద్దంలో నెరిసిన జుట్టు వెండిలా తెల్లగా మెరుస్తోంది. రిటైర్మెంట్ ఆలోచనల్లోనున్న నాకు, హఠాత్తుగా ఓ విషయం గుర్తుకొచ్చింది. అదే.. నాకు అద్దమంటే చాలా భయం. అద్దం నాకు నచ్చదు. ఈరోజు నాకు విచిత్రంగా తోచింది. భయం పోయిందా? నిజమా! కలా? గిల్లి చూసుకున్నాను. ‘పేపర్..’ బయట పేపర్ బాయ్ అరుపు వినబడింది. ‘కల కాదు నిజమే!’ అద్దమంటే నాకున్న అయిష్టం, భయం ఇప్పటిది కాదు. నాన్న దూరమైనప్పటిది. చానాళ్ల తరువాత ఈరోజు అద్దాన్ని ఇలా ధైర్యంగా చూస్తున్నా. ‘అద్దం మసకగా కన్పిస్తోంది. నిజంగా మసకబారిందా? లేక నా కంటిచూపు మందగించిందా? తెలియలేదు. అద్దంలో మరకలున్నాయేమోనని శ్రద్ధగా టవల్ బెట్టి తుడిచాను. అయినా అవి పోలేదు. అవి నా మనసుపై పడిన మరకలు. రవి గుర్తుకొచ్చాడు. నాన్న గుర్తుకొచ్చినపుడల్లా రవి గుర్తుకొస్తాడు. అద్దంలాగే వాళ్ళు నిజానికి ప్రతిబింబాలు. వాళ్ళ జ్ఞాపకాలు నా మనసు మీద బలంగా నాటుకుపోయిన అద్దానికి సాక్ష్యాలు. వాళ్ళు గుర్తుకురాగానే నా ముఖం వివర్ణమైంది. క్రమంగా వికృతమైంది. ఇంతకు ముందయితే ఇలాంటప్పుడు అద్దం పగలగొట్టాలనే కోరిక బలంగా ఉండేది. ‘ముఖం బాగాలేక అద్దం పగలగొట్టుకున్నట్టు’ సామెత గుర్తుకొచ్చింది. వైరాగ్యం ఆవహించింది. అద్దంలో నిజమే కన్పిస్తుందంటారు.. మరి ఇది నా ముఖం కాదుకదా. నా ముఖం ఎక్కడ? అద్దాన్ని మనసు ప్రశ్నిస్తూనే ఉంది. ఎంత అహంకారం. అది జవాబివ్వదు. నాకెప్పుడూ అద్దం అందంగా కనపడదు. అలాంటప్పుడు ఈ అద్దాన్ని నేనెందుకు చూడాలి? నాన్న, రవి ఆలోచనలతో మనసంతా సంతలో మనుషుల్లా గజిబిజిగా మారింది. ∙∙ ముప్పై సంవత్సరాలుగా ఉద్యోగ జీవితంలో పోలీసు యూనిఫామ్ భాగమైంది. ఆఫీసరు హోదా, దర్జా ఎప్పుడూ నా వెంటే ఉండేవి. వాటికోసం నేను అద్దం ముందు నిలబడక తప్పేది కాదు. నిలబడ్డప్పుడు ప్రపంచం చూసే ముఖం అందంగా కన్పించేది. కాసేపట్లో గతం గుర్తుకొచ్చి అద్దంలో రంగులు మారేవి. అద్దానికి జీవగుణం ఉందనిపించేది. ఊసరవెల్లిలా దానికిన్ని రంగులు ఎలా అబ్బాయో? ఎంత ఆలోచించినా అర్థంకాదు. అద్దం అబద్ధం చెప్పదు అంటారు కదా. మరి నాకెందుకు అబద్ధం చెబుతోంది. నా నిజరూపాన్ని ఎందుకు చూపడం లేదు? చాలాసార్లు నిలదీశా! లక్ష్యపెట్టలేదు. దానిపని దానిది, నా పని నాదే అయింది. కాలం గడిచిపోయింది. నా సర్వీసు మొత్తం ఆ జ్ఞాపకాలను మోయలేక, వర్తమానాన్ని భరించలేక.. అదో అవస్థ. ∙∙ బొడ్డుతాడు ఊడిపడక ముందే బస్టాండులో వదిలేసిన రవిని పుణ్యాత్ములెవరో అనాథాశ్రమంలో చేర్చారు. గాంధీజయంతికి ఒకసారక్కడికి వెళ్లాను. అక్కడ నూటా యాభైమందికి పైగా పిల్లలున్నారు. ముందువరుసలో చురుగ్గానున్న ఆ పిల్లవాడు నన్ను ఆకర్షించాడు. గళ్లచొక్కా, పొట్టి నిక్కరు. చందమామవంటి మోము. పెద్ద కళ్ళు. నల్లటి ఉంగరాల జుత్తు. చక్కని కంఠం. దర్జా ఉట్టిపడేలా రూపురేఖలు. అతనే రవి. వేదికమీదున్న అందరి దృష్టి రవిపైనే. ప్రసంగాలు పూర్తయి బహుమతి ప్రదానోత్సవం ప్రారంభమైంది. ఆటలు, పాటలు, చదువు అన్నింటిలోనూ రవే మొదటి బహుమతి విజేత. కార్యక్రమం చివరలో రవి కీబోర్డును వాయిస్తూ అమ్మానాన్నపై ఎంత అద్భుతంగా పాడాడు?! అందరూ ముచ్చటపడ్డారు. వచ్చిన అతిథులంతా తమకు తోచిన సాయం ప్రకటించారు. నేను మాత్రం బయటపడలేదు. నా మనసు నన్ను ప్రశ్నించింది. దాని గొంతును అధికారంతో నోక్కేశాను. వెళ్తూ వెళ్తూ రవిని దగ్గరికి పిలిచి ‘ఏం చదువుతున్నావ’ని అడిగాను. ‘పదోతరగతి సార్’ చేతులు కట్టుకుని వినయంగా చెప్పాడు. జీప్‌లో స్టేషనుకు బయల్దేరాను. ఆశ్రమం వదిలినా, మనసులో రవి టాలెంట్ చెదిరిపోలేదు. ∙∙ డ్యూటీ ముగించుకొని ఇంటికి చేరుకున్నాను. ‘అంత టాలెంట్ నా పిల్లలలో కూడా లేదాయే’. రవి మీద అసూయ కలిగింది. రవి ఆలోచనలతో ఉన్న నేను అప్రయత్నంగా ఇంట్లోనున్న అద్దంలో నా మొఖాన్ని చూశాను. అద్దం దాని బుద్ధి చూపింది. ఛ.. అసహ్యంగా కన్పించింది. అద్దాన్ని తుడవమని నా శ్రీమతికి చెప్పాను. ఈ అద్దం నాకు నచ్చలేదు. అద్దం మార్చమనీ చెప్పాను. పడుకునేటప్పుడు ఆలోచించాను. కొంపదీసి అద్దం నన్ను పగబట్టిందా? ఆ ఊహకే నాకు నవ్వొచ్చింది. అద్దం నాకు శత్రువా? మిత్రువా? అద్దాన్ని చిన్నప్పుడు నా మిత్రుడిలా భావించాను. రహస్యాలు చెప్పుకున్నాను. నా భాధలు, ఆనందాలను పంచుకున్నాను. నా మాటలన్నీ అద్దానికే ముందు విన్పించే వాడిని. ఈ అద్దానికి విశ్వాసం లేదు. దానిదంతా మనిషిలాగే వక్రబుద్ధి. స్వార్థబుద్ధి్ద. అద్దం అబద్ధం. అద్దంతో నాకు ఏ బంధుత్వం లేదనిపించింది. అప్పుడప్పుడూ చూసే అద్దాన్ని ఇకపై మొత్తానికే చూడొద్దని తీర్మానించుకున్నాను. హాయిగా నిద్రపట్టింది. ∙∙ ఈలోగా కరెంటు పోయొచ్చింది. చీకటిలోనున్న గతంపైకి వెలుగొచ్చింది. అద్దం తేటగా ఉంది. రవి ఆలోచనల నుండి బయటకొచ్చాను. ఎందుకో అద్దం ఈరోజు బాత్రూమ్లో గురువులా కన్పిస్తోంది. నాతో ఏదో చెప్పాలని సిద్ధమైనట్టుంది. ఉద్యోగంలో చేరిన మొదటిరోజు సినిమా రీలులా జ్ఞాపకానికి వచ్చింది. ఉద్యోగం సాధించడానికి ఎంత శ్రమ పడ్డాను. ఉద్యోగంలో చేరిన ఆరోజు అమ్మ ఎంతో సంతోషించింది. నాన్న గుర్తుకొచ్చాడు. నా భావాన్ని అర్థం చేసుకున్న అద్దం కన్నీరు కారుస్తోంది. కొంపదీసి అద్దానిది మొసలి కన్నీరు కాదుకదా? పోలీసోడిని. నీడను సైతం నమ్మరాదని శిక్షణలో ఉగ్గుపాలతో రంగరించి చెబుతారు. అద్దంపై జాలి కలిగింది. ఆర్తితో అద్దం కన్నీళ్లు తుడిచాను. తేటగయ్యింది. ఇప్పుడు ముఖం తేటగా కనపడుతోంది. అద్దానికి కూడా హృదయం ఉన్నట్టుంది. ఆలోచనలు నా మదిని నింపినట్టే.. వదిలిన ట్యాప్.. బకెట్‌ను నింపింది. నీళ్ళచప్పుడుకు ఈలోకంలోకి వచ్చాను. నీళ్ళు మగ్గులో తీసుకొని వంటిపై పోసుకున్నాను. కమ్మని మట్టిపరిమళం. ఆశ్చర్యపోయాను. అరె! కాంక్రీటు జంగిల్లో మట్టివాసనా? ఎక్కడినుండి వస్తుందని చుట్టూ వెదికాను. అది నా శరీరం నుండేనని కాసేపటికి తెలిసింది. తృప్తిగా పీల్చాను. మట్టివాసనతో నా ఆలోచనలు క్షణాల్లో ఊరికి పరిగెత్తాయి. ∙∙ నాది నకిరేకల్ దగ్గర ఒగోడు. మొదట పోలీసుశాఖలో నేను ఎస్.ఐగా జాయిన్ అయ్యాను. అంచెలంచెలుగా డీఎస్పీ స్థాయి వరకు పదోన్నతి పొందాను. మాది సాధారణ రైతు కుటుంబం. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న తాత అమరవీరుడు. నికార్సయిన నిజాం విముక్తి పోరాటానికి గెరిల్లా దళాన్ని చాకచక్యంగా నడిపిన తాత గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. చూడటానికి తాత, నాన్న అన్నదమ్ములవలె ఉండేవారట. తాత రూపు, భావాలకు నాన్న అద్దంలో ప్రతిబింబంలా ఉండేవాడు. తాత అభ్యుదయ భావాలను నాన్న జీవితాంతం బాధ్యతగా మోశారు. ఆరోజుల్లో నాన్న ఉర్దూ మీడియంలో నాలుగు వరకు చదువుకున్నాడు. మంచి వక్త. చైతన్యం కలిగిన వాడు మాత్రమే కాదు. మాటలను నిప్పురవ్వలా మార్చి చైతన్య కాగడాలను వెలిగించే మనిషి. దాంతో ఉన్నోళ్లకు శత్రువయ్యాడు. లేనోళ్లకు బంధువయ్యాడు. ‘దున్నేవానిదే భూమి’. ఈమాట నాన్న నోటినుండి ప్రతిరోజూ పాఠంలా వినేవాణ్ణి. అలాగని నాన్న హింసావాది కాదు. గాంధీని చాలా ఇష్టపడేవాడు. దేశానికి ‘గాంధేయ కమ్యూనిజం’ కావాలనేవాడు. ఆమాట విన్న కమ్యూనిస్టులు నాన్నను విచిత్రంగా చూసేవారు. నాన్న భావజాలం, ఆలోచనలు నా ఆలోచనా పరిధిని పెంచాయి. నాకు బడి ఎంతో, ఇల్లూ అంతే. రెండు చోట్లా బోధనే జరిగేది. అప్పుడు నేను ఆరోతరగతిలో ఉన్నాను. సాంఘికశాస్త్రం మాస్టారు ‘భూమి నిలకడగా ఉండదు. ఆకర్షణతో ఎల్లప్పుడూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది’ అని చెప్పారు. ఆశ్చర్యమేసి ‘భూమి.. సూర్యుని చుట్టూ ఎందుకు తిరుగుతుంది నాన్న?’ అని అడిగాను. నాన్న మాత్రం ‘భూమి ఎల్లప్పుడూ ఉన్నోడి చుట్టూ తిరుగుతుంది. పేదోని కష్టం చుట్టూ ఉన్నోళ్ళ ఆశలు తిరుగుతాయి’ అన్నాడు. ఆ రెండు విషయాలు నా మనసులో బలంగా ముద్రించుకుపోయాయి. ఒకటి శాస్త్రీయత, రెండవది అనుభవం. ఏదేమైనా భూమి స్థిరంగా ఉండదని మాత్రం అర్థమయింది. నాకు చిన్నప్పుడు మాట్లాడడమంటే చాలా భయం. నాన్న అది గమనించి ‘ప్రశ్నించే వాడే ఉత్తముడు, మాట్లాడేవాడే మనిషి’ అని చెప్పాడు. టౌనుకు పోయి పెద్ద నిలువుటద్దం తెచ్చాడు. ఆ అద్దం ముందు నిలబడి, నన్ను మాట్లాడమని ప్రోత్సహించాడు. క్రమంగా కొంతకాలానికి నాకున్న భయం పోయింది. ధైర్యంగా మాట్లాడసాగాను. ‘మీ నాన్నలాగే మాట్లాడుతున్నావు’ అనే అమ్మ పొగడ్తలు ఉత్సాహాన్నిచ్చేవి. నన్ను అద్దం కూడా అలాగే చూసేది. ∙∙ అద్దం మీద కోపం వచ్చిన ఆరోజు.. నా జీవితంలో మర్చిపోలేను. ఆరోజు బడికి సెలవు. అద్దం ముందున్నాను. పంద్రాగస్టు ఉపన్యాసం కోసం సాధన చేస్తున్నాను. నాన్నకు విన్పించి మెప్పు పొందాలని ఉత్సాహంతో ఉన్నాను. చీకటి పడింది. ఇంకా నాన్న రాలేదు. పిడుగు పడ్డట్టు నాన్న చావు కబురొచ్చింది. శవాన్ని వెతుక్కుంటూ నన్ను, దీపాన్ని తీసుకొని అమ్మ ఊరవతలి అడవికి నడిచింది. చిమ్మచీకటి. అమ్మ వెక్కివెక్కి ఏడ్చింది. నడుస్తూ నడుస్తూ నేలమీద కుప్పకూలిపోయింది. చీరకొంగును నోట్లో కుక్కుకుని ఏడ్పును అదుముకుంది. చీకటంతా ఆ అడవిలోనే ఉన్నట్టుంది. అంతచీకటిని మొదటిసారి చూసేసరికి భయం వేసింది. భయంతో మెదడు గడ్డకట్టుకుంది. చాలాసేపటిదాక వెతికినా గుడ్డి దీపానికి నాన్న చిక్కలేదు. ఏ అర్ధరాత్రో మా వెదుకులాటకు కాలం తీరింది. వాగు దగ్గర రాళ్ళమధ్య చలనం లేకుండా పడున్నాడు నాన్న. ఒంటినిండా తూటాల గాయాలు. నెత్తుటి మడుగులో ఒంటిపై అడవిచీమలు పట్టి ఉన్నాయి. అమ్మ ధైర్యం పారే వాగులా కన్నీరయింది. ఆరాత్రి మా దుఃఖం చీకటినేమీ మార్చలేకపోయింది. పొద్దు పొడిచింది. జనం జాతరలా కదిలారు. నాన్నను పొద్దు ఇష్టపడింది కాబోలు. వెంటే తీసుకుపోయింది. నాన్నపోయాక ఇంటికి పోలీసులొచ్చేవారు. వాళ్ళను చూసి అమ్మ గజగజ వణికిపోయేది. తరువాత ఆ ఊరొదిలేశాం. ఇంత జరిగినా అద్దం ఏమీ పట్టనట్టుగా ఉన్నట్టనిపించింది. దాంతో అద్దం మీద కోపం, పోలీసుద్యోగం మీద ఇష్టం పెరిగింది. ∙∙ నాన్న ఆలోచనలతో స్నానం ముగించాను. బయటకు వచ్చి కాసేపు ధ్యానం చేశాను. తరువాత పేపరును పూర్తిగా చదివాను. ఈ పాతికేళ్ళు ఉద్యోగంలో ఎన్నో తప్పులు, ఒప్పులు, చీత్కారాలు, సత్కారాలు. మారుతున్న కాలాన్ని గమనించనేలేదు. నేను కాలాన్ని నడిపాననుకున్నాను. కానీ కాలమే నన్ను నడిపిందని ఈరోజు అర్థమైంది. హడావుడిగా కాలంతో పరుగెత్తే అలవాటున్న నేను ఈ రోజు మాత్రం నింపాదిగా ఉన్నాను. కాలం కూడా నాలాగే ముసలిదైపోయిందా? ఎందుకో కాలం నెమ్మదిగానే నడుస్తోంది మరి. శ్రీమతి టిఫిన్ తయారుచేసి టేబుల్ మీదకు పిలిచింది. టిఫిన్, కాఫీలయ్యాక ఒక లెటరు తెచ్చి నా చేతికిచ్చింది. క్వార్టర్ ఖాళీ చేయమని దాని సారాంశం. ఇన్నాళ్ళు పోలీసుశాఖలో పనిచేసిన నాకు సొంత ఇల్లు కూడా లేదు. ‘నిజాయితీ నీకు నిలువ నీడలేకుండా చేసిందిరా’ అని మిత్రులు సరదాగా అన్నా, అద్దం చెప్తున్నంత నిజంగా తోచింది. మనసు భారంగా మారింది. డ్రైవరొచ్చాడు. సెల్యూట్ చేశాడు. అందులో భయంకంటే గౌరవం ఎక్కువగా కనబడింది. అద్దంలో వచ్చిన మార్పు స్పష్టంగానే తెలుస్తోంది. ‘పదినిముషాలు వెయిట్ చేయమని’ చెప్పాను. యూనిఫాం వేసుకున్నాను. భయంభయంగానే అద్దం ముందుకు చేరుకున్నాను. నన్ను ఈవేళ నా శ్రీమతి కొత్తగా చూస్తోంది. ఆమెకు నా గురించి బాగా తెలుసు. అందుకే ఆసక్తిగా నన్నే గమనిస్తోంది. అద్దంలో ఏ భావమూ లేదు. అద్దం ఈ పోలీసును చూసి భయపడిందా? నిజానికి అది నిజమే చూపింది. అద్దానికి నాకు మిత్రత్వము, శత్రుత్వమూ లేదు. ఏ బంధమూ లేదు. తయారై గబాగబా బయటకు నడిచాను. డ్రైవరు కారు డోరు తీశాడు. ఎక్కి కూర్చున్నా. కారు కదిలింది. కారుపై ఎర్రబుగ్గ కాలంలా వేగంగా తిరుగుతూ జనాన్ని హెచ్చరిస్తోంది. కారు దర్జాను రోడ్డుపొడవునా పరచుకుంటూ రివ్వున వాయువేగంతో దూసుకుపోతోంది. అనాథాశ్రమం వేగంగా వెనక్కిపోయింది. రవి గుర్తుకొచ్చాడు. కారులోనున్న అద్దంలో రంగులు మారాయి. రవి ఆలోచనలతో బాటు, అద్దం ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది. అందుకే నాకు అద్దమంటే అంత భయం. వెనుక ఆలోచనలు తిరిగి ముసురుకున్నాయి. ∙∙ ఆశ్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రవి టాలెంట్ గురించి మరచిపోతున్న సమయమది. పై అధికారి పోలీస్టేషన్ పర్యవేక్షణకు వస్తున్నాడు. సిబ్బంది మొత్తం హడావుడిగా ఉన్నారు. ఇన్స్పెక్టర్ విక్రమ్ ఫైళ్ళను తీసుకొని నా రూమ్‌కు వచ్చాడు. నాతో వాటి గురించి సీరియస్‌గా చర్చిస్తున్నాడు. ఈలోగా అక్కడికి అనాథాశ్రమం నిర్వహణాధికారి, వెంట రవిని తీసుకొని ఆఫీసుకు వచ్చాడు. కిటికీ అద్దంలో గమనించాను. ముఖ్యమైన పనికావడంతో దృష్టి్టని పనిపైకి మళ్ళించాను. అరగంట తరువాత ఫైళ్ళు పరిష్కారమయ్యాక విక్రం బయటకు వెళ్ళాడు. కానిస్టేబుల్ లోపలికి వచ్చి సెల్యూట్ చేస్తూ రవి వచ్చిన విషయం గుర్తుచేశాడు. లోపలికి పంపమని సైగ చేశాను. లోపలికి రాగానే ‘ఆ... ! చెప్పండి. ఏం కావాలి?’ అడిగాను. మా హడావుడి తెలుసుకొని, ‘రవి పైచదువులకు మీ సాయం కావాలి సార్’ క్లుప్తంగా చెప్పాడు ఆశ్రమ నిర్వాహకుడు. ‘సర్టిఫికేట్లను సిద్ధం చేసుకో రవి. ఖర్చులు నేను చూసుకుంటాను. రేపు మీ ఆశ్రమం వస్తానని’ చెప్పాను. చెప్పినట్టే మరునాడు ఆశ్రమం దగ్గర రవిని కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళి పెద్దకాలేజీలో చేర్పించాను. హాస్టల్ ఖర్చులన్నీ కలిపి ఫీజును ముందుగానే కట్టేశాను. రవిని జాయిన్ చేసి, మళ్లోసారి వస్తానని చెప్పి కారు దగ్గరకు నడిచాను. మనసు దూదిపింజలా తేలిపోతోంది. రవి కళ్ళల్లో ఆనందం కన్నీళ్ళలో మెరుస్తుంది. ఆ దృశ్యం కారు అద్దంలో ఎదురైంది. హమ్మయ్య! అద్దం నన్ను కనికరించింది. సంతోషాన్నిచ్చింది. రవిపై నాకున్న నమ్మకం వృథాకాలేదు. ఇంటర్లో మంచి మార్కులొచ్చాయి. తరువాత ఇంజనీరింగ్. నా సాయం కొనసాగుతూనే ఉంది. ఆఫీసులో నాకు ఆత్మీయుడుగానున్న విక్రమ్ కూడా ప్రమోషన్ మీద హైదరాబాదు వెళ్ళాడు. రవి బాగోగులు తానే చూసుకుంటున్నాడు. నాకు ప్రమోషన్ వచ్చినా స్థానబదిలీ జరగలేదు. ∙∙ ఈలోగా కారు ఆఫీసు ముందాగింది. వాస్తవంలోకి వచ్చాను. ఎర్రబుగ్గ సైరను ఆగిపోయింది. కారు దిగాక పూలమాలలతో మా పోలీసు సిబ్బంది ఆఫీసులోకి నన్ను ఆహ్వానించారు. అటెండెన్స్ రిజిస్టరులో చివరిరోజు సంతకంచేసి నా కుర్చీలో కూర్చున్నాను. ఉద్విగ్నంగా ఉంది. ‘పోలీసు ఆడిటోరియంలో పదవీవిరమణ కార్యక్రమం ఏర్పాటు చేశాం సార్’ విక్రమ్ సెల్యూట్ చేస్తూ చెప్పాడు. నేను ఊహించలేదు. విక్రం తానే చెప్పాడు. ట్రాన్స్ఫర్ మీద ఈరోజే ఇక్కడ జాయిన్ అయినట్టు. నా సీట్లో అతను రేపటి నుండి పనిచేస్తాడు. అతని ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాను. కారణం విక్రమ్ అంటే నాకిష్టం లేదు. కారణం మళ్ళీ రవినే. నా ఆలోచనలను పసిగట్టాడు కాబోలు. ఈసారి తన సిబ్బందిని ముందుకు తోశాడు. జీపును పూలతో అలంకరించారు. పొడవాటి తాళ్ళు. వాటికి పూల అలంకరణ ఉంది. ఇవన్నీ విక్రమ్ ఏర్పాట్లు. తెలుస్తూనే ఉంది. విక్రమ్‌కు నేనంటే చాలా ఇష్టం. నాకు తెలుసు. కానీ రవి విషయంలో విక్రమ్ చేసిన ద్రోహం మరువలేను. ఆడిటోరియం ఆఫీసు పక్కనే ఉంటుంది. జీపులో నన్ను కూర్చోబెట్టి తాళ్ళతో ముందుకులాగుతున్నారు. సిబ్బంది హడావుడి మద్య నా ఇబ్బంది చిన్నది. కెమెరాలు, ఫొటోలు, విలేఖరులు, స్టాఫ్ అట్టహాసం మద్య జీపు ముందుకుపోతుంటే విక్రమ్‌ను చూశాక నా ఆలోచనలు మాత్రం వెనక్కు మళ్ళాయి. ∙∙ రవి ఇంజనీరింగ్ కళాశాలలో చేర్పించాక బాగోగులు చూసుకోమని విక్రమ్‌కు చెప్పాను. అవసరమైన ఆర్థికసహాయం చేస్తూనే ఉన్నాను. కాలేజీలో ఏవో గొడవలు. చిలికి చిలికి గాలివానైంది. మంత్రి కొడుకు ఆ గొడవకు కారణం. అతను ఆవేశంలో కొట్టిన దెబ్బలకు సహవిద్యార్ధి తలపగిలి చనిపోయాడు. ఆ కేసులో సాక్ష్యం చెప్పడానికి అందరూ భయపడ్డారు. విక్రమ్ రవిని బలవంతంగా ప్రత్యక్షసాక్షిగా చేర్చాడు. నిజం నిర్ధారణ కావడంతో శిక్ష ఖరారైంది. ఇదంతా నాకు తెలియకుండా విక్రమ్ జాగ్రత్తపడ్డాడు. తరువాత మంత్రి అధికారాన్ని ఉపయోగించి రవిని కనబడకుండా చేశాడు. అడవిలో సగంకాలిన రవి శవం దొరికిందని ఆశ్రమం ద్వారా కబురొచ్చింది. తరువాత నా ఎంక్వయిరీలో విక్రమ్ నిర్లక్ష్యం తెలిసి అసహ్యం కలిగింది. అందుకే అద్దం ముందుకు పోయినప్పుడల్లా నాన్న.. ఆ వెంటనే రవి జ్ఞాపకం వస్తారు. అద్దం కూడా వాళ్ళలాగే నిజం చెబుతుంది కాబోలు. అద్దం వేసే ప్రశ్నకు నా దగ్గర ఏ సమాధానం లేక భయం వేసేది. అందుకే ఇన్నాళ్లుగా తప్పించుకు తిరుగుతున్నాను. నేను పోలీసును. నాకు తెలుసు. అద్దంలో నా గతం ఉంది. అదెప్పుడూ ప్రశ్నిస్తుంది. నిజం నిగ్గుదేల్చమంటుంది. అద్దం పెట్టే యాతన భరించలేక ఇన్నాళ్ళు దూరం పెట్టాను. అప్పుడప్పుడూ చూడకతప్పేది కాదు. ∙∙ ఆడిటోరియం వచ్చింది. ఆలోచనలు ఆగిపోయాయి. హాలునిండా డిపార్ట్మెంట్ వాళ్ళున్నారు. ఆత్మీయులున్నారు. సహాయం పొందినవారూ ఉన్నారు. అప్పటికే నా శ్రీమతి అక్కడకు వచ్చింది. మమ్మల్ని వేదిక మీదకు ఆహ్వానించారు. సభ ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీగారు ఇంకా రాలేదు. కొత్త ఎస్పీ చార్జ్ తీసుకోవాల్సిఉంది. నేరుగా ఇక్కడికే వస్తున్నారని విక్రమ్ వేదిక మీద అనౌన్స్ చేశాడు. ప్రసంగాలు నడుస్తున్నాయి. విక్రమ్ హడావుడి గమనిస్తూనే ఉన్నాను. కాని పట్టనట్టున్నాను. ఈలోగా ఎస్సై వేదికపైకి వచ్చాడు. అంతా లేచారు. నేనూ లేచి సెల్యూట్ పెట్టాను. విచిత్రం. అద్దంలో చూస్తున్నట్టు చూశాను. భ్రమ పడుతున్నానా? తర్కించుకున్నాను. కొత్త ఎస్సై హోదాతో రవి వచ్చాడు. మీడియా అంతా ఎస్సైగారి మీద ఫోకస్ బెట్టింది. రవి నేరుగా వచ్చి నా ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ కళ్ళల్లో అదే కృతజ్ఞత. రవి బతికి ఉండడం సంతోషమైతే, పోలీసు అధికారిగా రావడం రెట్టింపు ఆనందాన్నిచ్చింది. సభ ముగిశాక రవితోబాటు విక్రమ్ నా వెనుకే హాలు బయటకు నడిచాడు. ఇంటికి చేరుకున్నాక విక్రం తన బ్యాచ్‌మేట్ సాయంతో రవిని కాపాడిన విషయం చెప్పాడు. రవి భద్రత కోసం ఇన్నాళ్ళు ఈ విషయం దాచిపెట్టాల్సి వచ్చిందని చెప్పాడు. ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఇదే రోజు ఇక్కడ పోస్టింగ్ తీసుకుంటున్నాడని తెలిసి ఈ విషయం నాకు సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదన్నాడు. మనసులో భారం దిగిపోయింది. కాసేపు ఉండి కాఫీ తాగి వెళ్ళారు. ఇక అద్దం ముందు ధైర్యంగా నిలబడ్డాను. నాన్న గుర్తుకొచ్చాడు. వెంటనే రవి స్థానంలో అనాథాశ్రమానికొచ్చిన సగం కాలిన శవం గుర్తుకొచ్చింది. ఎవరిది ఆ అనాథ శవం? అద్దం మళ్ళీ నన్ను ప్రశ్నించింది. చదవండి: క్రైమ్ స్టోరీ: క్లూస్... కాల్చిపారేసిన చుట్టముక్క.. ఊహించని ట్విస్ట్! -
శతక నీతి – సుమతి: అద్దం... అబద్ధం
‘బలవంతుడనాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా/బలవంతమైన సర్పము చలిచీమల చేతి చిక్కి చావదే సుమతీ !’ అన్న సుమతీ శతకకారుడి నీతి సూత్రాన్ని చర్చించుకుంటున్నాం... నిజానికి ఏ కాలానికి ఆ కాలంలో పెద్దలు పిల్లలను మంచి మార్గంలో పెట్టడానికి ఇటువంటి హితోక్తులు చాలా చెబుతుంటారు. వాటిని విని అనుసరించిన వారు విచక్షణతో, వివేకంతో వారి జీవితాలను సుఖమయం చేసుకుంటుంటారు. నందుల చరిత్ర తెలిసే ఉంటుంది. కేవలం పొగరుబోతు తనంతో, అతిశయంతో నిష్కారణంగా వైరం పెట్టుకొని మలయకేతు, పర్వతకుడు, వైరోచకుడు..ఇలా ఎంతో మంది రాజులను అవమానించారు. ఆ క్రమంలోనే అన్నశాలలోకి అన్నం తినడానికి కూర్చొన్న చాణక్యుడిని అవమానకరంగా మాట్లాడారు. ఆయన చాలా గొప్పవాడు, మహావిద్వాంసుడు, మహా మేధావి అంటూ అందరూ చెబుతున్నా వినకుండా జుట్టుపట్టి ఈడ్పించారు నందులు. పిలక ఊడిపోయింది.. మిమ్మల్ని పదవీచ్యుతుడిని చేసేదాకా ఈ పిలక ముడి వేయను.. అని అక్కడే శపథం చేసాడు చాణక్యుడు. చంద్రగుప్తుణ్ణి ముందు నిలబెట్టి నందుల చేతిలో అవమానం పొందిన రాజులందరినీ ఏకం చేసిన చాణక్యుడు వ్యూహరచన చేసిన యుద్ధంలో ఇంత గొప్ప నందులు ఏమయిపోయారు. మొత్తం వంశమే మిగలకుండా పోయింది. నందుల మీద అపార ప్రేమ కలిగిన మహా మేధావి ఒకాయన ఉండేవాడు. ఆయన పేరు రాక్షసుడు. చాణక్యుడికి ప్రతిభకు లొంగిపోయి చంద్రగుప్తుడికి ప్రధానమంత్రి అయ్యాడు. చంద్రగుప్తుడు తన అభిరుచి మేరకు ఒక రాజభవనం కట్టించుకున్నాడు. మొత్తం సిద్ధమయిన తరువాత దానిలో ఉండడానికి చాణక్యుడి అనుమతి కోరాడు. ‘వీల్లేదు’ అని శాసించాడు రాజగురువు. చంద్రగుప్తుడు చిన్నాచితకా రాజేమీ కాదు... అప్పట్లో భారత దేశంలో వైభవంగా వెలిగిన మగధ సామ్రాజ్యాధిపతి. అంత గొప్ప రాజ్యానికి తిరుగులేని మహారాజయి ఉండి తను ఇష్టపడి కట్టించుకున్న ఇంట్లోకి పోవడానికి అనుమతి అడగడం, దాన్ని చాణక్యుడు తిరస్కరించిన వెంటనే సమ్మతించడం... సాధారణ విషయమేమీ కాదు. వినయం అంటే అదీ. చెప్పినంత సులువు కాదు అలా ఉండడం. మీరెప్పుడు అనుమతిస్తే అప్పుడే గృహప్రవేశం చేస్తానన్నాడు. చాణక్యుడు కొంతమంది సైనికులను వెంటపెట్టుకుని ఆ మహాసౌధాన్ని అణువణువూ గాలిస్తున్నాడు. ఆంతరంగిక మందిరం వంటి ఒకగది నిండా పెద్ద పెద్ద అద్దాలు బిగించి ఉండడం చూసి అనుమానించాడు. పిలిచి అడిగాడు అక్కడివారిని.. అలంకారం కోసం పెట్టామని చెప్పారు. అంతకంటే గొప్ప అలంకారం రావడానికి నేను చిట్కా చెబుతానంటూ వాటిని తొలగించి చిత్తరువులు పెట్టమన్నాడు. అద్దాలు తొలగిస్తుంటే వాటి వెనుక గదులు, వాటిలో సాయుధులైన సైనికులు కనబడ్డారు. వెంటనే తన సైనికులతో వారిని తుదముట్టించాడు. చంద్రగుప్తుడు నిర్ఘాంతపోయాడు. అద్దాలు గదినిండా ఉన్నప్పుడు లోనికి ప్రవేశించిన వారు తమ ప్రతిబింబాన్ని భిన్నకోణాలలో చూసుకుంటూ మురిసిపోతూ ఆదమరిచి ఉంటారు. ఆ క్షణాల్లో వెనుకనుంచి చంపేయడానికి రాక్షసుడు అనే మంత్రి చేసిన కుట్ర బట్టబయలయిపోయింది. చంద్రగుప్తుడు మహారాజయినా వినయంతో ప్రవర్తించినందుకు క్షేమంగా బయటపడ్డాడు. వాళ్లెంత, వీళ్ళెంత ...అని గర్వాతిశయంతో ధిక్కరించి నడుచుకొన్నందుకు నంద రాజులలో ఒక్కడంటే ఒక్కడూ మిగలలేదు. వీటిలో నీతిని గ్రహించాలి. మనకంటే గొప్పవాళ్లుంటారనే సత్యాన్ని గ్రహించి ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా ...అంటూ బద్దెన గారిస్తున్న సందేశం కూడా అదే. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
కారులో మకాం వేసిన కొండ చిలువ.. ఎంత భయంకరంగా ఉందో..
మెల్బోర్న్: సాధారణంగా చాలామంది పాముని చూడగానే భయంతో వణికిపోతుంటారు. పాము.. ఉందంటే ఆ దరిదాపుల్లోకి వెళ్లటానికి కూడా ఇష్టపడరు. అయితే.. ఒక్కొసారి పాములు, కొండ చిలువలు దారితప్పి.. జనవాసాల మధ్యన, పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలోనికి దారితప్పి వస్తుంటాయి. ఇలాంటి ఎన్నో సంఘటనలను మనం చూశాం. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. బ్రిస్బెన్ పట్టణంలో ఉండే జోష్ కాస్ట్లీ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి సరదాగా క్విన్స్‌లాండ్‌కు పిక్నిక్కు వెళ్లాడు. వారు తమ వాహనాన్ని బుష్లాండ్ సమీపంలో పార్క్ చేసి బయటకు లోపలికి వెళ్లిపోయారు. పిక్నిక్లో సరదాగా గడిపిన తర్వాత.. బయటకు వచ్చారు. అప్పుడు వారు ఒక షాకింగ్ సంఘటనను చూశారు. వారు పార్క్ చేసిన కారు అద్దానికి ఒక మీటరు పొడవున్న.. కొండ చిలువ చుట్టుకుని ఉండటాన్ని గమనించారు. దీంతో ఆశ్చర్యపోయారు. జోష్ కాస్ట్లీ పాములను పడుతుంటాడు. ఇప్పటికే పాములను పట్టిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు మాత్రం.. జోష్ కాస్ట్లీ ఎందుకో ఆ కొండ చిలువను పట్టే సాహసం చేయలేదు. అతను.. పీటర్ అనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించాడు. పీటర్ అక్కడికి చేరుకుని కొండచిలువను పట్టుకుని సమీపంలోని అడవిలో విడిచిపెట్టాడు. గతంలో ఒక పామును పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు కాస్ట్లీ.. పాము కాటుకు గురయ్యాడు. ఆ తర్వాత.. సమయానికి వైద్యం అందండంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ కొండ చిలువ చిత్రాన్ని కూడా.. కాస్ట్లీ తన ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఎంత భయంకరంగా ఉంది..’ ‘ నీ అదృష్టం బాగుంది..’, ‘ కారు అద్దాన్ని భలే చుట్టేసుకుందే..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
సొంత సూర్యుడ్ని సెట్ చేసేసుకున్నారు!
అదో చిన్న ఊరు.. చుట్టూ పెద్ద పెద్ద కొండల మధ్య అందంగా ఉంటుంది.. కానీ ఆ ఊరిలో ఏడాదికి మూడు నెలలు అసలు ఎండ అనేదే పడదు. మధ్యాహ్నం రెండు, మూడు గంటల పాటు తప్పిస్తే.. మిగతా సమయంలో పగలూ, రాత్రీ తేడా తెలియదు. వందల ఏళ్లుగా ఇలాగే వెళ్లదీసిన స్థానికులు.. కొన్నేళ్ల కింద చిన్న ఆలోచనతో తమ ఊరికి మరో సూర్యుడ్ని తెచ్చేసుకున్నారు. ఇన్నిరోజులు పెద్దగా ఎవరికీ తెలియని ఈ విషయం.. ఓ టిక్‌టాకర్ చేసిన వీడియోతో వైరల్‌గా మారింది. మరి ఈ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ అద్దాల నుంచి ప్రతిఫలిస్తున్న వెలుగులో విగనెల్లా గ్రామం. (ఇన్సెట్లో) కొండపై ఏర్పాటు చేసిన అద్దాలు ఏడాదికి మూడు నెలలు.. ఇటలీ ఉత్తర ప్రాంతంలోని అంట్రోనా లోయలో ఉన్న చిన్న ఊరే విగనెల్లా. రెండు, మూడు వందల మంది మాత్రమే ఉండే ఈ ఊరికి మూడు వైపులా పెద్ద కొండలు ఉంటాయి. అవి సూర్యరశ్మిని అడ్డుకోవడంతో.. ఏటా నవంబర్ 11వ తేదీ నుంచి ఫిబ్రవరి రెండో తేదీదాకా ఊరిలో ఎండ మొత్తానికే పడదు. కొండలపై పడ్డ ఎండ ప్రతిఫలించి (రిఫ్లెక్షన్) వచ్చే వెలుతురే వారికి దిక్కు. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం.. 13వ శతాబ్దం నుంచీ అంటే ఎనిమిది వందల ఏళ్లుగా ఆ ఊరివాళ్లు ఇలాగే గడుపుతున్నారు. హా మూడు నెలల చీకటి తర్వాత ఎండపడటం మొదలయ్యే రోజున పండుగ చేసుకుంటారు. చదవండి: కరోనా అనిశ్చితి: చేతిలో డబ్బున్నా.. వాయిదాల్లోనే! చిన్న ఆలోచనే.. వరుసగా మూడు నెలల పాటు ఎండ పడకపోవడం, అదీ చలికాలం కావడంతో.. ఊరివాళ్లు శారీరకంగా, మానసికంగా ఇబ్బందిపడుతూనే వచ్చారు. ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి కొండలపై పడే ఎండను ఊరిపైకి రిఫ్లెక్ట్ చేయాలని 1999లో ఊరి మేయర్ మిడాలి ప్రతిపాదన చేశాడు. ఆర్కిటెక్ట్ బొంజాని, ఇంజనీర్ గియానీ ఫెరారీ కలిసి ఓ పెద్ద అద్దాన్ని కొండపై అమర్చి.. వెలుతురును ఊరిపై పడేలా ఓ డిజైన్‌ను సిద్ధం చేశారు. అయితే.. సూర్యోదయం నుంచి అస్తమయం దాకా సూర్యుడు కదులుతూనే ఉంటాడు. మరి అద్దం నుంచి వచ్చే వెలుగు ఊరిలో ఒకేచోట పడేదెలా అన్న సమస్య వచ్చింది. స్టీలు అద్దం.. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో.. మామూలు అద్దం అయితే పగిలిపోయే అవకాశం ఉంటుందని.. అత్యంత నున్నటి స్టీల్ అద్దాలను తెప్పించారు. ఎనిమిది మీటర్ల వెడల్పు, ఐదు మీటర్ల ఎత్తుతో వాటిని ఏర్పాటు చేసి.. ప్రత్యేకమైన కంప్యూటరైజ్డ్ మోటార్ వ్యవస్థకు అనుసంధానించారు. సూర్యుడి కదలికలకు అనుగుణంగా.. అద్దాల కోణాన్ని మార్చేలా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను వినియోగించారు. దీనితో స్టీలు అద్దాల నుంచి ప్రతిఫలించే ఎండ.. ఎప్పుడూ ఊరి మధ్యలో పడుతూ ఉంటుంది. 2006 డిసెంబర్ 17న ప్రారంభించిన ఈ వ్యవస్థకోసం.. అప్పుడే రూ.90 లక్షలు (లక్ష యూరోలు) ఖర్చయింది. నేరుగా ఎండ పడినట్టుగా కాకపోయినా.. తమ ‘కొత్త సూర్యుడి’తో చాలా ఇబ్బందులు తప్పాయని ఊరివాళ్లు చెప్తుంటారు. నాలుగు రోజుల కింద మనదేశానికి చెందిన కరన్ రాజన్ అనే వ్యక్తి ఈ ఊరి గురించి చేసిన టిక్‌టాక్ వీడియో వైరల్‌గా మారింది. చదవండి: Pan - Aadhaar Link: పాన్ కార్డు హోల్డర్లకు హెచ్చరిక! మరో దేశానికీ స్ఫూర్తినిచ్చి.. భూమి ఉత్తర ధృవానికి దగ్గరగా ఉండే చాలా దేశాల్లో కూడా.. కొండలు, గుట్టల మధ్య ఉన్న గ్రామాల్లో ‘విగనెల్లా’ వంటి పరిస్థితే ఉంటుంది. నెలలకు నెలలు ఎండ పడదు. నార్వేలో అలా ఇబ్బందిపడుతున్న జుకాన్ అనే ఊరివాళ్లు.. విగనెల్లాను స్ఫూర్తిగా తీసుకుని 2013లో అద్దాల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. -
అద్దంలో ప్రతిబింబం.. కార్లపై దాడి.. కాకులపై కేసు
లండన్: సాధారణంగా పక్షులు, ఇతర జీవులు అద్దంలో తమ ప్రతిబింబం చూసుకుంటూ.. అవతలి వైపు మరొక జీవి ఉందేమో అనుకొని భ్రమపడుతుంటాయి. ఈ క్రమంలో అవి అద్దంపై దాడిచేసి ఫన్నీగా ప్రవర్తించడం మనకు తెలిసిందే. అయితే, తాజాగా ఇలాంటి ఫన్నీ ఘటన ఒకటి యూకేలో చోటుచేసుకుంది. అయితే, డెర్బీషైర్ అనే గ్రామంలోని కార్లిస్లే అవెన్యూ, లిటిల్ ఓవర్ ప్రాంతంలో కొన్ని రోజులుగా బయట పార్కింగ్ చేసిన కార్ల అద్దాలు, వైపర్లు పాడవుతున్నాయి. వాటిపై గీతలు ఉండటాన్ని వారు గమనించారు. కాగా, మొదట ఇది ఎవరో.. ఆకతాయిల పనిగా భావించారు. కానీ, ప్రతిరోజు వారి కార్లు పాడవుతుండటంతో విసిగిపోయి కొంత మంది యువకులను కాపలాగా ఉంచారు. అప్పుడు వారికి ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. ఇది కాకులు చేస్తున్న పనిగా గుర్తించారు. ప్రతిరోజు రెండు కాకులు కార్లపై అద్దాలను, వైపర్లను పాడుచేస్తున్నాయి. అంతటితో ఆగకుండా అక్కడి వస్తువులను కూడా ఎత్తుకుపోతున్నాయి. అక్కడి స్థానికులు ఈ కాకులను చూసి హాడలేత్తి పోతున్నారు. ఆ రెండు కాకులు మిగతా కాకుల్లా ఎటుపోకుండా.. అక్కడే ఉంటూ, రెండు కలిసి వాహానాలను పాడు చేస్తున్నాయి. కాగా, జూలీ బానీస్టర్ అనే మహిళ ఒక నెలలో రెండుసార్లు కారు అద్దాలను, వైపర్లను మార్చానని వాపోయింది. దీంతో వారు ఆ కాకులకు తూర్పులండన్‌లో 50-60 దశకంలో ఉన్న ఇద్దరు అండర్ వరల్డ్ డాన్లైనా ‘రోనీ, రెగీ’ పేర్లు పెట్టారు. అయితే, మరికొందరు.. ఆ కాకులు భయ పడాలని పొలంలోని దిష్టిబొమ్మలను తీసుకొచ్చి, తమ కార్ల ముందు పెట్టుకున్నారు. అయినా కూడా, ఆ రెండు కాకులు ఏమాత్రం భయపడలేదు. అవి.. రోడ్డుపై నడుచుకుంటే వెళ్తున్న మనుషుల తలపై కూడా దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో విసిగిపోయిన వారు డెర్బీషైర్‌లోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, మొదట పోలీసులు ఈ సంఘటనను వింతగా చూశారు. కాగా క్రమంగా ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుండటంతో కేసును నమోదు చేశారు. దీనిపై రాయల్ సొసైటీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ బర్డ్స్ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. కాకులు ఇలా ప్రవర్తించడం చాలా అరుదని తెలిపారు. ఆ కాకులు కారు అద్దంలో తమ ప్రతిబింబం చూసుకొని అవతలి వైపు మరోక పక్షి ఉందేమో.. అని భ్రమపడి ఉంటాయని అన్నారు. అయితే, ఇప్పుడిది ఆ నగరవాసులకు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘పాపం.. కాకులు కార్లను పాడు చేస్తున్నాయి..’, ‘స్నేహాం అంటే మీదే..’, ‘వాటిని మచ్చిక చేసుకొవచ్చుగా..మరీ!’,‘ఇప్పుడు.. వాటిని జైల్లో పెడతారా ఏంటీ?’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. -
‘వావ్.. నేను ఇంత అందంగా ఉంటానా’
చిన్న పిల్లల వీడియోలు కానీ, జంతువుల వీడియోలు కానీ చూస్తే.. వెంటనే పెదాల మీదకు ఆటోమెటిగ్గా నవ్వొస్తుంది. చిన్నారులు, జంతువుల చిలిపి చేష్టలు చూస్తే ఎంత ఒత్తిడి అయినా సరే ఎగిరిపోవాల్సిందే. ఇక చిన్న పిల్లల్ని, జంతువులను అద్దం ముందు నిలబెట్టినప్పుడు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ మరింత ఫన్నిగా ఉంటాయి. పిల్లలకు తొలిసారి అద్దంలో తమ ప్రతిబింబాన్ని చూపిస్తే.. ఆశ్చర్యంతో రకరకాల హావభావాలు వెల్లడిస్తారు. అదే జంతువులను తొలిసారి అద్దం ముందు నిలబెడితే.. అవి మిర్రర్లో తమ ప్రతిబింబం చూసుకుని దడుసుకుంటాయి. వేరే ఏదో జీవి తన ముందుకు వచ్చింది అనుకుని పారిపోతాయి. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో ఓ గుర్రం తొలిసారి అద్దాన్ని చూస్తుంది. ఇక దానిలో తన ప్రతిబింబాన్ని చూసుకుని ఉలిక్కిపడుతుంది. కాస్త పక్కకు జరిగి మళ్లీ అద్దంలో చూసుకుంటుంది.. ఇదేంటి ఇక్కడ మరేవరో ఉన్నారు అనే భయం.. సందేహంతో మరో సారి అద్దంలో చెక్ చేసుకుంటుంది. ఇలా రెండు మూడు సార్లు అద్దంలో తన ముఖం చూసుకున్న గుర్రం.. చివరకు అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు అద్దంలో తనను తాను చూసుకున్నప్పుడు గుర్రం ఏమాలోచించి ఉంటుందో ఊహించి మరి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ‘‘వావ్ నేను ఇంత అందంగా ఉంటానా’’.. ‘‘అద్దంలో కనిపిస్తుంది నేనేనా..కాస్త మస్కరా పెట్టుకోవాలి’’.. ‘‘అద్దంలో ఉన్నది అందంగా ఉందా.. లేక నేను అందంగా ఉన్నానా’’ అని గుర్రం ఆలోచించి ఉంటుంది అని కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: అద్దం విలువ ఏడున్నర లక్షలా..!? -
అద్దం విలువ ఏడున్నర లక్షలా..!?
లండన్: రోజు లేవగానే బ్రష్ చేసుకుంటూ ముఖం చూసుకునే తమ బాత్రూం అద్దం వెనక ఎంతో చరిత్ర ఉందని ఆ కుటుంబానికి తెలియదు. ఆ అద్దాన్ని ఇప్పుడు వేలం వేస్తే 8 వేల పౌండ్లు(7,68,590.90 రూపాయలు) ఖరీదు చేస్తుందని తెలిసి వారు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టారు. ఒక అద్దానికి అంత ఖరీదు ఎందుకు అంటే.. అది ఫ్రాన్స్ చివరి రాణి మేరీ ఆంటోనిట్టేకు చెందినది కావడమే కారణం. 19, 15 అంగుళాల కొలత గల ఈ అద్దం 18వ శతాబ్దానికి చెందినదిగా తూర్పు బ్రిస్టల్ వేలం కంపెనీ గుర్తించింది. దీని చుట్టూ ఉన్న నగిషీలను 19వ శతాబ్దంలో చెక్కినట్లు గుర్తించారు. ఇక ఫ్రేమ్‌లోని వెండి ఫలకం మీద ఈ అద్దం తొలుత మేరీ ఆంటోనిట్టే వద్ద ఉండేదని తరువాత దాన్ని మూడవ నెపోలియన్ భార్య ఎంప్రెస్ యూజీని కొనుగోలు చేసిందని ఉంది. ఇదే కాక మేరీ ఆంటోనిట్టే ఎస్టేట్ నుంచి ఎంప్రెస్ యూజీని అనేక వస్తువులను కొనుగోలు చేసిందని సమాచారం. (చదవండి: 60 లక్షలు పలికిన లింకన్ వెంట్రుకలు) ఇక ప్రస్తుతం విషయానికి వస్తే ఒక కుటుంబ సభ్యుడు మాట్లాడుతూ.. ‘మా అమ్మమ్మ నుంచి ఈ అద్దాన్ని వారసత్వంగా పొందాము. అయితే దాని నిజమైన విలువను గ్రహించకుండా మా బాత్రూంలో వేలాడదీశాము’ అని తెలిపాడు. ఈస్ట్ బ్రిస్టల్ వేలం ఐడెన్ ఖాన్ మాట్లాడుతూ.. "ఈ అద్దానికి ఎంతో అద్భుతమైన చరిత్ర ఉంది. కానీ పాపం ఇంతకాలం బాత్రూంలో పడి ఉంది. ఇది చరిత్ర నిజమైన భాగం- పద్దెనిమిదవ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధ వ్యక్తులకు దీనితో దగ్గరి సంబంధం ఉంది" అన్నారు. మేరీ ఆంటోనిట్టే ఫ్రాన్స్ చివరి రాణి. లూయిస్ 16ని ని వివాహం చేసుకున్నారు. ఆమె 1774 -1792 మధ్య పాలన సాగించారు. ఫ్రెంచ్ విప్లవం సమయంలో ఆమె ఉరితీయబడ్డారు.. -
బండి తీసేముందు అద్దంలో చూసుకోండి..
