అద్దంలో చూసుకోవడానికీ భయపడేదాన్ని! | take care of the mirror! Vidya Balan | Sakshi
Sakshi News home page

అద్దంలో చూసుకోవడానికీ భయపడేదాన్ని!

Published Mon, Mar 3 2014 11:49 PM | Last Updated on Tue, Oct 2 2018 2:44 PM

అద్దంలో చూసుకోవడానికీ భయపడేదాన్ని! - Sakshi

అద్దంలో చూసుకోవడానికీ భయపడేదాన్ని!

లైఫ్ బుక్
 
నాది చాలా సున్నిత హృదయం. ఎవరైనా నాతో కఠినంగా మాట్లాడితే తట్టుకోలేను. మరే పని లేనట్లు రోజంతా ఆ విషయం గురించే ఆలోచించి తెగ బాధపడిపోతుంటాను. దీని నుంచి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాను.
     
సలహాలు అన్నివేళలా ఉపకరించవని చెప్పడానికి నా సొంత అనుభవాలే నిదర్శనం. ఉదా: ‘డర్టీ పిక్చర్’ సినిమాను ఒప్పుకోవద్దని చాలామంది సన్నిహితులు చెప్పారు. ‘ఆ సినిమా చేస్తే నీ కెరీర్ ముగిసినట్లే’ అని కూడా అన్నారు. నేను వాటిని చాలా తేలికగా తీసుకున్నాను. నా నిర్ణయాన్ని మార్చుకోలేదు. మార్చుకొని ఉంటే చాలా నష్టపోయేదాన్ని.
     
ఎప్పుడు పరాజయం ఎదురైనా ‘మేము ఉన్నాం కదా!’ అని నా కుటుంబం, స్నేహితులు ధైర్యాన్ని ఇచ్చేవారు. కొన్నిసార్లు అద్దంలో చూసుకోవడానికి కూడా భయపడేదాన్ని. ఆ అద్దంలో నా అంతరాత్మ ప్రత్యక్షమై ‘నువ్వెప్పుడూ విజయం సాధించలేవు’ అని తిడుతున్నట్లు అనిపించేది.
     
నేను చేసే పాత్రలు ఆ సినిమా వరకు మాత్రమే పరిమితం కావు. ఆ పాత్రలు నాతో పాటు ఇంటికి నడిచొస్తాయి. నవ్విస్తాయి. ధైర్యాన్ని ఇస్తాయి.
 - విద్యాబాలన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement