embroidery
-
Paragamanjari: పుప్పొడి నేత..పరాగ మంజరి
పూల అందాలను చూసి మైమరచిపోవడం మనకు తెలిసిందే! వాటిలో దాగున్న పరాగ రేణువుల అందం చూస్తే... ప్రకృతి ఒడిలో మనకు తెలియని ఇన్ని అద్భుతాలు దాగున్నాయా అని ఆశ్చర్యపోవాల్సిందే! అత్యంత సంక్లిష్టంగా ఉండే ఆ పరాగ రేణువుల నిర్మాణపు అందాన్ని చూడటమే కాదు, వాటిని టెక్స్టైల్ డిజైన్స్‌లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నది హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ ఎమ్మెస్సీ విద్యార్థిని శివాని నేత చిలుకూరి. అత్యంత సూక్ష్మంగా కనిపించే ఈ అద్భుతాలను ‘పరాగ మంజరి’గా మనకు పరిచయం చేస్తున్నది. ‘దేశానికి గుర్తింపు తెచ్చే లక్షలాది యునిక్ డిజైన్స్‌ని పరిచయం చేయబోతున్న ఆనందంలో ఉన్నాను’ అంటున్న శివాని నేత తనప్రాజెక్ట్ విశేషాలను ఇలా మన ముందుంచింది..‘‘పరాగ అంటే పుప్పొడి – మంజరి అంటే డిజైన్. సంస్కృతం నుంచి తీసుకున్న ఈ పదాలను మాప్రాజెక్ట్కు పెట్టాం. బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలనుకుని, కుదరక బోటనీ సబ్జెక్ట్ తీసుకున్నాను. ఉస్మానియా యూనివర్శిటీలో ఎమ్మెస్సీ బోటనీ చేస్తున్నాను. నాకు డ్రాయింగ్ కూడా తెలుసు అని మా బోటనీ ప్రొఫెసర్ విజయభాస్కర్ రెడ్డి సర్ నాకు ఈ డిజైనింగ్ టాపిక్ ఇచ్చారు. దానిని ఇలా మీ ముందుకు తీసుకు రాగలిగాను.లక్షలాది మోడల్స్పరాగ రేణువులను రెండు విధాలుగా మైక్రోస్కోప్ చేశాను. లైట్ మైక్రోస్కోపీలో ఫ్లవర్ స్ట్రక్చర్, సెమ్(స్కానింగ్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్)లో పుప్పొడి రేణువులను స్కాన్ చేశాను. భూమిపైన లక్షలాది మొక్కలు, వాటి పువ్వులు వేటికవి భిన్నంగా ఉంటాయి. ఇక వాటిలోని పరాగ రేణువులు మరింత భిన్నంగా ఉంటాయి. మందార, వేప, తులసి, తిప్పతీగ, తుమ్మ, అర్జున, ఉల్లిపాయ, కాకర, ఆరెంజ్, జొన్న, మొక్కజొన్న, ఖర్జూరం, దోస పువ్వు... ఇలా దాదాపు 70 రకాల పుప్పొడి రేణువులను స్కాన్ చేసి, ఆ స్కెలిటిన్ నుంచి మోటిఫ్స్‌ను వెలుగులోకి తీసుకువచ్చాను. ఈ అందమైన పరాగ రేణువుల నుంచి మోటిఫ్స్ డిజైన్స్‌గా తీసుకు రావడానికి నాలుగు నెలల సమయం పట్టింది.పేటెంట్ హక్కుఇప్పటి వరకు సాఫ్ట్‌వేర్‌లోనే టెక్స్టైల్ ΄్యాటర్న్ని తీసుకున్నాను. క్లాత్ మీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మాది నేత కుటుంబమే. నేను చేసిన ఈ ప్రింట్స్ క్లాత్స్ మీదకు తీసుకురావచ్చని నిర్ధారణ చేసుకున్నాం. కాటన్, పట్టు, సీకో మెటీరియల్ మీదకు మోటిఫ్స్ ప్రింట్స్ చేయచ్చు. నేతలోనూ డిజైన్స్ తీసుకోవచ్చు. ఎంబ్రాయిడరీ కూడా చేయచ్చు. మేం ముందు టీ షర్ట్ పైన ప్రింటింగ్ ప్రయత్నం చేశాం. ఇంకా మిగతా వాటి మీదకు ప్రింట్స్ చేయాలంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ మద్దతు అవసరం అవుతుంది. బ్లాక్ ప్రింట్ చేయాలన్నా .. అందుకు తగిన వనరులన్నీ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ముందుగా పేటెంట్ హక్కు ΄÷ందేవరకు వెళ్లింది. దీనిని ఒక స్టార్టప్‌గా త్వరలోప్రారంభించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.టెక్స్టైల్ రంగం మద్దతుతో...ప్రకృతిలో కళ్లకు కనిపించేవి లైట్ మైక్రోస్కోపిక్ ద్వారా నలభై వరకు పిక్చర్స్ తీసుకుంటే, స్టెమ్ ద్వారా మరికొన్ని సాధించాం. కంప్యూటర్లో వియానా దేశం నుంచి పోలెన్ గ్రెయిన్స్ స్కెలిటన్ స్ట్రక్చర్ నుంచి కొన్ని తీసుకున్నాం. మన దేశానికి వేల సంవత్సరాల నుంచి అద్భుతమైన టెక్స్టైల్ డిజైనింగ్ కల్చర్ ఉంది. కలంకారీ, ఇకత్ పోచం పల్లి, గొల్లభామ, రాజస్థాన్‌లో బాందినీ, గుజరాతీలో లెహెరియా, కాశ్మీర్ ఎంబ్రాయిడరీ ఎప్పటి నుంచో ఉన్నాయి. అలాగే ‘పరాగ మంజరి’ మన దేశానికే వన్నె తెచ్చేలా తీసుకురావాలన్నది నా ప్రయత్నం. దీనిని తెలంగాణ ప్రభుత్వం టెక్స్టైల్ శాఖకు అందించి, వారి సపోర్ట్ తీసుకొని, ఈ వర్క్‌ను వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నాం’’ అని శివాని నేత చిలుకూరి తెలియజేశారు. లక్ష ΄్యాటర్న్స్ఒక్కో చెట్టు పువ్వుకు ఒక్కో ప్రత్యేకమైన పరాగ రేణువులు ఉంటాయి. ఈ పరాగ రేణువుల మోడల్స్ నుంచి కొన్ని లక్షల ΄్యాటర్న్స్ టెక్స్టైల్ రంగంలోకి తీసుకురావచ్చు. వీటిని పట్టు, కాటన్, సిల్క్, బెడ్ షీట్స్.. ఇలా ప్రతి క్లాత్ మీదకు తీసుకురావచ్చు. ఈప్రాజెక్ట్ తయారు చేస్తున్నప్పుడు ప్రపంచంలో ఎవరైనా ఇలా చేశారా.. అని శోధించాను. కానీ, ఎక్కడా మాకు ఆ సమాచారం లభించలేదు. అందుకే, పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేశాం. ఈ ΄్యాటర్న్స్ వస్త్ర డిజై¯Œ పరిశ్రమల్లో గణనీయమైన ప్రభావం చూపుతాయి. – డాక్టర్ అల్లం విజయ భాస్కర్‌రెడ్డి, అసోసియేట్ప్రొఫెసర్, బోటనీ డిపార్ట్మెంట్, ఉస్మానియా యూనివర్శిటీ – నిర్మలారెడ్డి, ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధి -
ఎంబ్రాయిడరీ ఎంపవర్మెంట్
తోడా ఆదివాసీలు... నీలగిరుల్లో ఉంటారు. వారి జీవనం ప్రకృతి ఒడిలో ప్రకృతితో మమేకమై సాగుతుంది. వారి చేతిలో రూపుదిద్దుకున్న ఎంబ్రాయిడరీ డిజైన్లు కూడా వారు నివసిస్తున్న ప్రకృతి సౌందర్యాన్ని ప్రతిబింబిస్తాయి. పూలు, లతలు, పౌరాణిక గాథలు కుట్టులో రూపుదిద్దుకుంటాయి. తెల్లటి వస్త్రం, గోధుమ వర్ణంలోని వస్త్రం మీద నల్లటి దారాలతో ఈ ఎంబ్రాయిడరీ చేస్తారు. సాధారణంగా ఎంబ్రాయిడరీ చేస్తే ఒక వైపు చక్కటి డిజైన్ కనిపిస్తే వెనుక వైపు దారాల ముడులుంటాయి. తోడా ఆదివాసీలు చేసే ఎంబ్రాయిడరీలో రెండు వైపులా డిజైన్ అందంగా కనిపిస్తుంది. ఇలాంటి అందమైన పనితనం కొండలకే పరిమితమైపోతే ఎలాగ అనుకున్నారు షీలాపావెల్. నీలగిరుల్లో తోడా ఆదివాసీలు నివసించే కుగ్రామాలన్నింటిలో పర్యటించారామె. వారిని స్వయం సహాయక బృందంగా సంఘటితపరిచారు. ‘షాలోమ్ ఊటీ’ పేరుతో తోడా ఆదివాసీ మహిళలను ఒక వేదిక మీదకు తీసుకువచ్చారు షీలా పావెల్. ఇప్పుడు తోడా ఆదివాసీ మహిళలు వారానికి ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయలు సంపాదించుకోగలుగుతున్నారు. ‘వారి చేతిలో ఉన్న కళ గొప్పతనం వారికి తెలియజేశాను, ఆ కళను ప్రపంచానికి పరిచయం చేశాను’ అన్నారు షీలా పావెల్. సాధికారత కుట్టారు షీలా పావెల్ వయసు 59. తమిళనాడులోని ఊటీలో నివసిస్తారు. ఆమె 2005లో షాలోమ్ ఊటీ స్వయం సహాయక బృందాన్నిప్రారంభించారు. అప్పుడు 250 మందితో మొదలైన బృందంలో ఇప్పుడు 150 మంది చురుగ్గా ఉన్నారు. అప్పటి సంగతులను తెలియచేస్తూ ‘‘తోడా ఆదివాసీ మహిళల చేతిలో ఏం నైపుణ్యం ఉందో తెలియదు. అందమైన ఎంబ్రాయిడరీతో చక్కటి శాలువాలు వాళ్ల చేతిలో రూపుదిద్దుకోవాల్సిందే. ఈ మహిళలు తాము ఎంబ్రాయిడరీ చేసిన శాలువాలను సమీపంలోని ఊటీ పట్టణానికి తెచ్చి అమ్ముకునేవారు. ఊటీలో దుకాణాల వాళ్లు తక్కువ ధరకు కొని వాటిని పర్యాటకులకు మంచి ధరకు అమ్ముకునేవారు. ఈ మహిళలకు మరొక ప్రపంచం తెలియకపోవడంతో ఆ వచ్చిన డబ్బుతో సంతృప్తి పడేవారు. వారిని సంఘంగా ఏర్పరిచి, వారు తయారు చేసిన శాలువాలు, కీ చైన్లు, మఫ్లర్లు, పర్సులు వంటి వాటిని తమ బృందం పేరుతో లేబుల్ అతికించి అమ్మడం మొదలు పెట్టారు. వ్యవస్థీకృతంగా లేని పనిని, కళ చేతిలో ఉన్న వారిని వ్యవస్థీకృతం చేయడమే నేను చేసింది. అప్పట్లో షాల్ కోసం వాళ్లు తీసుకునే క్లాత్కంటే కొంచెం మెరుగైన క్లాత్ కొని ఇవ్వడం, మార్కెటింగ్ మెళకువలు నేర్పించడం వంటివి చేశాను. గతంలో ఐదు వందలకు అమ్మిన శాలువాలను ఇప్పుడు వెయ్యి రూపాయలకు అమ్మగలుగు తున్నారు. నా కళ్లముందే వారి జీవన స్థాయులు పెరిగాయి. నేను కోరుకున్న లక్ష్యాలు రెండూ నెరవేరాయి. వీరి కళ విలువ వీరికి తెలిసింది, వీరి కళ గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో అనుసంధానం చేయగలిగాను. తోడా ఎంబ్రాయిడరీ వస్తువులు చెన్నై, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్‌లో కూడా లభిస్తున్నాయిప్పుడు. కళ కొనసాగాలి ఈ కళ ఎదుర్కొంటున్న మరో చాలెంజ్ ఏమిటంటే... కొత్తతరం ఈ ఎంబ్రాయిడరీ నేర్చుకోవడం లేదు. చదువుకుని ఉద్యోగాలకు వెళ్లడం మంచి పరిణామమే. కానీ ఈ కళను కూడా నేర్చుకోవచ్చు కదా అనిపిస్తుంది. తోడా ఆదివాసీల జనాభా పదమూడు వందలుంటే అందులో ఏడు వందల వరకు మహిళలున్నారు. డెబ్బై ఏళ్ల వాళ్లతో కలుపుకుంటే ఈ ఎంబ్రాయిడరీ వచ్చిన వాళ్లు మూడు వందల లోపే ఉన్నారిప్పుడు. ఇతరులకు నేర్పించే ఆలోచనలో ఉన్నాను’’ అని తెలియ చేశారు షీలా పావెల్. -
Fashion: ట్రైబల్ హార్ట్.. ‘పోర్గై’ కళ.. ఎంబ్రాయిడరీతో మంచి ఆదాయం!