సాక్షి, సిటీబ్యూరో: ఏటా వందలకొద్దీ రోడ్డు ప్రమాదాలు..రక్తసిక్తమయ్యే రహదారులు. వెరసీ.. ఎందరో మృత్యుపాలవుతున్నారు. మరెందరో క్షతగాత్రులుగా మారుతున్నారు. నగరంలో ఎక్కడో ఒకచోట నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలుహడలెత్తిస్తున్నాయి. ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోడ్డునిబంధనలపై కనీస అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యంతోవాహనాలు నడపడమే ఇందుకు ప్రధాన కారణం. బండినడిపేటప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే పెద్ద ప్రమాదాలను సైతం అరికట్టవచ్చని చెబుతోంది నగరానికి చెందిన ‘రోడ్డు క్రాఫ్ట్’ అనే స్వచ్ఛంద సంస్థ. రోడ్డు భద్రతపై వివిధ రూపాల్లో అవగాహన కలిగిస్తున్న ఆసంస్థ తాజాగా ‘కారు డ్రైవింగ్’పాఠాలను బోధించే ఓ ప్రత్యేక మ్యానువల్’ను రూపొందించింది. భారత వైమానిక దళంలో పైలట్‌గా పని చేసి, అనంతరం లండన్‌లో పోలీస్ అధికారిగా పని చేసిన మాల్కమ్ వోల్ఫ్,అమెరికాలోని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్, మోటార్ సైకిల్ సేఫ్టీ ఫౌండేషన్ సంస్థల నుంచి అడ్వాన్స్డ్ డ్రైవింగ్ సర్టిఫికెట్ పొందిన ప్రముఖరోడ్డు భద్రతా నిపుణులు నరేష్ రాఘవన్‌లు ‘రోడ్ క్రాఫ్ట్’ సంస్థను నిర్వహిస్తున్నారు. ‘అమెరికా, బ్రిటన్, దుబాయ్ వంటి దేశాల్లో ఉన్నట్లుగానే పటిష్టమైన చట్టాలు ఉన్నప్పటికీ డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా మన వద్ద 78 శాతం ప్రమాదాలు జరుగుతున్నట్లు వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అద్దంలో చూసుకోండి.. ‘సాధారణంగా రోడ్డు భద్రత అనగానే సీట్‌బెల్ట్, హెల్మెట్ ధరిస్తే చాలుననే అభిప్రాయం ఉంది. మంచిదే. ప్రమాదం జరిగిన తర్వాత ప్రాణాలను కాపాడేందుకు అవి ఉపయోగపడతాయి. కానీ అసలు ప్రమాదమే జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేది చాలా ముఖ్యం’ అంటున్నారు నరేష్ రాఘవన్. ‘రహదారి భద్రతలో అద్దం (మిర్రర్) కూడా ఎంతో ముఖ్యమైనది. పార్కింగ్ నుంచి బండి బయటకు తీసేటప్పుడు, రోడ్డుపై టర్నింగ్ సమయంలో, ఒక లేన్ నుంచి మరో లేన్‌లోకి మారేటప్పుడు మిర్రర్ సిగ్నల్ మానోవర్ (ఎంఎస్ఎం) పాటించాలి. రేర్ వ్యూ మిర్రర్లో వెనుక వాహనాల కదలికలను గమనిస్తూ ముందుకు వెళ్లాలి. చాలామంది ఇది పాటించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి.’ అన్నారు. వేగ పరిమితి బండికే కాదు..డ్రైవర్‌కు కూడా అవసరమే.. ఇటీవల బయోడైవర్సిటీ ఫ్లైఓర్‌పై జరిగిన ప్రమాదంలో అపరిమిత వేగమే కారణమని పోలీసులు తేల్చారు. వాహన వేగాన్ని అదుపు చేయలేని డ్రైవింగ్ ఇందుకు కారణం. బండి వేగాన్ని నియంత్రించే సామర్థ్యం డ్రైవర్‌కు ఉండాలి. ఇందుకోసం డ్రైవర్ సమర్థత, వాహనం వేగం మధ్య బ్యాలెన్సింగ్ అవసరం. డ్రైవర్ వయసు, అనుభవంపై కూడా వాహనం వేగం ఆధారపడి ఉంటుంది. 2 సెకన్ల దూరం.. ప్రతి రెండు వాహనాల మధ్య ఎంత దూరం ఉండాలనే అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 50 నుంచి 100 ఫీట్ల దూరం (గ్యాప్) ఉంటే చాలనుకుంటారు. కానీ ఒక వాహనానికి మరో వాహనానికి కనీసం 2 సెకన్ల ప్రయాణ దూరం ఉండాలి.‘వంద కిలోమీటర్ల వేగంతో వెళ్లే కారు 2 సెకన్ల వ్యవధి వల్ల 180 ఫీట్ల దూరంలో ఉంటుంది. ఇది పూర్తిగా సురక్షితమైన నిబంధన’ అని చెబుతున్నారు మాల్కం వోల్ఫ్..లేన్ క్రమశిక్షణ.. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో లేన్ నిబంధన కచ్చితంగా పాటిస్తారు. మోటారు వాహనాలు కుడి లేన్‌లో, ద్విక్రవాహనాలు ఎడమ లేన్‌లో వెళితే ప్రమాదాలకు అవకాశం తక్కువ. కానీ ఇష్టారాజ్యంగా లేన్ నిబంధన అతిక్రమించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్క్రాప్ట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ♦ లేన్ నిబంధనపై అవగాహన కల్పించేందుకు అన్ని చోట్ల సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలి. ♦ ఏ అంతర్జాతీయ నగరంలో లేని విధంగా నగరంలో హాంకింగ్ (హారన్ల మోత) ఉంది. సిటీలో ఆర్టీసీ బస్సులు, కార్లు, రవాణా వాహనాలు హారన్ల మోత మోగిస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. మ్యానువల్పైఅవగాహన ఉండాలి హైదరాబాద్‌లో 30 ఏళ్లుగా డ్రైవింగ్ చేస్తున్న వాళ్లపై కూడా అధ్యయనం చేశాం. కానీ వారికి రోడ్డు నిబంధనలపై కనీస అవగాహన ఉండడం లేదు, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణం మిగతా వాహనదారులే అని చెబుతారు. అలా ప్రతి ఒక్కరు తప్పించుకుంటారు. ఈ నిర్లక్ష్యమే అసలైన ప్రమాదం.– నరేష్ రాఘవన్, రోడ్డు భద్రతా నిపుణులు మర్యాదపూర్వకంగా నడపాలి నగరంలో ర్యాష్ డ్రైవింగ్ చాలా ఆందోళన కలిగిస్తోంది. రోడ్డెక్కితే చాలు ఏ వాహనంఢీకొంటుందోనని భయమేస్తోంది. డ్రైవర్లకు పాఠాలను బోధించేందుకే మేం ఈ మ్యానువల్‌ను తెలుగులో రూపొందించాం. ప్రతి డ్రైవర్ దీన్ని చదివి పాటిస్తే 70 శాతానికిపైగా ప్రమాదాలు తగ్గుముఖం పడతాయి. – మాల్కమ్ వోల్ఫ్,రోడ్క్రాఫ్ట్ వ్యవస్థాపకులు -
అద్దం ఆలోచన అదుర్స్
బెంగళూరు, (కర్ణాటక): ఉద్యాన నగరిని స్వచ్ఛ నగరిగా మార్చేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితాలు కనిపించడం లేదు. నగర వాసులు ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తుండటంతో వాటిని అడ్డుకోవడానికి పాలికె వినూత్న ఆలోచన చేపట్టింది. బెంగళూరు నగరంలో ఫుట్‌పాత్‌లు, రోడ్లపై నగర వాసులు ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తుండటంతో స్వచ్ఛతను కాపాడటానికి పాలికె ఫుట్‌పాత్ ప్రాంతాల్లో భారీ అద్దాలను (మిర్రర్) అమర్చింది. మూత్ర విసర్జన సమయంలో అద్దంలో కనబడుతుంటే సిగ్గుతోనైనా బహిరంగ మూత్ర విసర్జన మానుకుంటారని ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. దీంతో నగరంలో బీబీఎంపీ పలు చోట్ల భారీ సైజులో ఉన్న అద్దాలను అమర్చడానికి యత్నిస్తోంది. తాజాగా చర్చ్‌స్ట్రీట్, ఈఎస్ఐ ఆస్పత్రి వద్ద భారీ అద్దాలను అమర్చింది. నగరంలో పలు చోట్ల మరుగుదొడ్లు అమర్చినప్పటికి బహిరంగ మూత్ర విసర్జన అడ్డుకోవడం సాధ్యం కాలేదు. దీంతో బీబీఎంపీ గోడలకు భారీ అద్దాలను అమర్చి బహిరంగ మూత్ర విసర్జన అడ్డుకోవడానికి వినూత్న పథకంతో ప్రజల్లో మార్పు వస్తుందేమో వేచి చూడాలి. -
ఆత్మహత్యలకు కారణం ఏంటి?
శ్రీనాథ్, హరిత జంటగా నటించిన చిత్రం ‘మిర్రర్’. ‘సీ యువర్ సెల్ఫ్’ అనేది ఉప శీర్షిక. ఏక్మా సాయికుమార్ దర్శకత్వంలో శ్రీ మల్లికార్జున మూవీస్ సంస్థ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె. తారక రామారావు విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఏక్మా సాయికుమార్ మాట్లాడుతూ– ‘‘సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల నేపథ్యంతో ఈ సినిమా సాగుతుంది. ప్రజలకు ఉపయోగపడే ఇతివృత్తంతో రాసుకున్న కథ ఇది. ఒక ఊరిలో వరుసగా యువతీ యువకుల ఆత్మహత్యలు జరుగుతుంటాయి. వాటికి కారణం ఏంటని అన్వేషిస్తూ సాగే కథాంశమిది. సమాజంలో పెద్ద మనిషిగా చెలామణి అయ్యే కొందరి వ్యక్తుల అసాంఘిక శక్తుల అసలు రూపాన్ని ఈ చిత్రం బయటపెడుతుంది. త్వరలో పాటలు, మార్చి చివరి వారంలో సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎన్. అర్జున్, కెమెరా: కె అశోక్, సహ నిర్మాతలు: డి. లక్ష్మీ నారాయణ, తూమ్కుంట అరుణ్, నీలం అశోక్, వినోద్ రాజ్. -
వార్డ్‌రోబూ ముసలాయనా మృత్యువూ
మా నాన్న గదిలోని వార్డ్‌రోబు మామూలు కర్ర సామగ్రి కాదు. అది ఇంటి లోపల మరో ఇల్లులా ఉండేది. మా నాన్న పూర్వీకుల నుంచి మాకు సంక్రమించిన ఆ వార్డ్‌రోబు మేం ఇల్లు మార్చినప్పుడల్లా మా వెంట వచ్చి ఆఖరుకు మిరాఫ్లోర్స్‌లోని మా నాన్న పడకగదిలోకి చేరింది. దాన్ని పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక మతిస్థిమితం లేని వడ్రంగి అత్యంత నైపుణ్యంతో తయారు చేశాడట. అది మూడు భాగాలుగా ఉండేది. ఒక్కో భాగానిది ఒక్కో విలక్షణత్వం. ఎడమవైపు భాగానికి ఇంటి తలుపంత పెద్ద తలుపు! దాని తాళంకప్ప నుంచి వేలాడే పెద్ద తాళంచెవి తుపాకిలా, రాజదండంలా, గదలా– ఇలా రకరకాల ఆటబొమ్మలుగా పనికొచ్చే విధంగా ఉండేది. తన సూట్లను, తను ఎన్నడూ తొడుక్కోని ఇంగ్లీషు కోటును నాన్న ఈ భాగంలో వేలాడదీసేవాడు. గంధపు చెక్కల, కలరా ఉండల సువాసన నిండిన ప్రపంచంలాంటి ఆ వార్డ్‌రోబు లోనికి ప్రవేశించాలంటే తప్పనిసరిగా ఆ తలుపు ద్వారానే వెళ్లాలి. రకరకాల వస్తువులు ఉండే మధ్యభాగం మాకు మూడుభాగాల్లోని అత్యంత ప్రీతికరమైన భాగం. అందులో కిందవైపు నాలుగు పెద్దపెద్ద సొరుగులు. నాన్న చనిపోయిన తర్వాత మా అన్నదమ్ముల్లో ఒక్కొక్కరికి ఒక్కో సొరుగు సంక్రమించింది. సొరుగులకు పైన ఒక పెద్ద అర. అందులో నాన్నకిష్టమైన పుస్తకాలు దాదాపు ముప్పై ఉండేవి. వార్డ్‌రోబులోని మధ్యభాగానికి ఒక పెద్ద దీర్ఘ చతురస్రాకారపు తలుపు. ఆ తలుపును ఎప్పుడూ తాళంవేసి మూసి ఉంచేవాళ్లు. అందులో ఏముందో మాకెవ్వరికీ తెలియదు. బహుశా కాయితాలు, చిన్నప్పటి ఫొటోలు ఉండవచ్చు. అవి చిరిగిపోతే జీవితంలో కొంత భాగం చిరిగిపోతుందనే భయం వల్ల జాగ్రత్తగా దాచి ఉంటారు. నిజానికి అప్పటికే మేం జీవితంలోని కొంత భాగాన్ని నష్టపోయాం. ఇక కుడివైపు ఉన్న భాగానికి ఇంకో తలుపు ఉండేది. కాని ఆ తలుపుకు ఒక వాలు అంచుల అద్దాన్ని బిగించారు. ఈ భాగంలో కూడా షర్టులు, అండర్వేర్ల కోసం కింద సొరుగులు ఉండి వాటి పైభాగాన ఒక మనిషి నిటారుగా నిలబడగలిగేటంత పెద్ద అర ఉండేది. పైభాగంలో పుస్తకాల అర వెనుక నుంచి ఎడమవైపు భాగాన్ని కుడివైపు భాగంతో కలుపుతూ ఒక పొడవైన ఖాళీ స్థలం ఉండేది. ఎడమవైపు తలుపు ద్వారా లోపలికి దూరి కొన్ని క్షణాల తర్వాత అద్దం ఉన్న కుడివైపు తలుపును తోసుకుని తలను బయటకు పెట్టే ఆట మాకు బాగా నచ్చేది. దాగుడుమూతల ఆట సమయంలో పైభాగంలోని తోవలాంటి ఆ ఖాళీ స్థలం దాక్కోవడానికి మాకు చక్కగా పనికొచ్చేది. అక్కడ దాక్కున్నప్పుడు మా స్నేహితులెవరూ మమ్మల్ని కనుక్కోలేకపోయేవాళ్లు. మేం వార్డ్రోబులో ఉన్నామని తెలిసినా పైకి వెళ్లి కాఫిన్లో మాదిరి ఆ మధ్యభాగంలో కాళ్లు చాపి పడుకుని ఉన్నామని వాళ్లు ఊహించలేకపోయేవాళ్లు. మా నాన్న మంచం ఆ వార్డ్‌రోబులోని కుడివైపు భాగానికి సరిగ్గా ఎదురుగా ఉండేది. దిండ్లపై తలను పెట్టుకుని న్యూస్‌పేపరు చదువుకుంటున్నప్పుడు నాన్న తన ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకోగలిగేవాడు. ఆయన అద్దంలో తనను తాను చూసుకోవడం కన్న ఎక్కువగా పూర్వం అందులో చూసుకున్నవాళ్లను వీక్షించేవాడు. ‘‘మంత్రివర్గ సమావేశానికి వెళ్లే ముందు ఖ్వాన్ ఆంటోనియో రిబేరో ఎస్టాడా తన టైను సరిచేసుకుంటూ ఆ అద్దంలోనే చూసుకున్నాడు’’ అనీ, ‘‘సాన్ మార్కోస్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించడానికి వెళ్లే ముందు డాన్ రమోన్ రిబేరో అల్వారెజ్ డెల్ విల్లార్ ఆ అద్దంలోనే చూసుకున్నాడు’’ అనీ, ‘‘ఎన్నిసార్లు కాంగ్రెస్ సమావేశంలో ప్రసంగించడానికి వెళ్లే ముందు నా తండ్రి డాన్ జూలియో రిబేరో బెనైట్స్ తయారవుతూ ఆ అద్దంలో తనను తాను చూసుకోలేదూ?’’ అనీ అంటూ ఉండేవాడు మా నాన్న. నాన్న పూర్వీకులంతా ఆ అద్దపు లోతుల్లో బంధింపబడ్డారు. వాళ్ల రూపాలనూ వాటి మీద పడిన తన ప్రతిబింబాన్నీ చూసుకుని ఆ క్షణాన వాళ్లతో కలసి జీవించినట్టు ఊహించుకునేవారు. ఆ అద్దం కారణంగా దివంగతుల ప్రపంచంలోకి మా నాన్న ప్రవేశించేవాడు. అదేవిధంగా తన పూర్వీకులను ఈ బతికి ఉన్న ప్రపంచంలోకి తీసుకొచ్చేవాడు. తన వివాహపు రోజు నుంచి నాన్న మద్యపానాన్నీ, స్నేహితులతో కలవడాన్నీ మానేశాడు. అరుదుగా మా తోటలో పళ్లచెట్లు విరగకాసి మరులుగొలిపినప్పుడో లేక మేం అందమైన డిన్నర్ సెట్ కొన్నప్పుడో నాన్న తన పాత సహచరులను మా ఇంటికి ఆహ్వానించేవాడు. ఆ విధంగా మా ఇంటికి మొదట వచ్చినవాడు అల్బర్టో రికెట్స్. ఆయన అచ్చు గుద్దినట్టుగా సరిగ్గా నాన్నలాగే ఉండేవాడు కాని సైజు మాత్రం చాలా చిన్నది. వాళ్లిద్దరు ఒక్కంతే తెల్లగా, ఒక్కంతే బక్కపలచగా ఉండేవాళ్లు. వాళ్లిద్దరూ ఒకరినొకరు కలుసుకుని పది పన్నెండేళ్లయింది. ఈ పది పన్నెండు సంవత్సరాల కాలంలో రికెట్స్ ఒక మందుల కంపెనీలో పనిచేసి బాగా ధనవంతుడయ్యాడు. ఇప్పడు ఆ కంపెనీకి ఆయనే యజమాని. మా నాన్నేమో ఎంతో కష్టం మీద మిరాఫ్లోర్స్‌లో ఇల్లు కొనగలిగాడు. ఈ పది పన్నెండేళ్ల కాలంలో రికెట్స్ సాధించినది మరొకటి ఉంది. అదేమిటంటే ఆయనకు ఓ కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు అల్బర్టో జూనియర్. రికెట్స్ మొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడు తన కొడుకును వెంట తెచ్చాడు. ఇద్దరు స్నేహితులు ఉంటే వాళ్ల పిల్లలు ఒకరితో ఒకరు నిజమైన స్నేహితులుగా ఉండటమన్నది అరుదు కనుక మొదట్లో మేము జూనియర్ అల్బర్టోను సందేహించాము. అతడు బక్కపలుచగా, వికారంగా, కొన్నిసార్లు పూర్తి ముభావంగా ఉండటాన్ని గమనించాం మేము. నాన్న తన స్నేహితునితో మా పండ్లతోటలో తిరుగుతూ చీనీ చెట్టును, మేడిచెట్టును సీమరేగు చెట్టును, ఇంకా తీగల చెట్లను చూపిస్తుంటే మేం మా గదిలో ఆడుకోవటానికి జూనియర్ అల్బర్టోను మాతో తీసుకువెళ్లాము. ఆ అబ్బాయికి తోబుట్టువులు లేరు కనుక మేం కనిపెట్టి ఆడుకునే ఆటలేవీ అతనికి తెలియవు. ఆటలో రెడ్ ఇండియన్లా నటించాల్సినప్పుడు ఆ పాత్రను అతడు సరిగ్గా చెయ్యలేదు. ఇక టెన్నిస్ రాకెట్‌ను ఆటలో మెషిన్‌గన్‌లా కూడా వాడుకోవచ్చని అతనికి తెలియదు. మాకిష్టమైన ఆటను అతనితో కలసి వార్డ్రోబులో ఆడటం దండగని నిర్ణయించడానికి మాకు ఎక్కువ సమయం పట్టలేదు. దానికి బదులు నేల మీద బొమ్మకారును నెట్టడం, చెక్కముక్కలతో ఇల్లు కట్టడం వంటి చిన్న చిన్న ఆటలను ఎవరి బొమ్మలతో వారే ఆడుకునేలా మా కాలక్షేపాన్ని సాగించాం. మధ్యాహ్న భోజన వేళకు ముందు ఆడుకుంటున్న మాకు బయట ఉన్న మా నాన్న, అతని స్నేహితుడూ కిటికీలోంచి కనిపించారు. వివిధ రకాల పూల చెట్లను చూపించడం మిగిలిపోయింది. కనుక అప్పుడు వాళ్లు తోటలో పచార్లు చేస్తున్నారు. తోట పనిలోని ఆనందాన్ని మా నాన్న గుర్తించి అప్పటికి కొన్ని సంవత్సరాలైంది. ఒక పొద్దుతిరుగుడు పువ్వులో లేక గులాబి పువ్వులో గొప్ప జీవిత సత్యం దాగి ఉండటాన్ని గ్రహించాడు మా నాన్న. ఒకప్పుడైతే తీరిక వేళల్లో మా నాన్న విసుగూ అలసటా కలిగించే పుస్తక పఠనం చేస్తూ జీవిత పరమార్థాన్ని గురించి ఆలోచించేవాడు. కాని ఇప్పుడలా కాదు. చెట్లకు నీరు పారించడం, మొక్కల ఆకులను, కొమ్మలను కత్తిరించడం, చెట్లకు అంటుకట్టడం, కలుపు తీయడం చేస్తున్నాడు. పుస్తకాల మీద ఆయనకున్న ప్రేమ ఒకేసారి ఏకమొత్తంగా మొక్కల మీదికి, పువ్వుల మీదికి మళ్లింది. పూర్తి తోటను తయారు చేసి వోల్టేర్ నవలలోని ఒక పాత్ర చెప్పినట్టు తన ఆనందమంతా తోటపనిలోంచే వచ్చిందని నిర్ణయించాడు. ‘‘ఏదో ఒకనాడు టార్మాలో భూమి కొని తీరుతాను. కాని ఇట్లాంటి చిన్న ప్లాట్ కాదు. పెద్ద ఫామ్‌నే కొంటాను. అప్పుడు నీకు నా తడాఖా తెలుస్తుంది అల్బర్టో’’ అని నాన్న అనటం మాకు వినపడింది. ‘‘టార్మాకు బదులు చాక్లకాయో అయితే ఎలా ఉంటుంది పెరికో? అది లిమా నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాని వాతావరణం మాత్రం లిమాలో ఉన్నట్టే ఉంటుంది’’ అన్నాడు నాన్న స్నేహితుడు. అక్కడ తాను అన్ని సౌకర్యాలతో కూడిన పెద్ద ఇంటిని కడుతున్న విషయాన్ని నాన్నకు చెప్పాడు.‘‘కానీ నా తాత టార్మాలో నివసించేవాడు. చాక్లకాయోలో కాదు కదా’’ అన్నాడు నాన్న.టార్మాలో అయితే నాన్నకు తన పూర్వీకులతో కలసి నివసించినట్టు! నాన్నను తన స్నేహితుడు యవ్వన దశలో పెరికో అని పిలిచేవాడట.అల్బర్టో జూనియన్ తన బొమ్మకారును మంచం కిందికి పంపి అక్కడికి పాక్కుంటూ వెళ్లాడు దాన్ని తేవటానికి. అతడు బిగ్గరగా వేసిన గెలుపు కేరింత వినపడింది మాకు. అతనికి మంచం కింద ఫుట్‌బాల్ దొరికింది. అతన్ని ఉల్లాసంగా ఉంచడానికి ఎంతగానో యాతన పడుతున్న మాకు ఫుట్‌బాల్ ఆడాలనే ఆ ఒంటరి అపరిశుభ్ర బాలుని రహస్యమైన కోరిక తెలిసిపోయింది. అప్పటికే అతడు లేసులతో ఆ ఫుట్‌బాల్‌ను పట్టుకుని దాన్ని తన్నబోయాడు. కాని మేము అతన్ని వారించాం. గదిలో ఫుట్‌బాల్ ఆడటం పిచ్చితనమే. తోటలో ఆడటమేమో నిషేధితం. కనుక మాకు వీధిలోకి వెళ్లటం తప్ప వేరే మార్గం లేకపోయింది. ఆ వీధి కొన్నేళ్ల కిందట మేము గోమెజ్ సోదరులతో ఆడిన ఉద్వేగపూరిత క్రీడలకు మైదానంగా ఉండేది. ఆ గేములను మేము పూర్తి చీకటి పడేదాకా నాలుగైదు గంటలు ఆడేవాళ్లం. అప్పుడు మాకు ఒకరికొకరు గాని, ప్రత్యర్థులు చేసిన గోల్స్ గాని కనపడేవి కావు. ఆట అప్పుడు ఒక దయ్యాల తోపులాటలా ఒక భయంకరమైన చీకటి యుద్ధంలా తయారయ్యేది. అందులో అన్ని రకాల ఫౌల్‌లు, మోసాలు చోటు చేసుకునేవి. పిల్లలమే అయినా మా ఆటల్లో మేము కనబరచినంత కసిని, ప్రగాఢమైన పట్టుదలను లేక ఆత్మాభిమానాన్ని ప్రొఫెషనల్ జట్లు కూడా కనబరచి ఉండవు. అందుకే గోమోజ్ కుటుంబం వెళ్లిపోయిన తర్వాత మేం ఫుట్‌బాల్ ఆటను పూర్తిగా మానేశాం. అలాంటి వర్ణనీయ క్రీడా సమరాల వంటి గేములు మళ్లీ జరగవు అని ఫుట్‌బాల్‌ను మంచం కింద దాచి ఉంచేశాం. ఇప్పుడు జూనియర్ అల్బర్టో దాన్ని వెలికితీసే దాకా ఆ ఫుట్‌బాల్ మంచం కింద అలానే పడి ఉంది. అతడు కోరుతున్నది ఫుట్‌బాల్ ఆట అయితే అతనికి మొహమ్మొత్తేటంతగా ఆడుదామని నిర్ణయించుకున్నాం.మా ఇంటి గోడ ముందు గోల్‌పోస్టు ఉంచాం. ఎందుకంటే గోల్ అయినప్పడు బంతి గోడను తాకి వెనక్కి వస్తుంది. జూనియర్ అల్బర్టోను గోల్‌పోస్టులో నిల్చోబెట్టాం. మా మొదటి ప్రయత్నాలను అతడు ధైర్యంగానే ఎదుర్కొని గోల్ అవకుండా కాపాడాడు. కాని ఆ తర్వాత మేం విజృంభించి ధనాధన్ గోల్ తర్వాత గోల్ చేశాం. ఆ అబ్బాయి నేల మీద పారాడుతూ, కాళ్లూ చేతులూ బార్లా చాపి బంతిని ఆపలేకపోతుంటే అది చూసి మాకు ఆనందోత్సాహాలు కలిగాయి. తర్వాత గోల్ కొట్టడానికి అతని వంతు వచ్చింది. గోల్ ఆపడం నా పని. బక్కపలుచగా ఉన్న అతడు బంతిని తన్నుతున్నప్పుడు ఒక కంచర గాడిద తన్నినట్టనిపించింది. మొదటి గోల్‌ను నేను ఆపగలిగాను. కాని తర్వాత కొంతసేపటి దాకా నా అరచేతులు మండాయి. గోల్‌పోస్టు మూలలోకి తన్నిన అతని రెండో గోల్ గొప్పది. కాని అతడు చేసిన మూడో గోల్ అత్యంత సుందరమైనదీ బ్రహ్మాండమైనదీనూ. ఆ బంతి నా చేతుల మధ్యలోంచి దూసుకుపోయి, గోడపై నుంచి వెళ్లి, మల్లెచెట్టు కొమ్మల మధ్యలోంచి సైప్రెస్చెట్టు మీదుగా పోయి, తుమ్మచెట్టు కొమ్మను తాకి అక్కణ్ణుంచి మా ఇంటి లోపలికి అదృశ్యమైంది. ఎప్పట్లాగానే మేము వీధి పేవ్మెంట్ గట్టుమీద కూర్చుని బంతిని తీసుకొచ్చే పనిమనిషి కోసం నిరీక్షించసాగాం. కాని ఎవరూ రాలేదు. మేం లేచి బంతిని వెతకటానికి వెళ్లాలనుకున్న సమయంలో మా ఇంటి దొడ్డిదారి తలుపును తెరుచుకుని నాన్న వచ్చాడు. అతని చంకలో ఫుట్‌బాల్ ఉంది. ఆయన బాగా పాలిపోయి ఉన్నాడు. మాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వీధి చివరిదాకా నడిచి, ఎదురుగా ఈలవేస్తూ వస్తున్న కూలివాడి దగ్గరకు చేరాడు. ఆ బంతిని వాడి చేతుల్లో పెట్టి మావైపు ఒక్క చూపు కూడా చూడకుండా ఇంట్లోకి వెళ్లిపోయాడు. జరిగిన విషయం అర్థం కావడానికి ఆ కూలివాడికి కొంత సమయం పట్టింది. అర్థం అయిన తక్షణమే వాడు బంతిని తీసుకుని పరుగెత్తడంతో వాణ్ణి పట్టుకునే అవకాశం లేకపోయింది మాకు. మధ్యాహ్న భోజనానికి మమ్మల్ని పిలవటం కోసం అమ్మ ద్వారం దగ్గర వేచి ఉంది. ఆమె ఎంత ఆందోళనగా ఉన్నదంటే ఆమెను చూడగానే ఏదో జరగరాని ఘోరం జరిగినట్టు తెలిసిపోయింది మాకు. లోపలికి రావలసిందిగా ఒక తొందరతో కూడిన చిన్న సంజ్ఞ చేసింది. మేం ఆమెను దాటుకుంటూ పోతుంటే ‘‘అలా ఎందుకు చేశార్రా మీరు?’’ అన్నదామె. మా నాన్న గదికి ఉన్న ఒక ఊచలు లేని కిటికీ సగం తెరిచి ఉండటాన్ని గమనించగానే ఏం జరిగి ఉంటుందో మేము ఊహించగలిగాం. జూనియర్ అల్బర్టో అద్భుతంగా తన్నిన ఆ బంతి నమ్మశక్యంకాని విధంగా అర్ధచంద్రాకారపు బాటలో పయనించి గోడలు, చెట్లు, ఊచలు మొదలైనవాటిని దాటి వార్డ్రోబుకు ఉన్న అద్దానికి సరిగ్గా నట్టనడుమ తగిలింది. అల్బర్టో జూనియర్ కాని మరెవరైనా కాని జీవితమంతా ప్రయత్నించినా అట్లాంటి షాట్‌ను మళ్లీ కొట్టడం సాధ్యం కాదు.లంచ్ తినడం మాకు ఇబ్బందికరమైంది. అతిథి ముందు మమ్మల్ని తిట్టలేక నాన్న తన కోపాన్ని దిగమింగుకున్నాడు. ఆయన పాటించిన మౌనాన్ని ఛేదించే ధైర్యం ఎవ్వరికీ లేకపోయింది. భోజనం తర్వాత మేము పండ్లరసాలను తీసుకుంటున్నప్పుడు నాన్న కొంచెం మెత్తబడి మాకందరికీ కొన్ని ఆహ్లాదకరమైన కథలు చెప్పాడు. నాన్న నర్మగర్భంగా చేసిన సూచనను అల్బర్టో గ్రహించడంతో ఆ భోజనాలు నవ్వులతో ముగిశాయి. కాని అప్పటికే ఆలస్యమైపోయింది. ఆ మధ్యహ్న భోజనమేగాక పాత మిత్రుణ్ణి ఆహ్వానించడమనే అరుదైన సదుద్దేశం పూర్తి ప్రహసనంగా మారిన విషయం మా మానసుల్లోంచి చెరగిపోలేకపోయింది. తండ్రీ కొడుకులిద్దరూ త్వరగానే వెళ్లిపోయారు. నాన్నకు మమ్మల్ని శిక్షించే అవకాశం దొరికిందని మేము భయపడ్డాం. కాని స్నేహితుని రాక వల్ల అలసిపోయి ఆయన మాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండానే పగటి కునుకులోకి జారుకున్నాడు. నిద్రలోంచి మేల్కొనగానే నాన్న మమ్మల్నందర్నీ తన గదిలో సమావేశపరచాడు. దిండ్ల మీద తలను ఆనించిన ఆయన తాజాగా, ప్రశాంతంగా కనిపించాడు. మధ్యాహ్నపు వెలుతురు గదిలోకి పుష్కలంగా వచ్చేలా కిటికీ తలుపులను బార్లా తెరిచాడు.వార్డ్రోబును చూపిస్తూ ‘‘అటు చూడండి’’ అన్నాడు. ఆ దృశ్యం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అద్దాన్ని పోగొట్టుకోవడం ద్వారా వార్డ్‌రోబు తన ప్రాణాన్నే కోల్పోయినట్టు ఉంది. ఇంతకు మునుపు అద్దం ఉండిన చోట ఇప్పుడు కేవలం ఒక నల్లని దీర్ఘ చతురస్రాకారపు చెక్క మాత్రమే ఉంది. అది ఏమీ చెప్పని, దేన్నీ ప్రతిఫలించని దిగులు నిండిన ఖాళీ ప్రదేశం అనిపించింది. తళతళ మెరిసే తటాకపు నీళ్లన్నీ ఒక్కసారిగా ఆవిరైపోయినట్టు ఉన్నది ఆ ఖాళీ స్థలం.‘‘నా పూర్వీకులు తమను తాము చూసుకున్న అద్దం అది’’ అని మమ్మల్ని వెళ్లిపొమ్మన్నట్టు చేయి ఊపాడు నాన్న.ఆ రోజు నుంచి మా నాన్న తన పూర్వీకుల గురించిన ప్రస్తావన తేవడం మేమెరుగం. తను అదృశ్యమవుతూ ఆ అద్దం తన పూర్వీకులను కూడా అదృశ్యం చేసింది. గతం మా నాన్నను బాధించడం మానేసింది. పైగా నాన్న తన భవిష్యత్తులోకి కుతూహలంతో చూడనారంభించాడు.బహుశా తనింకా ఎక్కువకాలం జీవించేది లేదని ఆయనకు తెలిసిందేమో! అందువల్ల తన పూర్వీకులను కలుసుకోవడానికి ఆయనకు అద్దపు అవసరం లేకపోయింది. మరో జన్మలో కూడా వాళ్లను కలుసుకోలేననుకున్నాడు. ఎందుకంటే ఆయనకు పునర్జన్మ మీద నమ్మకం లేదు. అతన్ని బంధించిన పుస్తకాల ప్రపంచం, పువ్వుల ప్రపంచంలో కూడా వాళ్లను కలువలేననుకున్నాడు. ఆయనకు అదొక శూన్యం నిండిన ప్రదేశం. పెరూవియన్ కథ : హూలియో రమోన్ రిబేరో అనువాదం: ఎలనాగ -
కనిపించదు కదా గురువర్యా!
అదో ఆశ్రమం. గురువుగారు శిష్యులకు ఎనో విషయాలను సోదాహరణగా చెబుతున్నారు. తాను చెబుతున్న విషయాలు అర్థమవుతున్నాయో లేదో తెలుసుకునేందుకు మధ్యమధ్యలో వాళ్లకు ప్రశ్నలు సంధిస్తూ, వాళ్లు చెబుతున్న సమాధానాలలోని తప్పొప్పులు సరిదిద్దుతున్నారు. అందులో భాగంగా గురువుగారు శిష్యులను ఓ ప్రశ్న అడిగారు– అసలు గురువు ఎందుకు? అని. ఏమి చెప్పాలో తెలియక శిష్యులందరూ ముఖాముఖాలు చూసుకుంటుంటే, ఒక శిష్యుణ్ణి పిలిచి, ‘‘నీ ముఖం ఎలా ఉందో, నీ కళ్లు, ముఖం శుభ్రంగా ఉన్నాయో లేదో చెప్పగలవా?’’ అని అడిగారు. అందుకు ఆ శిష్యుడు ‘‘నా ముఖం నాకు కనపడదు కదా గురువర్యా’’ అన్నాడు. గురువుగారు మందహాసం చేస్తూ, ‘‘నీ ముఖం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఏం చేస్తావు?’’అనడిగారు. శిష్యుడు ఓ క్షణం ఆలోచించి, ‘‘అద్దంలో చూసుకుంటే నా ముఖం ఎలా ఉందో, నేనెలా ఉన్నానో ఖచ్చితంగా చెప్పొచ్చు గురువుగారూ’’అన్నాడు శిష్యుడు. ‘చక్కగా చెప్పావు. అదే సరైన సమాధానం కూడా. నువ్వు నీ ముఖాన్ని అద్దంలో చూసుకుంటే నీ ముఖం గురించి నీకు అంతా అర్థమైపోతుంది. అవునా?’’ అవునన్నట్టు తలూపాడు శిష్యుడు. ‘‘ఇక్కడ నువ్వు గమనించవలసింది ఏమిటంటే, నీ ముఖాన్ని నువ్వు ఉన్నట్టుగా చూపించే అద్దమే గురువు. గురువు నీకు తెలీని నీ రూపాన్ని నీకు చూపించి, నీలో జ్ఞానాగ్నిని రగిలిస్తాడు. నీలోని శక్తియుక్తులను, నీలోని లోపాలను, నీ ముఖానికి అంటుకుని ఉన్న మురికిని, మరకలను కూడా నీకు చూపిస్తాడు. నీలో ఆత్మవిశ్వాసాన్ని రగుల్కొల్పుతూనే, నీలో ఉన్న అతి విశ్వాసాన్ని తనకున్న జ్ఞానాగ్నితో దహించి వేస్తాడు’’ అంటూ ఒక మామూలు అద్దం ఉదాహరణతో అందరికీ అర్థమయ్యేలా వివరించారు గురువుగారు. – రమాప్రసాద్ ఆదిభట్ల -
నవ్వితేనే చూపిస్తా!..
ఎవరైనా అద్దం ముందు నిలబడితే వారి ప్రతిబింబాన్ని చూపిస్తుంది. అలా చూపించకపోతే దాన్ని అద్దమే అనం కదా! కానీ మన ప్రతిబింబాన్ని చూపించకపోయినా ఒక్కోసారి అద్దం అనాల్సి ఉంటుంది. ఈ విషయానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ ఫొటోలో కనిపిస్తున్న అద్దం. దీని ఎదురుగా మామూలు స్థితిలో నిలబడితే మన ముఖాన్ని చూపించదు. మన ప్రతిబింబాన్ని చూడాలంటే మాత్రం మనం చిన్న చిరునవ్వును ఇవ్వాలి. స్మైల్ ఇస్తేనే ఈ అద్దం మన ప్రతిబింబాన్ని చూపిస్తుంది. దీన్ని కేన్సర్ రోగుల కోసం ప్రత్యేకంగా తయారుచేశారు. ఇదొక హైటెక్ మిర్రర్. ఇందులో ఒక కెమెరా ఉంటుంది. ప్రత్యేక సాఫ్ట్వేర్ సహాయంతో ఈ అద్దం పనిచేస్తుంది. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించుకుని మన ముఖ కవళికలను ఈ అద్దం గుర్తిస్తుంది. మనం నవ్వులు చిందించినప్పుడు కెమెరా సహాయంతో మన ముఖాన్ని గుర్తించి సదరు వ్యక్తి ప్రతిబింబం దర్శనమిస్తుంది. దీన్ని గోడకు, టేబుల్ మీద ఎక్కడైనా ఉంచి సాధారణ అద్దం తరహాలో ఉపయోగించవచ్చు. ప్రస్తుతం దీని ధర 2,000–3,000 డాలర్ల మధ్య ఉంది. దీన్ని టర్కీస్ ఇండస్ట్రియల్ డిజైనర్ బెర్క్ ఇల్హాన్ రూపొందించారు. బెర్క్ ఇంట్లో ఒకరికి కేన్సర్ వచ్చింది. అప్పటి నుంచి ఆ ఇంట్లో నవ్వులు దూరమయ్యాయి. ఎలాగైనా ఆ ఇంట్లో నవ్వులు పూయించాలనుకున్న ఇల్హాన్ రెండేళ్లు కష్టపడి ఈ హైటెక్ మిర్రర్‌ను రూపొందించారు. -
ప్రతి బంధం... ప్రతిబింబం
మనిషికి మనిషికి మధ్య ఉండేది బంధం. మనిషికి అద్దానికి మధ్య ఉండేది బింబం. ఈ బంధాల కడలిలో... అనుబంధాల తీరంలో... ప్రతి అలా ఒక జ్ఞాపకం. అటువంటి ఎన్నో అలల ప్రతిబంబమే ప్రతీబంధం! మనల్ని మనం అద్దంలో చూసుకునే బదులు మన బింబాన్ని బంధాల్లో చూసుకుంటే... అనుబంధాలు బలపడతాయి. ప్రతిబింబాలూ అందంగా కనబడతాయి. అప్పుడు ప్రతిబంధం... ప్రతిబింబం. ఏడ్చి ఏడ్చి ఎంత సేపు పడుకుందో తెలియలేదు మాధవికి. మెలకువ వచ్చాక చూస్తే చీకటి ఆవరిస్తున్నట్టుగా అనిపించింది. టైమ్ చూస్తే సాయంత్రం ఆరు అవుతోంది. గదిలో ఒంటరిగా ఉంది. గదిలోనే కాదు ఆ ఇంటిలో ఒంటరిగానే ఉంటోంది రెండు రోజులుగా. ఆ గదిని వదిలి బయటకు రాలేకపోతోంది. అలాగని ఆ గదిలో ఉండలేకపోతోంది. ఎవరైనా పలకరిస్తే బాగుండు అనిపించింది. ఎవరైనా ఫోన్ చేశారేమో అని ఒకట్రెండు సార్లు ఫోన్ తీసి చూసింది. ఎవరూ ఫోన్ చేయలేదు. ‘అసలెవరున్నారు తనకు.. ఫోన్ చేయడానికి..!’ ఇలా అనుకోగానే మళ్లీ దుఃఖం కమ్ముకొచ్చింది. కిందటి రోజు జరిగిన సంఘటన గుర్తుకువచ్చి, మాధవి దుఃఖం రెట్టింపు అయ్యింది. ఒంటరితనం ఓ కష్టం! ‘ఎన్నెన్ని మాటలు అని వెళ్లాడు రవి. ఎంత ప్రేమించింది అతణ్ణి. పెళ్లై ఏడాదైనా కాలేదు. నాలుగేళ్లుగా చూపించిన ప్రేమంతా ఏమైపోయింది? తనతో తిరిగిన రోజులు... సంతోషంగా ఉన్న రోజులు... ఇప్పుడవన్నీ ఏమైపోయాయి?’ తనలో తానే మథనపడసాగింది. ‘‘నువ్వు స్వార్థపరురాలివి. ఒక్కదానివే ఉండు’’ అన్న రవి మాటలు పదే పదే సూదుల్లా గుండెను పొడుస్తున్నట్టుంది మాధవికి. ‘రవి ఇలా మాట్లాడడానికి కారణం వాళ్ల అమ్మనాన్న, చెల్లెలే కదా! వాళ్ల నుంచి దూరంగా వచ్చి, మేం సంతోషంగా ఉన్నామని కుళ్లు. వాళ్లే రవికి అన్నీ నేర్పి, ఇక్కడ్నించి తీసుకెళ్లిపోయారు’ అని ఏడుస్తూనే ఉంది. నాలుగేళ్ల క్రితం కాలేజీలో కలుసుకున్నారు ఇద్దరు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. మూడేళ్లు కలిసి తిరిగారు. ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. రవి వాళ్ల అమ్మానాన్న ముందు ఒప్పుకోలేదు. కానీ, రవే ఒప్పించాడు. మాధవికి అమ్మానాన్న లేరు. ఉన్న నానమ్మ సరే అంది. అనుకున్న నెల రోజుల్లోనే పెళ్లయిపోయింది. కలిసుండడం ఓ కష్టం!! పెళ్లయ్యాక ఆరు నెలలు అత్తమామలతోనే కలిసి ఉంది మాధవి. ఆ ఇంటి బాధ్యత అంతా రవిదే అని తెలిసింది. భర్త చనిపోవడంతో రవి చెల్లెలు పుట్టింట్లోనే ఉంటుంది కూతురితో సహా. మరిదికి ఇంకా ఉద్యోగం లేదు. చుట్టపు చూపుగా వచ్చే పెద్దాడపడుచు ‘ఇద్దరూ ఉద్యోగస్థులే కదా! ఏదైనా సాయం చేయండం’టూ మాట్లాడేది. కొన్ని రోజుల్లోనే ఇల్లంతా రణ రంగమే అనిపించసాగింది మాధవికి. వీటన్నిటి నుంచి బయటపడా లనుకునేది. ఆఫీసు బాగోలేదని ఉద్యోగం మానేసింది. భర్తకు తన మీద చాడీలు చెబుతోందేమో అని ఆడపడుచుపై అనుమానం. అత్తగారు కొడుకునూ, తననూ విడదీసే ప్రయత్నం చేస్తున్నారని అపోహతో గొడవ. ఓ రోజు ‘ఈ ఇంట్లో నేనుండలేను’ అని భర్తతో అంది. దీంతో తప్పనిసరై వేరు కాపురం పెట్టారు. అన్నీ కఠిన పాఠాలే! వేరు కాపురం... తన ఇష్టం వచ్చినట్టు ఉండచ్చు అన్న ఆనందం మాధవికి ఎన్నో రోజులు లేదు. పదే పదే అత్తమామల ఖర్చుల కోసం రవికి ఫోన్ చేయడం, ఏవో సమస్యలు చెప్పడం... తరచూ వాళ్ళ దగ్గరికి రవి వెళ్లిరావడం మాధవి భరించలేకపోయేది. ఆ ఇంటితో పూర్తిగా తెగతెంపులు చేసుకోమని గొడవ. ఓ రోజు రాత్రి రవి వాళ్ల అమ్మ ఫోన్ చేసింది. ‘చెల్లెలికి ఒంట్లో బాగోలేదు... జ్వరం. అర్జెంటుగా రమ్మనమని. ఫోన్లో మాట్లాడిన విషయం రవికి చెప్పలేదు మాధవి. ‘జ్వరం వస్తే కంగారెందుకు? చీటికీ మాటికీ ఫోన్లు చేయడం, విసిగించడం?’ అనుకొని ఊరకుంది. ఉదయాన్నే చెల్లెలి ఆరోగ్య పరిస్థితి బాగోలేదనీ, ఫిట్స్ వచ్చాయనీ, చుట్టుపక్కల వారి సాయంతో ఆసుపత్రిలో చేర్చారనీ రవికి తెలిసింది. ఒంట్లో బాగా లేదని తెలిసీ మాధవి తనకు చెప్పలేదని మాధవి మీద కోపంతో విరుచుకుపడ్డాడు రవి. ‘నువ్వు ఒంటరిదానివి, ఒంటరిగానే బతుకు’ అంటూ వెళ్లిపోయాడు. కోపంలో రవి అన్న ప్రతీ మాటను గుర్తు తెచ్చుకొని ఏడుస్తోంది మాధవి. ఎవరో డోర్ తట్టిన శబ్దం రావడంతో రవి ఏమో అని ఆత్రుతగా వెళ్లింది. గుమ్మంలో ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది. వచ్చిన భరోసా! అమెరికాలో ఉన్న మాధవి మేనత్త పూర్ణ. పోల్చుకోవడానికే కొంత టైమ్ పట్టింది మాధవికి. ‘‘నానమ్మ ద్వారా అడ్రెస్ తెలుసుకొని వచ్చానే’’ చెప్పింది పూర్ణ. ‘‘మళ్లీ అమెరికా వెళుతున్నా, నీ పెళ్లికి కూడా రాలేదు. ఒక్కసారి నిన్ను చూడాలనిపించింది. వచ్చా’’ అంది. చిన్నప్పుడు ఆమె దగ్గర తను మారాం చేసిన క్షణాలన్నీ గుర్తుకువచ్చాయి మాధవికి. ‘‘ఎలా ఉన్నావురా!’’ అని మేనత్త ఆప్యాయంగా అడిగేసరికి మాధవి భోరుమంది. బతకాలని లేదనీ, ఎప్పుడూ ఒంటరి బతుకే అని చిన్నపిల్లలా ఏడ్చేసింది. మెల్లగా విషయమంతా తెలుసుకున్న పూర్ణ మాధవికి ధైర్యం చెప్పింది. ‘నీ సమస్యకు పరిష్కారం నేను చెప్పడం కన్నా నీవే స్వయంగా తెలుసుకుందువుగానీ’ అంటూ ఊరడించింది. మరుసటి రోజు పూర్ణ, మాధవిని తీసుకొని ఒక క్లినిక్‌కి వెళ్లింది. అది ‘పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ’ క్లినిక్. గత జన్మ అనుభవాల నుంచి ఈ జన్మ జీవనవిధానం తెలుసుకునే చోటు. ఈ థెరపీ ప్రాధ్యాన్యాన్ని తెలుసుకుంది మాధవి. కౌన్సెలర్ దగ్గర తన సమస్యను వివరించింది. ‘‘మీ సమస్యను మీకై మీరుగా అద్దంలో చూసుకున్నట్టు చూడగలరు. మీరు సిద్ధమైతే ధ్యానప్రకియ ద్వారా ఆ అవకాశం ఉంది!’’ అని చెప్పారు కౌన్సెలర్. ‘‘సిద్ధమే’’ అంది మాధవి. అన్నీ ఆత్మీయ బంధాలే! థెరపీ మొదలైంది. మాధవి తన పాతికేళ్ల జీవితాన్ని కళ్లు మూసుకొని ధ్యానప్రకియలో దర్శిస్తోంది. ఒక్కో సంవత్సరం వెనక్కి వెళుతూ, తాను దర్శిస్తున్నవాటన్నిటి గురించి చెబుతోంది. కౌన్సెలర్ నోట్ చేసుకుంటున్నారు. తన పెళ్లి, హాస్టల్ జీవితం, అమ్మనాన్నలు గొడవపడి విడిపోవడం, బాల్యం, ఒంటరితనం.. అన్నీ మాధవి చూస్తోంది. ఆ దశలు అన్నింటిలోనూ తన వేదన గమనిస్తోంది. గర్భస్థ శిశువు దశ నుంచి గత జన్మకు ఆమె ప్రయాణం మొదలైంది. అక్కడ తనెవరితోనో గొడవపడుతోంది. ‘‘ఆవిడ ఎవరో కాదు... ఇప్పుడు అత్తగారు. కానీ ఆ జన్మలో నాకు అమ్మ. నన్ను పనులు చేయమని చెబుతోంది. నేను వినిపించుకోవడం లేదు. నేను పరిగెత్తుకుంటూ వెళ్లి పడబోయాను. నన్ను పట్టుకుని లేపారెవరో.. ఆమె నా ఆడపడుచు. కాదు కాదు... గత జన్మలో అప్పుడు నా చెల్లెలు. ‘సరిగా చూసుకోవా!’ దెబ్బతగులుతుంది అని చెబుతోంది. నాకు జబ్బు చేసింది. బెడ్ మీద ఉన్న నాకు సపర్యలు చేస్తున్నారెవరో... ఎవరో కాదు రవి.’’ కళ్ళ ముందు కదలాడుతున్న గత జన్మ దృశ్యాలన్నీ చెబుతున్న మాధవి కళ్లు వర్షిస్తున్నాయి పశ్చాత్తాపంతో. ప్రేమ, బాధ్యత, ధైర్యం, త్యాగం.. ఇలా ఇవన్నీ నేర్పించడానికి గురువుల్లా తనతో కలిసి ఆత్మీయ బంధువులుగా వాళ్ళు ప్రతి జన్మలోనూ ప్రయాణం చేస్తున్నారని తెలుసు కుంది. కర్మ ప్రయాణం అర్థమెన మరుక్షణం వారందరినీ క్షమించమని వేడుకుంది. తాను ఎవరి వల్ల వేదనకు గురైందో వారిని మనస్ఫూర్తిగా క్షమించగలిగింది. మెల్లగా ప్రశాంత వదనంతో మేల్కొంది. ఈ జీవితాన్ని చక్కదిద్దుకునే బాధ్యత తనదే అనీ, తాను ఒంటరిని కాదనీ తెలుసుకుంది. దేవతలా వచ్చావంటూ మేనత్తకు కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పుడు మాధవి ఒంటరి మనస్తత్వానికి స్వస్తి పలికింది. చుట్టూ ఉన్న బంధాలు, వాటిలోని సమస్యలను అర్థం చేసుకుంటూ, నేర్చుకుంటూ ఆనందంగా జీవితాన్ని మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. బంధాలే గురువులు కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సహోద్యోగులు... ఇలా మన చుట్టూ ఉన్న వ్యక్తులంతా అద్దాల్లాంటివారు. మన ప్రతిబింబాన్ని వాళ్లలో చూసుకోవచ్చు. మనలోని లోపాలను వారిలో చూసుకొని సరిదిద్దుకోవచ్చు. నైపుణ్యాలను పెంచుకోవచ్చు. మనకీ విషయాలను తెలియజేయడానికి, నేర్పడానికే బంధాల రూపంలో వ్యక్తులు కలుస్తుంటారు. కొంతమంది మాత్రమే వారి చర్యల ద్వారా (మంచి లేదా చెడు) మనల్ని ఆకర్షిస్తారు. అంటే ఆ గుణాలేవో మనలోనూ ఉన్నట్టు గుర్తించాలి. ‘ఎదుటివారిని తప్పుబట్టడం, విమర్శించడం’ అనే సమస్య చాలా మందిలో ఉంటుంది. ఈ పద్ధతికి స్వస్తి చెప్పి కొన్నాళ్లు గమనించండి. అందరూ మంచివాళ్లుగా కనిపిస్తారు. స్నేహబంధాలు కూడా పెరుగుతాయి. ‘ఎదుటి వ్యక్తి ఏ విషయం నేర్పడానికి వచ్చారు? అనే ఆలోచన చేయాలి. ఈ వ్యక్తి నుంచి నేను ఏం నేర్చుకుంటాను?’ అని ప్రశ్నించుకోవాలి. కర్మన్యాయం ఏంటంటే ‘నేర్చుకునేంతవరకు మళ్ళీ మళ్ళీ ఆ సమస్యలు, ఆ వ్యక్తులు కలుస్తూనే ఉంటారు. కొన్ని సంబంధాలు ఎంత క్లిష్టంగా ఉంటాయంటే అవి గత జన్మల నుంచి కూడా మోసుకుంటూ ప్రయాణిస్తూ ఉంటాయి. ‘కార్మిక్ రిలేషన్ షిప్స్’లో పాఠాలను అర్థం చేసుకోవడం, క్షమించడం, దయ చూపడం. వీటిని పాటిస్తేనే కర్మలు నశిస్తాయి. ఎదుటివారు మనం చూసుకునే అద్దం మాధవి ఈ జన్మ ప్రయాణంలోనే కాదు గత జన్మలోనూ బాధ్యత, భావోద్వేగాలు, బంధాలు, త్యాగానికి సంబంధించిన పాఠాలను అర్థం చేసుకునే క్రమంలోనే ఉంది. గత జన్మలోనూ భర్త, అత్తమామ, ఆడపడుచులు తనకు ఇవన్నీ నేర్పించడానికి బంధువులయ్యారని తెలుసుకుంది. ఇవన్నీ తెలియక వీటన్నింటి నుంచి దూరం అవ్వాలనుకుంది. అంటే, తన కర్మను పూర్తిచేయడానికి ఆమె సిద్ధంగా లేదు. అందుకే ‘ఒంటరితనం’లో కూరుకుపోయింది. రిగ్రెషన్ థెరపీలో తనను తాను తెలుసుకుంది. ‘తను ఇవ్వగలిగింది ఏమిటి? తిరిగి పొందగలిగేదేమిటి?’ అని అనే రియలైజేషన్‌కు వచ్చింది. అప్పుడే తన జీవితం పట్ల సానుకూల దృక్ఫథం ఏర్పడింది. తిరిగి అన్ని బంధాల మధ్య ఆనందంగా జీవించగలిగింది. - న్యూటన్ కొండవీటి, లైఫ్ రీసెర్చి అకాడమీ - నిర్మల చిల్కమర్రి -
ఈ అద్దాల కిటికీలతో మీ ఇల్లు విద్యుత్ సౌధమే!
ఇంటికైనా, భారీ భవనాలకైనా కిటికీలు అందంతోపాటు చల్లటి గాలి తెచ్చిపెడతాయి. వీటి ఉపయోగం ఇంతేనని మనం ఇప్పటివరకూ అనుకుంటున్నాం. అయితే టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు పరిస్థితి మారిపోనుంది. కావాలంటే పక్కనున్న ఫొటో చూడండి.. అందులో లాస్ అలమోస్ లేబొరేటరీ (యు.ఎస్.) శాస్త్రవేత్తలు చేత్తో పట్టుకుని ఉన్నది కిటికీలకు వాడే అద్దమే. కాకపోతే ఇదే అద్దం సోలార్ ప్యానెల్గానూ పనిచేస్తుంది. నిన్నమొన్నటివరకూ ఇలాంటివి చిన్నసైజులో మాత్రమే వస్తూంటే వీరు మాత్రం పెద్దపెద్ద సైజుల్లో తయారు చేసేశారు. వీటిని భవనాలకు లేదా ఇళ్ల కిటికీలకు వాడామనుకోండి. లోపల వాడే విద్యుత్తుకు అస్సలు బిల్లే కట్టక్కరలేదన్నమాట. ఒకవైపు సోలార్ప్యానెల్గా, మరోవైపు కిటికీలా పనిచేయడం ఎలా అని ప్రశ్నిస్తే... అంతా లుమినిసెంట్ సోలార్ కాన్సెంట్రేటర్స్ మహిమ అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇవి సూర్యరశ్మిని విశాలమైన ప్రాంతాల నుంచి సేకరించగలవు. వీటిల్లోని ఫ్లోరోఫోర్స్ ఒకవైపు కాంతిని లోపలికి పంపిస్తూనే మరోవైపు కొన్ని రసాయనాల సాయంతో కాంతి కిరణాలను చిన్నసైజులో ఉన్న ఫొటోవోల్టాయిక్ సెల్స్పైకి ప్రసరింప చేస్తాయి. ఈ లుమినిసెంట్ సోలార్ కాన్సెంట్రేటర్స్, ఫ్లోరోఫోర్స్ను ఒక సన్నటి పొరలా గాజుపై ఏర్పాటు చేసేందుకు శాస్త్రవేత్తలు డాక్టర్స్ బ్లేడ్ అనే ప్రత్యేకమైన పద్ధతిని ఉపయోగించారు. కిటికీల ద్వారా సౌరశక్తిని విద్యుత్తుగా మార్చగలిగితే ఎన్నో ఫలితాలు ఉంటాయని, ఎలాంటి మౌలిక సదుపాయాల అవసరం లేకుండా అవసరమైన చోట అవసరమైనంత విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవచ్చునని అంచనా. ఇది అందుబాటులోకి వస్తే మన ఇల్లూ ఇలాగే ఖర్చులేకుండా వెలిగిపోతుంది. -
'అద్దం'గా ఉంది
అమ్మాయి అద్దంలో చూసుకొని ‘అందంగా ఉన్నానా’ అనుకుంటుంది. మరి అమ్మాయే అద్దం వేసుకుంటే ప్రపంచమే అద్దంగా కనపడుతుంది. చూడండి అద్దాల అందాలు వేసుకుంటే ‘అద్దం’గా ఉంటుంది. రంగురంగుల దారాలు, మధ్యలో కొన్ని అద్దాలను ఉపయోగించి చేసే గుజరాతీ ప్రాచీన కళ గమ్తి ఎంబ్రాయిడరీ. సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఈ కళ గాగ్రా ఛోలీ మీద అధికంగా కనపడుతుంటుంది. ఈ మధ్య ఈ కళ శారీ అంచులు, బ్లౌజులు, కుర్తీలు, పాశ్చాత్య దుస్తుల మీద కూడా అందంగా మెరిసిపోతోంది. పండగ వేళకు ఈ ప్రాచీన కళ రెట్టింపు సందడిని తీసుకువస్తుంది. గమ్తి వర్క్‌తో రూపుదిద్దుకున్న గాగ్రా ఛోలీ. నవరాత్రి వేడుకలకు ఇంపైన కళ. రాజస్థానీ మిర్రర్ వర్క్‌తో తీర్చిదిద్దిన ఓవర్‌కోట్ తోనూ పండగ కళను తీసుకురావచ్చు. మిర్రర్ వర్క్ బ్యూటీ బాలీవుడ్ నటి అలియాభట్. మిషన్ వర్క్ చేసిన కుర్తా, పైజామాలకు అద్దాలను కుడితే ఇలా పండగ కళ వచ్చేసినట్టే! చిన్నా, పెద్ద అద్దాలతో చీరను, బ్లౌజ్‌ను సింగారిస్తే ఎంత అందంగా ఉందో కళ్లకు కడుతోంది బాలీవుడ్ నటి దీపికా పదుకొనే! పండగ రోజులను కాంతిమంతంగా మార్చాలంటే ‘అద్దం’ సరైన ఎంపిక. పెద్ద పెద్ద అద్దాలను చీర అంచు భాగంలో కుట్టి, లేటెస్ట్బ్లౌజ్ కట్‌తో స్టైల్‌గా మెరిసిపోవచ్చు. లాక్మే ఫ్యాషన్ వీక్‌లో వేదిక మీద సింపుల్‌గా అద్దం మెరుపులు.