ఇజ్రాయెల్‌లో ఒక విచిత్ర ఉదంతం వెలుగు చూసింది. ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాంతానికి చెందిన 10వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల యువతికి పురాతన అద్దం దొరికింది. ఇది 1500 ఏళ్ల క్రితం నాటిదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ అద్దాన్ని పురాతన కాలంనాటి ప్రజలు తమపై చెడు దృష్టి పడకుండా ఉండేందుకు ఉపయోగించేవారని సమాచారం.
హైఫాకు చెందిన ఆ అమ్మాయి పేరు అవివ్ వీజ్‌మన్. ఈ అమ్మాయి ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ చేపట్టిన పురావస్తు తవ్వకాల కార్యక్రమంలో పాల్గొంది. ఈ సమయంలో ఆమెకు అద్దం లభించింది. ఇజ్రాయెల్ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ తవ్వకాల పనుల్లో 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో అవివ్ వీజ్‌మన్ ఒకరు. పురావస్తు శాస్త్రానికి సంబంధించిన సమాచారాన్ని విద్యార్థులకు తెలియజేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం.
బైజాంటైన్ కాలం నాటి అద్దం
ఈ అద్దం దొరికిన ప్రదేశానికి ఉష అని పేరు పెట్టారు. ఇది బైజాంటైన్ కాలం నాటిదని సమాచారం. ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ క్యూరేటర్ నెవిట్ పోపోవిచ్ తెలిపిన వివరాల ప్లేట్ మధ్యలో ఉన్న ఈ గాజు అద్దం 6వ శతాబ్దపు బైజాంటైన్ కాలం నాటి 'మ్యాజిక్ మిర్రర్'లో భాగమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అద్దం అంత్యక్రియలకు బహుమతిగా ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది.
భవనం గోడ నుండి బయటపడిన అద్దం
తవ్వకాల్లో భాగంగా డిగ్గర్లు తమ పనిలో నిమగ్నమై ఉండగా, 17 ఏళ్ల అవియాకు ఆ అద్దం కనిపించింది. ఆమె దానిని సీనియర్ అధికారులకు చూపించింది. దానిని పరిశీలించిన అధికారులు అది1500 సంవత్సరాల నాటి అద్భుత అద్దం అని, దానిని చెడు దృష్టిని పోగొట్టుకునేందుకు ఉపయోగించేవారని తెలిపారు. ఇది దెయ్యాలు తరహా దుష్టశక్తులను దూరం చేస్తుందని నాటి కాలంలో నమ్మేవారట. దుష్టబుద్ధి కలిగినవారు ఈ అద్దంలో వారి ప్రతిబింబాన్ని చూసుకున్నప్పుడు, అద్దం యజమానిపై చెడు ప్రభావం ఉండదని నమ్మేవారట. అంత్యక్రియలకు బహుమతులుగా ఇలాంటి అద్దాలు ఇచ్చేవారని చరిత్ర చెబుతోంది.
ఇది కూడా చదవండి: వింతజీవుల అకస్మాత్తు దాడులు.. గ్రహాంతరవాసులే అంటున్న జనం!
Comments
Please login to add a commentAdd a comment