అడవి బిడ్డల మనసు ఎంత స్వచ్ఛమైనదో వారి కళారూపాలు మన కళ్లకు కడతాయి. వాటిలో గిరి తరుణుల చేత రూపుదిద్దుకున్న ఎంబ్రాయిడరీ వర్క్ ఇప్పుడు ఫ్యాషన్‌లో భాగమైంది.ఇంటి అలంకరణలో అద్దమై వెలుగుతోంది. ఆధునిక దుస్తుల మీద అందంగా అమరిపోతోంది. అంతరించిపోతున్న సంప్రదాయ లంబాడీ ఎంబ్రాయిడరీని పునరుద్ధరించి సమకాలీన శైలులకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు ‘పోర్గై’ కళాకారులు. మోడర్న్ డ్రెస్సులు, సంప్రదాయ చీరలు.. ఏవైనా ట్రైబల్ ఆర్ట్ ఫామ్ ఒక్కటైనా ఉండాలనుకుంటున్నారు నాగరీకులు. దీంట్లో భాగంగా ఇటీవల తెలంగాణ క్రాఫ్ట్ కౌన్సిల్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో ‘పోర్గై’ కళ ఆకట్టుకుంది. తమిళనాడులోని ధర్మపురి జిల్లా సిత్లింగి వ్యాలీలో ఈ గిరిజనుల సంప్రదాయ ఎంబ్రాయిడరీ వినూత్నంగా మెరుస్తోంది. ∙∙ అంతరించిపోతున్న లంబాడీ ఎంబ్రాయిడరీని మహిళల బృందం పునరుద్ధరించింది. ‘మా కళ మాకు ఎంతో గర్వం’ అని చాటేలా దాదాపు 60 మంది లంబాడీ మహిళలు ఒక సంస్థగా ఏర్పడి దుస్తులు, గృహాలంకరణలో ప్రత్యేకతను చూపుతున్నారు. డిజైన్, నైపుణ్యం, కొత్తకళాకారులకు శిక్షణ, మార్కెటింగ్–ఆన్లైన్ సపోర్ట్, ఎగ్జిబిషన్లలో పాల్గొనడం వంటివి విస్తృతంగా జరుగుతున్నాయి. ∙∙ దాదాపు రెండు దశాబ్దాల క్రితం అక్కడి గ్రామంలోకి వచ్చిన వైద్యులు డాక్టర్ లలిత రేగి దంపతులు ఈ కళ ద్వారా గిరి పుత్రికలకు ఉపాధి లభించాలని కోరుకున్నారు. ఆరోగ్యసంరక్షణతో పాటు కళను బతికించే ప్రయత్నం చేశారు. దీంట్లో భాగంగా ‘పోర్గై’ అనే స్వచ్ఛంధ సంస్థను నెలకొల్పి కళాకారులకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేశారు. గతంలో వ్యవసాయ కూలీలుగా ఉండే మహిళలు ఈ ఎంబ్రాయిడరీ కళ ద్వారా ఒక్కటై మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. విదేశాలకు కూడా ఈ కళాకారుల చేతిలో రూపుదిద్దుకున్న ఎంబ్రాయిడరీ దుస్తులు, గృహాలంకరణ వస్తువులు ఎగుమతి చేస్తున్నారు. ∙∙ బెంగళూరు, ఢిల్లీ, ముంబై నుండి ఫ్యాషన్ డిజైనింగ్ పాఠశాలల కొంతమంది విద్యార్థులు ‘పోర్గై’ కళను తెలుసుకోవడానికి, డిజైన్లను మెరుగు పరచడానికి గిరిజన మహిళలతో కలిసి పనిచేస్తున్నారు. చదవండి: మోదీకి యాదమ్మ మెనూ -
ఎవర్గ్రీన్ బ్యూటీ.. బంజారా ఫ్యాషన్!
బంజారా రంగుల కళ మన ప్రాచీన సంస్కృతి గిరులలో వికసించి పురజనులలో మెరిసి మురిసింది ఎల్లలు దాటి విరాజిల్లుతూనే ఉంది ఎల్లవేళలా కనులవిందు చేస్తూనే ఉంది ఎవర్గ్రీన్ బ్యూటీ అని చాటుతూనే ఉంది రాజస్థానీ ఎంబ్రాయిడరీ కళ గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. రాజస్థానీయుల్లో చాలా మంది దేశంలోని వివిధ ప్రాంతాలకు వలసలు వచ్చి స్థిరపడ్డారు. అలా ఎంతో ప్రాచీనమైన వీరి వేషధారణ దేశమంతా తెలుసు. ఇప్పటికీ బంజారాలలో పూర్తి వేషధారణను 50 ఏళ్ల వారు ధరించడం చూస్తుంటాం. ఈ ఎంబ్రాయిడరీ కళ ఫ్యాషన్ పరిశ్రమలోకి ఎలా వచ్చింది? ఇంకా ఎంతలా కట్టిపడేస్తోంది? బంజారా దారపు పోగుల గొప్పతనం, అద్దాల మెరుపులు ఫ్యాషన్ వేదికల పై ఎంతగా హొయలు పోతున్నాయి.. వంటి విషయాలు ఫ్యాషన్ డిజైనర్ మంగారెడ్డి మాటల్లో.. బంజారా ఎంబ్రాయిడరీ వర్క్ కళ గురించి? రాజస్థానీ సంస్కృతిలోనే రంగుల వెలుగులు ఉన్నాయి. వీరు పింక్, ఎల్లో, రెడ్.. వంటి సహజసిద్ధమైన, కాంతిమంతమైన రంగులతో ‘లెహిరియా’ అనే టై అండ్ డై పద్ధతిని వాడుతుంటారు. రాజస్థాన్ ఎడారి ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడి వేడి వాతావరణానికి తగ్గట్టుగా బ్యాక్‌లెస్ బ్లౌజ్‌లు వాడుతుంటారు. సంస్కృతి అనేది సౌకర్యాన్ని బట్టి మారుతుంటుంది. మోడర్న్ ఫ్యాషన్ రంగాన్ని బంజారా వర్క్ ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? ఫ్యాషన్ అంటేనే మన సంస్కృతి నుంచే ఏదో ఒకదానిని తీసుకుంటూ, కలుపుకుంటూ వెళ్లడం. బంజారా డ్రెస్సింగ్, ఆ వర్క్ సంస్కృతికి కళ తీసుకువచ్చేది. ఆ కళను ఆధునిక దుస్తులకు ఎంతో కొంత జతచేసినా మంచి లుక్ వస్తుంది. అందుకే, మోడర్న్ కట్‌కి ఇండియన్ వర్క్‌ని జత చేస్తూ వచ్చారు డిజైనర్లు. నెక్కి లేదా బార్డర్ లేదా ఫుల్ బ్లౌజ్ ఎంబ్రాయిడరీ వాడి మిగతా ప్లెయిన్గానో చేస్తూ వైవిధ్యం తీసుకువచ్చారు. బంజారా అమ్మాయిలే ఒకప్పటిలా డ్రెస్ ధరించడానికి ఇష్టపడరు. ఈ కాలానికి తగ్గట్టుగా ఉండాలనుకుంటారు. అలాగని, వారి మూలాలను కాదనుకోలేరు. అలా కుర్తీ, టాప్, గౌన్.. ఇలా ప్రతి దాని మీద బంజారా వర్క్ తీసుకోవడం మొదలైంది. బంజారా వర్క్‌కి ఉన్న ప్రపంచ మార్కెట్? బంజారా వర్క్ వరల్డ్‌వైడ్ ఫేమస్ కావడంతో దీని మార్కెట్ మాటల్లో చెప్పలేనంత బాగుంది. ఈ ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్‌ని విదేశీయులు బాగా ఇష్టపడతారు. చూసిన వెంటనే గుర్తిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో ఆ విధంగా బాగా పాప్యులర్ అయ్యింది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కూడా ఈ వర్క్ బాగా రాణించిందని చెప్పచ్చు. రాజస్థానీ వాసి అయిన రూనాదేవి అనే స్వచ్ఛందృ సేవకురాలు లక్ష మందికి ఈ వర్క్ ద్వారా ఉపాధి చూపించింది. దీని ద్వారా విపరీతమైన మార్పు వచ్చింది. బంజారావర్క్లోని ఏదో ఒక అంశాన్ని అన్ని డ్రెస్సుల మీదకు ట్రాన్స్ఫర్ చేయడంతో టాలీవుడ్, బాలీవుడ్ అంటూ తేడా లేకుండా సినిమా తారలనూ ఆకట్టుకుంది. దీంతో కూడా అంతర్జాతీయ మార్కెట్ బాగా పెరిగింది. ఇప్పుడు ఈ వర్క్‌కి ఉన్న ట్రెండ్..? దాదాపు మూడు దశాబ్దాల క్రితం వచ్చిన గీతాంజలి సినిమాతో బంజారా వర్క్ మిగతా డ్రెస్సుల మీదకు ఎలా తీసుకోవచ్చో పరిచయం చేసినట్టు అయ్యింది. అప్పటినుంచి ప్రతి 2–3 ఏళ్లకోసారి ఈ వర్క్ ట్రెండ్‌లోకి వస్తూనే ఉంది. ఇప్పుడు ఇండియాలో టాప్ డిజైనర్ సునీత్ వర్మ బంజారా స్టైల్ మిర్రర్ వర్క్‌తో డ్రెస్ డిజైన్స్ చేస్తున్నారు. దీని వల్ల ఇప్పుడు మళ్లీ బంజారా వర్క్ ట్రెండ్‌లోకి వచ్చిందనే చెప్పవచ్చు. తరాలు మారినా బంజారా వర్క్ అనేది ఎప్పుడూ జీవనంలోనే ఉంటుంది. రాజస్థానీ ఫర్నిషింగ్లోనూ ఈ వర్క్ వాడుతుంటారు. ఫ్యాషన్‌లోనే కాకుండా వాల్ హ్యాంగింగ్స్, బెడ్‌షీట్స్, పిల్లో కవర్స్.. వంటి వాటిలోనూ వాడుతారు. బంజారా ఎంబ్రాయిడరీ వర్క్‌ది ఆల్‌టైమ్ బ్యూటీ. ఎప్పటికీ కళగా కొత్తపుంతలు తొక్కుతూనే ఉంటుంది. మంగారెడ్డి ఫ్యాషన్ డిజైనర్ -
ఉగాది నేత
ఇది పూత కాలంకాదు కాదు నేత కాలంసిసలైన చే నేత కాలంఅచ్చ తెలుగు ఉగాది నాడుఅటు సంప్రదాయాన్ని ఇటు ఆధునికతను మేళవించిలంగా జాకెట్టు... దానిపై రంగు రంగుల దుపట్టా ధరించినేతల్లా ఏలండి ఫ్యాషన్ ప్రపంచాన్ని. ‘‘పండగకు కంచిపట్టు, బెనారస్ లెహంగాల ఎంపిక సహజమే. కొంత వెరైటీ కావాలనుకునేవారు ఈ మిక్సింగ్ ప్యాటర్న్‌ని ట్రై చేయవచ్చు. కలర్ కాంబినేషన్స్, హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్‌తో సరైన విధంగా మిక్స్ చేసి బ్యాలెన్స్ చేయడంలోనే మన ప్రత్యేకత కనిపిస్తుంది. ఏ కలర్‌కి ఏది బాగుంటుంది అని చెక్ చేసి, ఈ డిజైన్స్ తయారు చేశాం. మీరూ ఈ కాంబినేషన్‌ని ట్రై చేయవచ్చు. ఎంబ్రాయిడరీ చేసిన ఆర్గంజా ఫ్యాబ్రిక్‌ను, క్రష్ చేసి, అంచులు జత చేసి లెహంగాలు డిజైన్ చేశాం. ఆర్గంజా, పుట్టపాక చేనేత చీరల ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్. కళ్లకు, మేనికి హాయిగొలుపుతాయి. ఈ లెహంగాల మీదకు ఏ హ్యాండ్లూమ్ దుపట్టాలయినా సూపర్బ్ అనిపిస్తాయి. కలంకారీ, బెనారస్, టస్సర్, నేచరల్ డై చేసిన హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ దుపట్టాలు ఈ లెహంగాల మీదకు వాడాం. పండగ సందర్భాల్లోనూ ఇలా ప్రత్యేకంగా తయారు అవచ్చు అని చూపడానికి వీటిని డిజైన్ చేశాం. మీరు ట్రై చేసి చూడండి మరి. -
పొడవైన స్టైల్
