
అద్దం మళ్లీ అడ్డమొచ్చింది..
మొన్న సింహం.. నేడు తెల్ల పులి.. అద్దం ముందు భంగపాటు కామనైపోయింది. జపాన్ జూలో ఓ సింహం బుడ్డోడిని మింగేద్దామని అనుకుని.. అద్దం అడ్డురావడంతో చతికిలపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రష్యాలోని ఓ జూలో అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ఓ తెల్లపులి ఈమెను లాగించేద్దామని నక్కుకుంటూ వచ్చి.. అద్దం ఉందన్న సంగతి మరిచి.. చివరికిలా దానికి అతుక్కుపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.