ప్రముఖ స్టైలిస్ట్ ఆకృతి సెజ్‌పాల్ డ్రీమ్ వెడ్డింగ్ నెట్టింట ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆమె ధరించిన ముసుగు, లెహంగా అతిథులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ముఖ్యంగా మొత్తం అద్దాలతో తయారు చేసిన లెహెంగాలో వధువు ‘ఆకృతి’ మరింత ఆకర్షణగా నిలిచింది.
వధువు ఆకృతి సెజ్‌పాల్ 3డీ డిజైన్, పూర్తిగా పూలతో చేసిన పెళ్లి కూతురు వేసుకునే మేలి ముసుగులను చూశాం. కానీ పూర్తిగా మిర్రర్ వర్క్‌తో రూపొందించడం విశేషంగా నిలిచింది. లెహెంగాకు తోడుగా ఏమాత్రం క్లాత్ వాడకుండా తయారు చేసిన దుపట్టా కమ్ మేలి ముసుగుతో పెళ్లి కళతో కళకళలాడింది ఆకృతి. ఇంకా స్వీట్‌హార్ట్-నెక్‌లైన్ బ్లౌజ్, హెవీ లెహంగా స్కర్ట్, ఓపెన్ హెయిర్‌స్టైల్‌పై పిన్ చేసిన షీర్ దుపట్టాలో అందంగా మెరిసిపోయింది. చోకర్ నెక్‌పీస్, మ్యాచింగ్ జుమ్కీలు, పాపిట బిళ్లతో తన లుక్‌ను మరింత అద్భుతంగా ముస్తాబైంది.<
br>
Comments
Please login to add a commentAdd a comment