పట్టు చీర మీదకు గ్రాండ్‌గా మగ్గం వర్క్ చేసిన ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ధరించడం మామూలే! కొంచెం స్టైల్ మార్చాలి అనుకుంటే పూర్తి కాంట్రాస్ట్ కలర్ ఒక ఆప్షన్. అయితే ఇప్పుడు లాంగ్ స్లీవ్స్ అదేనండి పొడవాటి చేతులున్న బ్లౌజ్‌ని ధరించడం అసలు సిసలు ఎంపిక అయ్యింది. బెనారస్, ఉప్పాడ, కంచిపట్టు, డిజైనర్ శారీ ఏదైనా ఎంచుకోండి. దాని మీదకు పొడవాటి చేతులున్న బ్లౌజ్‌ని ధరించండి. కాంట్రాస్ట్ కలర్ అయితే మరీ బెస్ట్. దీనికి ఎంబ్రాయిడరీ హంగులు అవసరం లేదు. ఆభరణాల అలంకరణా ముఖ్యం కాదు. నలుగురిలో ప్రత్యేకంగా, నవ్యంగా కనిపించాలంటే ఎంపిక చేసుకున్న బెస్ట్ స్టైల్ లాంగ్ స్లీవ్స్. ఇది ఒకప్పుడు ఉన్న స్టైలే. దీనికే కొద్దిగా ఎంబ్రాయిడరీ, ఇంకొద్దిగా ఆభరణాలు.. అంటూ కొన్ని మెరుగులు దిద్దవచ్చు. మరీ ఎక్కువ హంగూ, ఆర్బాటాలకు పోకుండా సింపుల్‌గా లేకుండా పట్టు చీర మీదకు ఇలా పొడవైన స్టైల్‌ని క్రియేట్ చేయండి. బెస్ట్ మార్క్స్ కొట్టేయండి. – కీర్తికా గుప్తా, డిజైనర్ -
పట్టుచీరకు పూలరెక్కలు
ఎంత ఖరీదు పట్టు చీరైనా... బ్లౌజ్ డిజైన్‌తోనే అందం పట్టు చీరకు పట్టు ఫ్యాబ్రిక్‌తోనే డిజైన్ చేయాల్సిన అవసరం లేదు పువ్వుల ప్రింట్లు ఉన్న ఫ్యాబ్రిక్‌తో సింపుల్ డిజైన్ చేసి ఆకట్టుకోవచ్చు. ‘పట్టు చీరకు పూలరెక్కలు జత చేసావే’ అని కితాబులూ అందుకోవచ్చు పట్టు చీరకు కాంబినేషన్‌గా కాంట్రాస్ట్ బ్లౌజ్ లేదంటే సెల్ఫ్ కలర్ బ్లౌజ్, ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వేయడం సహజమే. కానీ, పూర్తిగా ఏ మాత్రం సరిపోలని పువ్వుల ప్రింట్లు ఉన్న జాకెట్లు వేస్తే.. అదే ఇప్పటి ట్రెండ్. పాత పట్టు కొత్త హంగు పట్టుచీరలు బీరువాలో చేరి ఏళ్లకేళ్లకు ఎదురుచూస్తుంటాయి. ఎందుకు వాటికి అంత ఖరీదు పెట్టి కొనుక్కోవడం అని చాలా మంది యోచిస్తుంటారు. పెళ్లికో, పండగకో కట్టుకుందామని నాటి చీరను ఎంపిక చేసి బయటకు తీసినా అప్పటి బ్లౌజ్ ఇప్పటికి సూట్ అవదు. రంగు వెలిసిపోవడం, లేదంటే కొలత సరిపోకపోవడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు ఓ పరిష్కారం ఫ్లోరల్బ్లౌజ్. స్టైల్‌కి స్టైల్, పండగైనా, పెళ్లైనా కళగా గడిచిపోతుంది. అమ్మాయిల ఫేవరేట్ పట్టు చీర కట్టమంటే ‘అబ్బో బరువు’ అంటూ అమ్మాయిలు అమ్మ మాటను దాటేస్తుంటారు. ఫ్లోరల్ కాన్సెప్ట్ జత చేస్తే కొంచెం మోడ్రన్ టచ్ ఇచ్చారంటే ‘వావ్’ అంటూ ఎగిరి పూల రెక్కలను బ్లౌజ్‌గా తొడిగేసుకుంటారు. అప్పుడిక అమ్మాయి సీతాకోకచిలుక చీర కట్టిన ంత బ్రైట్‌గా వేడుకలో వెలిగిపోతుంది. ప్లెయిన్ పట్టు.. పువ్వులతో కట్టు లైట్‌వెయిట్ పట్టు చీరలు చాలా వరకు పెద్ద అంచులు ఉండి, ప్లెయిన్‌గా ఉంటాయి. వీటి మీదకు పొడవాటి చేతుల పువ్వుల ప్రింట్లు ఉన్న బ్లౌజ్ వేసుకుంటే రెట్రోస్టైల్లో కొత్తగా కనువిందుచేస్తారు. పువ్వుల ప్రింటుకు ఎంబ్రాయిడరీ జిలుగు బ్లౌజ్పార్ట్కి ఎలాగూ పువ్వుల ప్రింట్లు ఉన్న ఫ్యాబ్రిక్ ఎంచుకుంటున్నాం. పట్టు చీర కాబట్టి కొంత వర్క్ కూడా ఉంటే బాగుంటుందనుకున్నా అలాగే సెట్ చేసుకోవచ్చు. నెక్, స్లీవ్స్ ప్యాటర్న్‌లో ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకోవచ్చు. ఆభరణాల ఊసే అక్కర్లేదు ఈ గెటప్ మీదకు పూర్తిగా ఆభరణాలు అక్కర్లేదని చెప్పలేం. కానీ, మరీ ఎక్కువ హారాలు మాత్రం అవసరం లేదు. ఎందుకంటే ఫ్లోరల్ స్టైల్ ఆభరణం ప్లేస్‌ని భర్తీ చేసేసింది కాబట్టి. కంచిపట్టుకు ఫ్లోరల్ బోట్ నెక్ లేదా రౌండ్‌నెక్ బ్లౌజ్ ధరించి, సింపుల్‌గా చెవులకు జూకాలు, ముంజేతికి సింగిల్ బ్యాంగ్ ధరిస్తే చాలు అలంకరణ అందంగా మెరిసిపోతుంది. (పూర్తి కాంట్రాస్ట్ ఎప్పుడూ ఆకట్టుకునే స్టైల్,కంచిపట్టుకు పువ్వుల నెటెడ్ ఫ్యాబ్రిక్‌తో బ్లౌజ్ ప్రధాన ఆకర్షణ,ఏ పట్టు అయినా పువ్వుల జాకెట్టు లేటెస్ట్ ఎంపిక) - నిఖిత డిజైనర్ హైదరాబాద్ -
కుట్టు చిత్రం భళారే విచిత్రం.!
