'అద్దం'గా ఉంది
అమ్మాయి అద్దంలో చూసుకొని ‘అందంగా ఉన్నానా’ అనుకుంటుంది. మరి అమ్మాయే అద్దం వేసుకుంటే ప్రపంచమే అద్దంగా కనపడుతుంది. చూడండి అద్దాల అందాలు వేసుకుంటే ‘అద్దం’గా ఉంటుంది.
రంగురంగుల దారాలు, మధ్యలో కొన్ని అద్దాలను ఉపయోగించి చేసే గుజరాతీ ప్రాచీన కళ గమ్‌తి ఎంబ్రాయిడరీ. సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఈ కళ గాగ్రా ఛోలీ మీద అధికంగా కనపడుతుంటుంది. ఈ మధ్య ఈ కళ శారీ అంచులు, బ్లౌజులు, కుర్తీలు, పాశ్చాత్య దుస్తుల మీద కూడా అందంగా మెరిసిపోతోంది. పండగ వేళకు ఈ ప్రాచీన కళ రెట్టింపు సందడిని తీసుకువస్తుంది.
గమ్‌తి వర్క్‌తో రూపుదిద్దుకున్న గాగ్రా ఛోలీ. నవరాత్రి వేడుకలకు ఇంపైన కళ.
రాజస్థానీ మిర్రర్ వర్క్‌తో తీర్చిదిద్దిన ఓవర్‌కోట్ తోనూ పండగ కళను తీసుకురావచ్చు. మిర్రర్ వర్క్ బ్యూటీ బాలీవుడ్ నటి అలియాభట్.
మిషన్ వర్క్ చేసిన కుర్తా, పైజామాలకు అద్దాలను కుడితే ఇలా పండగ కళ వచ్చేసినట్టే!
చిన్నా, పెద్ద అద్దాలతో చీరను, బ్లౌజ్‌ను సింగారిస్తే ఎంత అందంగా ఉందో కళ్లకు కడుతోంది బాలీవుడ్ నటి దీపికా పదుకొనే!
పండగ రోజులను కాంతిమంతంగా మార్చాలంటే ‘అద్దం’ సరైన ఎంపిక. పెద్ద పెద్ద అద్దాలను చీర అంచు భాగంలో కుట్టి, లేటెస్ట్‌బ్లౌజ్ కట్‌తో స్టైల్‌గా మెరిసిపోవచ్చు.
లాక్మే ఫ్యాషన్ వీక్‌లో వేదిక మీద సింపుల్‌గా అద్దం మెరుపులు.