అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటున్న గుర్రం (ఫోటో కర్టెసీ: ఎన్‌డీటీవీ)
చిన్న పిల్లల వీడియోలు కానీ, జంతువుల వీడియోలు కానీ చూస్తే.. వెంటనే పెదాల మీదకు ఆటోమెటిగ్గా నవ్వొస్తుంది. చిన్నారులు, జంతువుల చిలిపి చేష్టలు చూస్తే ఎంత ఒత్తిడి అయినా సరే ఎగిరిపోవాల్సిందే. ఇక చిన్న పిల్లల్ని, జంతువులను అద్దం ముందు నిలబెట్టినప్పుడు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ మరింత ఫన్నిగా ఉంటాయి. పిల్లలకు తొలిసారి అద్దంలో తమ ప్రతిబింబాన్ని చూపిస్తే.. ఆశ్చర్యంతో రకరకాల హావభావాలు వెల్లడిస్తారు. అదే జంతువులను తొలిసారి అద్దం ముందు నిలబెడితే.. అవి మిర్రర్‌లో తమ ప్రతిబింబం చూసుకుని దడుసుకుంటాయి. వేరే ఏదో జీవి తన ముందుకు వచ్చింది అనుకుని పారిపోతాయి. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఈ వీడియోలో ఓ గుర్రం తొలిసారి అద్దాన్ని చూస్తుంది. ఇక దానిలో తన ప్రతిబింబాన్ని చూసుకుని ఉలిక్కిపడుతుంది. కాస్త పక్కకు జరిగి మళ్లీ అద్దంలో చూసుకుంటుంది.. ఇదేంటి ఇక్కడ మరేవరో ఉన్నారు అనే భయం.. సందేహంతో మరో సారి అద్దంలో చెక్ చేసుకుంటుంది. ఇలా రెండు మూడు సార్లు అద్దంలో తన ముఖం చూసుకున్న గుర్రం.. చివరకు అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు అద్దంలో తనను తాను చూసుకున్నప్పుడు గుర్రం ఏమాలోచించి ఉంటుందో ఊహించి మరి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ‘‘వావ్ నేను ఇంత అందంగా ఉంటానా’’.. ‘‘అద్దంలో కనిపిస్తుంది నేనేనా..కాస్త మస్కరా పెట్టుకోవాలి’’.. ‘‘అద్దంలో ఉన్నది అందంగా ఉందా.. లేక నేను అందంగా ఉన్నానా’’ అని గుర్రం ఆలోచించి ఉంటుంది అని కామెంట్ చేస్తున్నారు నెటిజనులు.
చదవండి: అద్దం విలువ ఏడున్నర లక్షలా..!?
Comments
Please login to add a commentAdd a comment