పెయింటింగ్ ఎలా వేస్తారు? అదేం ప్రశ్న చేతితోనే కదా వేస్తాం అనుకుంటున్నారా? అయితే ఈ చిత్రం చూడండి. అచ్చం పెయింటింగ్ లాగే ఉంది కదూ! అయితే ఇది కలర్స్‌తో వేసిన పెయింటింగ్ కాదు. కుట్టు మిషన్‌తో వేసిన ఎంబ్రాయిడరీ..! చేతితోనే కాదు.. కుట్టు మిషన్‌తో కూడా అందమైన పెయింటింగ్స్ లాగా ఉండే చిత్రాలను వేయొచ్చని నిరూపించాడు హరియాణాలోని పాటియాలాకు చెందిన అరుణ్ కుమార్ బజాజ్.. చిత్రలేఖనం అంటే చాలా ఇష్టపడే అరుణ్ బాగా పెయింటింగ్స్ వేసి పెద్ద చిత్రకారుడు అవుదామనుకున్నాడట. కానీ చిన్నతనం లోనే తన తండ్రి చనిపోయాడు. దీంతో తన చదువు మధ్యలోనే ఆపేయాల్సివచ్చింది. కుటుంబ భారం తన పైనే పడింది. తన తండ్రి దర్జీ కావడంతో 16వ ఏటనే అరుణ్ దర్జీ వృత్తిలోకి అడుగుపెట్టాడు. కానీ చిత్రలేఖనంపై ఉన్న ఇష్టాన్ని వదలకుండా తను పనిచేసే కుట్టు మిషన్‌తోనే అందమైన చిత్రాలను వేయడం ప్రారంభించాడు. ఇలా ఎంబ్రాయిడరీ ద్వారా పెయింటింగ్స్ వేసిన మొదటి వ్యక్తిగా అరుణ్ నిలిచాడు. -
ఆజ్ కా లిబాజ్
‘లిబాస్’ అంటే దుస్తులు.అందాన్ని రూపాన్ని ఇచ్చే ఇవాళ్టి దుస్తులు ఇవి.రంగులతో అల్లికలతో మెరుపును తెచ్చే ఇవాళ్టి దుస్తులు ఇవి.ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేకంగా కనిపించడానికి కూర్చిన నేటి దుస్తులు ఇవి. కట్‌లోనూ, కుట్టులోనూ ట్రెండ్‌లో ఉన్న దుస్తులు ఇవి.నేటి దుస్తులు. స్త్రీలు మెచ్చే దుస్తులు. ఆజ్ కా లిబాస్. షల్వార్ కమీజ్, అనార్కలీ సూట్స్, పటియాలా కుర్తీస్ ఇన్నాళ్లూ డ్రెస్‌లలో మహరాణుల్లా వెలిగిపోయాయి. ఇప్పుడు వీటి హవా తగ్గి షరారస్, లెహంగాస్, షార్ట్ లెంగ్త్‌లో ఉండే విభిన్నమైన ఫ్రాక్స్, కుర్తీస్ ట్రెండ్‌లోకి వచ్చాయి. వీటికి బెల్‌బాటమ్ ట్రౌజర్స్, కప్రీస్, టులిప్ షల్వార్స్ జత కట్టాయి. అమ్మాయిలు ముఖ్యంగా టీనేజర్స్ వెస్ట్రన్ స్టైల్లో ఉండే షార్ట్ కుర్తీస్, ఫ్రాక్స్.. జీన్స్, ప్యాంట్స్, స్కిన్సీ టైట్స్ మీదకు విరివిగా వాడుతున్నారు. ఇవన్నీ హాటెస్ట్ ట్రెండ్. వెస్ట్రన్ పార్టీలతో పాటు సంప్రదాయ వేడుకల్లో ప్రత్యేకత కలిగించనున్నాయి. వీటిలో మీ ఎంపిక ఏదైనా బెస్ట్ డ్రెస్డ్గా నిలిచిపోతుంది. అయితే, శరీరాకృతిని బట్టి డ్రెస్ ఎంపిక ఎప్పుడూ చక్కగా నప్పుతుంది. షరారా కమీజ్: ఇది 2000 సంవత్సరంలో మంచి కాంబినేషన్‌గా హిట్ అయిన డ్రెస్. ఈ స్టైల్ ఇప్పుడు మళ్లీ వచ్చింది. చాలా మంది బాలీవుడ్ నటీమణులు ఈ స్టైల్లో కనువిందు చేస్తున్నారు. షరారా బాటమ్ ఎక్కువ కుచ్చులతో ఆకట్టుకుంటుంది. దీని మీదకు స్కర్ట్ లేదా కమీజ్ చక్కగా నప్పుతుంది. ఘరారా మనవాళ్ల కామన్‌గా పిలిచే పేరు. దీనినే షరారా అంటున్నారు. మోకాళ్ల దగ్గర నుంచి బాటమ్ కుచ్చులతో వెడల్పుగా ఉంటుంది. వీటినే వైడ్ లెగ్గ్డ్ ప్యాంట్స్ అని కూడా అంటారు. మందపాటి బ్యాండ్ లేడా లేస్ లేదా గోటా పట్టీతో పై భాగాన్ని, కింది భాగాన్ని విడిగా చూపడానికి వాడతారు. దీంతో ఈ బాటమ్ రెండు భాగాలుగా ఉంటుంది. మీ శరీరాకృతిని బట్టి దీనిని ధరించాలి. ఎందుకంటే ఎత్తు తక్కువ ఉండి, బక్కపలచగా ఉండే శరీరాకృతి గల వారికి ఈ స్టైల్ బాగుంటంది. దీనిని మీదకు క్రాప్ టాప్ వేసుకొని దుపట్టా జత చేస్తే సంప్రదాయ డ్రెస్ అవుతుంది. ఈ షరారా మీదకు కుర్తీ లేదా కమీజ్ కూడా బాగుంటుంది. దీని మీదకు పొడవాటి కుర్తా ధరిస్తే మీ ఆకృతి కూడా పొడవుగా కనిపిస్తుంది. సిగరెట్ ప్యాంట్ విత్ కమీజ్:రెండేళ్ల క్రితం కమీజ్ విత్ ప్యాంట్స్ సూపర్ స్టైల్లో ఉండేవి. కమీజ్కే కాస్త ఆకట్టుకునే బాటమ్స్ జత చేసి స్టైల్‌ని బెటర్ చేశారు. ఫిటింగ్ కోసం సిగరెట్ప్యాంట్స్ సరైన ఫిటింగ్ కోసం ధరిస్తున్నారు. సిగరెట్ ప్యాంట్స్ మీద ఎంబ్రాయిడరీ చక్కగా కనిపిస్తుంది. టులిప్ స్టైల్ ప్యాంట్స్:గ్లామరస్ని పెంచుతూ వెలుగులోకి వచ్చాయి. ఇది షల్వార్ని రీప్లేస్ చేసిందని చెప్వచ్చు. ఈ ప్యాంట్స్ మీదకు ఎంబ్రాయిడరీ చేసిన ఫ్రాక్స్, కమీజ్‌లు మరింత అందాన్ని పెంచుతాయి. ఎంబ్రాయిడరీ వెర్సస్ లేత రంగులు: ఎలాంటి ఎంబ్రాయిడరీ లేకుండా ఉండే కమీజ్ను ఎంపిక చేసుకొని దానికి బాటమ్‌గా ఎంబ్రాయిడరీ చేసిన షరారా ధరిస్తే చాలు మీ లుక్‌లో గొప్ప మార్పు కనిపిస్తుంది. ∙కమీజ్ లేదా ఫ్రాక్ డిజైన్స్‌లో నెక్ బోట్ లేదా బార్టట్ నెక్స్ ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి. ∙ఎంబ్రాయిడరీ చేసిన గ్రాండ్ లెహంగాలు, కుర్తీలు ఇప్పుడూ ట్రెండ్‌లో ఉన్నాయి. మీ అభిరుచి మేరకు వీటిని ఎంపిక చేసుకోవచ్చు. ఇక ఆభరణాల వంటి ఇతర అలంకరణలు డ్రెస్‌కు తగ్గట్టు ఎంచుకుంటే చాలు ఈ ఔట్ఫిట్స్ మీ పూర్తి ఆహార్యాన్ని మార్చివేస్తాయి. ఆభరణాలు: ∙ఈ తరహా డ్రెస్సుల మీదకు టస్సెల్ ఇయర్ రింగ్స్ బాగా నప్పుతాయి. ∙బ్యాంగిల్ సెట్స్‌లో ఏదైనా ఒకటి పెద్దది డిజైనర్ బ్యాంగిల్ ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ∙లేత రంగులు ముఖ్యంగా స్కిన్ కలర్స్, పీచ్ లేదా ఆకుపచ్చ కాంబినేషన్స్ పండగ కళను రెట్టింపు చేస్తాయి. ∙గోల్ టిక్కా మెహెందీ డిజైన్లు పండగ సంబరాన్ని మరింత కళగా మార్చుతాయి. – ఎన్.ఆర్ – అయేషా అజహర్, ఫ్యాషన్ డిజైనర్ లఖోటియా ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్ -
పొడుగ్గా.. పొందికగా
లాంగ్ గౌన్ వెస్ట్రన్ పార్టీలో తప్పనిసరి కనిపించే డ్రెస్ఇండియన్ స్టైల్‌కి మార్చేస్తేదానికి ఎంబ్రాయిడరీ చేర్చితేదుపట్టా అదనపు హంగుగా చేరితేమన వేడుకకు పొడుగ్గా.. పొందికగా అమరిపోతుంది. మెరూన్ కలర్ ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన లాంగ్ గౌన్ ఇది. రెండు చేతులకు పెద్ద మోటిఫ్స్, నెక్కు, హ్యాండ్ కఫ్స్‌కి, దుపట్టాకి, అంచుకి జరీ, జర్దోసీతో హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశారు. ప్రిన్సెస్ కట్ బాడీ పార్ట్, బోట్ నెక్ డిజైన్ ఈ డ్రెస్‌కు ప్రధాన ఆకర్షణ అయ్యాయి. ఇలాంటి డ్రెస్ తక్కువ బడ్జెట్లో మీరూ రూపొందించుకోవాలంటే.. ఇలా రూపొందించుకోవచ్చు.. వేలు, లక్షలు ఖర్చు పెట్టి డిజైనర్ డ్రెస్‌ను రూపొందించుకోలేం అని నిరుత్సాహపడనక్కర్లేదు. మన బడ్జెట్‌ను బట్టి తక్కువ ఖర్చుతోనే డిజైన్ చేయించుకోవచ్చు. ∙మీ దగ్గర తగినంత బడ్జెట్ ఉంటే ఖరీదైన ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్‌ని ఈ లాంగ్గౌనికి వాడుకోవచ్చు. ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ ధర రూ.500/– నుంచి రూ.1000/– పైన ఉంటుంది. తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే సెమీ రా సిల్క్, సెమీ కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి మీటర్ ఫ్యాబ్రిక్‌కి రూ.150/–ల నుంచి రూ.500/–వరకు లభిస్తాయి. ∙ఇది ప్యానెల్స్ లాంగ్గౌన్ కాబట్టి ఎంత ఎక్కువ ఫ్లెయిర్ ఉంటే డ్రెస్ అందం అంతగా పెరుగుతుంది. ఈ గౌన్‌కి 10 మీటర్ల ఫ్లెయిర్ వచ్చేలా డిజైన్ చేశాం. తక్కువ బడ్జెట్లో అయిపోవాలంటే కనీసం 5 మీటర్ల ఫ్యాబ్రిక్ అయినా తీసుకోవాలి. ఎంబ్రాయిడరీకి బదులుగా రెడీమేడ్ అంచులు ∙నెక్కి, చేతులకు, అంచులకు ఎంబ్రాయిడరీ చేస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది. అందుకని బ్రొకేడ్ ఫ్యాబ్రిక్, రెడీమేడ్‌గా లభించే ఎంబ్రాయిడరీ చేసిన అంచులను ఈ గౌన్‌కి జత చేశాం. మార్కెట్లో ఎంబ్రాయిడరీ అంచులు తక్కువ ధరకే లభిస్తాయి. ఎంబ్రాయిడరీకి బదులు వీటిని వాడినా మీకు ఆ లుక్ వస్తుంది. బ్రొకేడ్ క్లాత్ ఫ్యాబ్రిక్లోనూ హెవీ బ్రొకేడ్స్, సెమీ బ్రొకేడ్స్ ఉంటాయి. తక్కువ ఖర్చులో డ్రెస్ కావాలనుకుంటే సెమీ బ్రొకేడ్ తీసుకోండి. ఇది మీటర్ ఫ్యాబ్రిక్ రూ.500/–ల లోపు లభిస్తుంది. అదే ప్యూర్ బ్రొకేడ్ మీటర్ ధర దాదాపు రూ.3000/–నుంచి లభిస్తుంది.దుపట్టా దుపట్టాకి ప్యూర్ క్రేప్ఫ్యాబ్రిక్కు బదులు జరీ చెక్స్ ఉన్న జార్జెట్ ఫ్యాబ్రిక్‌ను ఎంచుకున్నాను. ఇది మీటర్‌కి రూ.200/– నుంచి లభిస్తుంది. అంచులు ∙10 మీటర్ల ఈ లాంగ్ గౌన్ ప్యానెల్ ఫ్లెయిర్కి అంచుకు 3 మీటర్ల ఫ్యాబ్రిక్ పట్టింది. బార్డర్ కోసం ఫ్యాబ్రిక్ వెడల్పు 10 ఇంచుల కొలత తీసుకొని, అంత మేరకు అంచుగా వేశాం. మీరు ఎత్తు తక్కువ ఉంటే బార్డర్ వెడల్పు 4– 5 ఇంచులు వెడల్పు తీసుకోవచ్చు. ∙ఎంబ్రాయిడరీ బార్డర్స్ మీటర్ చొప్పున రెడీమేడ్‌గా లభిస్తాయి. ఇవి రూ.100 నుంచి రూ.1000/– దొరికేవీ ఉన్నాయి. మీ బడ్జెట్ బట్టి వీటిని ఎంపిక చేసుకోవడమే. సుమారుగా డ్రెస్ ఖర్చు ∙సెమీ కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్‌కి మీటర్‌కి సుమారు రూ.150/– నుంచి రూ.500/– (5 మీటర్లు) ∙అంచులకి వాడే సెమీ బ్రొకేడ్ ఫ్యాబ్రిక్ మీటర్‌కి దాదాపు రూ.300/– నుంచి రూ.500/– (3 మీటర్లు) ∙ఎంబ్రాయిడరీ బార్డర్స్ మీటర్‌కి రూ.100/– నుంచి రూ.1000/– (3 మీటర్లు) ∙దుపట్టా ఫ్యాబ్రిక్ 2 1/2 మీటర్లకు దాదాపు రూ.300 నుంచి రూ.500 /– ఈ మొత్తం డ్రెస్ డిజైన్‌కి దాదాపు రూ.2500/– నుంచి ఖర్చు అవుతుంది. తక్కువ బడ్జెట్లో ఇలాంటి డ్రెస్ కావాలనుకుంటే ఫ్యాబ్రిక్ ఎంపికయే ప్రదానం. - మంగారెడ్డి ఫ్యాషన్ డిజైనర్ -
పెళ్లి బొమ్మలు
బొమ్మల పెళ్లిలో పిల్లల కేరింతలే బాజాభజంత్రీలు.పిల్లలు పెరిగి పెద్దయ్యాక జరిగే పెళ్లిళ్లలో ఆ బొమ్మలే ఆకర్షణగా నిలిస్తే..?ఇప్పుడు ట్రెండ్ అదే!రాధాకృష్ణులు, లక్ష్మీదేవి, గొల్లభామలు, కిన్నెరలు...ఎంబ్రాయిడరీ ద్వారా పెళ్లి వస్త్రాలపై కొలువు తీరుతున్నారు. ఇదిగో ఇలా అక్షింతలు అందుకుంటున్నారు. ముచ్చటైన చిత్ర కళ చీర కొంగు మీద ఒదిగిపోతే అచ్చమైన జరీ జిలుగులకు జాకెట్టు కాన్వాస్‌గా మారితే సంప్రదాయ వేడుక విన్నూత కళను నింపుకుంటుంది. చిత్రకళ సొగసు, ఎంబ్రాయిడరీ జిలుగులు జత చేరి మెరిసిపోతుంటే పట్టు రెపరెపల మధ్య వాటిని పట్టేసుకుంటే ప్రతీ కట్టూ ప్రత్యేకతను నింపుకోకుండా ఉండగలదా...! పల్లకిలో పెళ్లికూతురు సన్నాయి రాగాలాపన.. బాజా భజింత్రీల చప్పుళ్ల మధ్య.. అలంకరించిన పల్లకిలో కోటి కలల కొత్త జీవితాన్ని మోసుకుంటూ పెళ్లికూతురు మండపానికి వస్తుంటే చూడ్డానికి రెండు కళ్లు చాలవు. ఆ కళని చీర కొంగుమీదనో లేదంటో బ్లౌజ్ మీదనో చూపితే చూపుల దారాలు అల్లిబిల్లిగా అల్లుకుపోవాల్సిందే! రాధాకృష్ణుల ప్రేమ కావ్యం యుగాలు దాటినా ఆ అందం వన్నె తగ్గదు. అందుకే ఆ ప్రేమను డిజైనర్లు ఇలా ఆకట్టుకునేలా ఆవిష్కరిస్తున్నారు. ఫ్యాబ్రిక్ పెయింట్‌తో రాధాకృష్ణుల బొమ్మలు గీసి, లతలు, పువ్వులను జరీతో సింగారించారు. మరికొన్ని జరీ, పూసలతోనే రాధాకృష్ణుల బొమ్మలు కుట్టుతో ఆకట్టుకుంటున్నాయి. కోటగుమ్మాలు రాజస్థానీ మొఘల్ ఘనత చీర అంచుల్లోనూ, కొంగులోనూ మెరిసిపోవడంతో పాటు జాకెట్టు పైనా ఘన తను చాటుతుంది. కోట గొమ్మాలను జరీ దారాలు, కుందన్ మెరుపులతో సింగారిస్తున్నారు. అప్సరసలు పెళ్లి, పేరంటాలకు ఇంకాస్త నిండుతనాన్ని, పూజా కార్యక్రమాలకు మరింత గాఢతను హారాలతో పాటు ఎంబ్రాయిడరీ కూడా అప్పరసల నాట్యకళతో లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది. చీరలు, బ్లౌజ్‌ల మీద ఎంబ్రాయిడరీ కళ ప్రతీసారి కొత్త హంగులతో ఆశ్చర్యపరుస్తూనే ఉంది. మొన్నటి వరకు పూసలు దారాలతో పువ్వులు, లతలు అల్లేస్తే ఇప్పుడు ఏకంగా మనుషుల బొమ్మలనే తీరుగా డిజైన్ చేస్తున్నారు. చిత్రలిపి, ఎంబ్రాయిడరీతో కనువిందు చేస్తున్నారు. -
'అద్దం'గా ఉంది
అమ్మాయి అద్దంలో చూసుకొని ‘అందంగా ఉన్నానా’ అనుకుంటుంది. మరి అమ్మాయే అద్దం వేసుకుంటే ప్రపంచమే అద్దంగా కనపడుతుంది. చూడండి అద్దాల అందాలు వేసుకుంటే ‘అద్దం’గా ఉంటుంది. రంగురంగుల దారాలు, మధ్యలో కొన్ని అద్దాలను ఉపయోగించి చేసే గుజరాతీ ప్రాచీన కళ గమ్తి ఎంబ్రాయిడరీ. సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఈ కళ గాగ్రా ఛోలీ మీద అధికంగా కనపడుతుంటుంది. ఈ మధ్య ఈ కళ శారీ అంచులు, బ్లౌజులు, కుర్తీలు, పాశ్చాత్య దుస్తుల మీద కూడా అందంగా మెరిసిపోతోంది. పండగ వేళకు ఈ ప్రాచీన కళ రెట్టింపు సందడిని తీసుకువస్తుంది. గమ్తి వర్క్‌తో రూపుదిద్దుకున్న గాగ్రా ఛోలీ. నవరాత్రి వేడుకలకు ఇంపైన కళ. రాజస్థానీ మిర్రర్ వర్క్‌తో తీర్చిదిద్దిన ఓవర్‌కోట్ తోనూ పండగ కళను తీసుకురావచ్చు. మిర్రర్ వర్క్ బ్యూటీ బాలీవుడ్ నటి అలియాభట్. మిషన్ వర్క్ చేసిన కుర్తా, పైజామాలకు అద్దాలను కుడితే ఇలా పండగ కళ వచ్చేసినట్టే! చిన్నా, పెద్ద అద్దాలతో చీరను, బ్లౌజ్‌ను సింగారిస్తే ఎంత అందంగా ఉందో కళ్లకు కడుతోంది బాలీవుడ్ నటి దీపికా పదుకొనే! పండగ రోజులను కాంతిమంతంగా మార్చాలంటే ‘అద్దం’ సరైన ఎంపిక. పెద్ద పెద్ద అద్దాలను చీర అంచు భాగంలో కుట్టి, లేటెస్ట్బ్లౌజ్ కట్‌తో స్టైల్‌గా మెరిసిపోవచ్చు. లాక్మే ఫ్యాషన్ వీక్‌లో వేదిక మీద సింపుల్‌గా అద్దం మెరుపులు.