పొడుగ్గా.. పొందికగా | special story to new fashoins | Sakshi
Sakshi News home page

పొడుగ్గా.. పొందికగా

Published Fri, Apr 20 2018 1:02 AM | Last Updated on Mon, Oct 1 2018 1:12 PM

special story to new fashoins - Sakshi

లాంగ్‌ గౌన్‌ వెస్ట్రన్‌ పార్టీలో తప్పనిసరి కనిపించే డ్రెస్‌ఇండియన్‌ స్టైల్‌కి మార్చేస్తేదానికి ఎంబ్రాయిడరీ చేర్చితేదుపట్టా అదనపు హంగుగా చేరితేమన వేడుకకు పొడుగ్గా.. పొందికగా అమరిపోతుంది.

మెరూన్‌ కలర్‌ ప్యూర్‌ పట్టు ఫ్యాబ్రిక్‌తో డిజైన్‌ చేసిన లాంగ్‌ గౌన్‌ ఇది. రెండు చేతులకు పెద్ద మోటిఫ్స్, నెక్‌కు, హ్యాండ్‌ కఫ్స్‌కి, దుపట్టాకి, అంచుకి జరీ, జర్దోసీతో హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ చేశారు. ప్రిన్సెస్‌ కట్‌ బాడీ పార్ట్, బోట్‌ నెక్‌ డిజైన్‌ ఈ డ్రెస్‌కు ప్రధాన ఆకర్షణ అయ్యాయి. ఇలాంటి డ్రెస్‌ తక్కువ బడ్జెట్‌లో మీరూ రూపొందించుకోవాలంటే..


ఇలా రూపొందించుకోవచ్చు..
వేలు, లక్షలు ఖర్చు పెట్టి డిజైనర్‌ డ్రెస్‌ను రూపొందించుకోలేం అని నిరుత్సాహపడనక్కర్లేదు. మన బడ్జెట్‌ను బట్టి తక్కువ ఖర్చుతోనే డిజైన్‌ చేయించుకోవచ్చు. 
∙మీ దగ్గర తగినంత బడ్జెట్‌ ఉంటే ఖరీదైన ప్యూర్‌ రా సిల్క్‌ ఫ్యాబ్రిక్‌ని ఈ లాంగ్‌గౌనికి వాడుకోవచ్చు. ప్యూర్‌ రా సిల్క్‌ ఫ్యాబ్రిక్‌ ధర రూ.500/– నుంచి రూ.1000/– పైన ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో కావాలనుకుంటే సెమీ రా సిల్క్, సెమీ కాటన్‌ సిల్క్‌ ఫ్యాబ్రిక్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇవి మీటర్‌ ఫ్యాబ్రిక్‌కి రూ.150/–ల నుంచి రూ.500/–వరకు లభిస్తాయి. 
∙ఇది ప్యానెల్స్‌ లాంగ్‌గౌన్‌ కాబట్టి ఎంత ఎక్కువ ఫ్లెయిర్‌ ఉంటే డ్రెస్‌ అందం అంతగా పెరుగుతుంది. ఈ గౌన్‌కి 10 మీటర్ల ఫ్లెయిర్‌ వచ్చేలా డిజైన్‌ చేశాం. తక్కువ బడ్జెట్‌లో అయిపోవాలంటే కనీసం 5 మీటర్ల ఫ్యాబ్రిక్‌ అయినా తీసుకోవాలి.
  
ఎంబ్రాయిడరీకి బదులుగా రెడీమేడ్‌ అంచులు
∙నెక్‌కి, చేతులకు, అంచులకు ఎంబ్రాయిడరీ చేస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది. అందుకని బ్రొకేడ్‌ ఫ్యాబ్రిక్, రెడీమేడ్‌గా లభించే ఎంబ్రాయిడరీ చేసిన అంచులను ఈ గౌన్‌కి జత చేశాం. మార్కెట్‌లో ఎంబ్రాయిడరీ అంచులు తక్కువ ధరకే లభిస్తాయి. ఎంబ్రాయిడరీకి బదులు వీటిని వాడినా మీకు ఆ లుక్‌ వస్తుంది. బ్రొకేడ్‌ క్లాత్‌ ఫ్యాబ్రిక్‌లోనూ హెవీ బ్రొకేడ్స్, సెమీ బ్రొకేడ్స్‌ ఉంటాయి. తక్కువ ఖర్చులో డ్రెస్‌ కావాలనుకుంటే సెమీ బ్రొకేడ్‌ తీసుకోండి. ఇది మీటర్‌ ఫ్యాబ్రిక్‌ రూ.500/–ల లోపు లభిస్తుంది. అదే ప్యూర్‌ బ్రొకేడ్‌ మీటర్‌ ధర దాదాపు రూ.3000/–నుంచి లభిస్తుంది.దుపట్టా దుపట్టాకి ప్యూర్‌ క్రేప్‌ఫ్యాబ్రిక్‌కు బదులు జరీ చెక్స్‌ ఉన్న జార్జెట్‌ ఫ్యాబ్రిక్‌ను ఎంచుకున్నాను. ఇది మీటర్‌కి రూ.200/– నుంచి లభిస్తుంది.

అంచులు
∙10 మీటర్ల ఈ లాంగ్‌ గౌన్‌ ప్యానెల్‌ ఫ్లెయిర్‌కి అంచుకు 3 మీటర్ల ఫ్యాబ్రిక్‌ పట్టింది. బార్డర్‌ కోసం ఫ్యాబ్రిక్‌ వెడల్పు 10 ఇంచుల కొలత తీసుకొని, అంత మేరకు అంచుగా వేశాం. మీరు ఎత్తు తక్కువ ఉంటే బార్డర్‌ వెడల్పు 4– 5 ఇంచులు వెడల్పు తీసుకోవచ్చు.   
∙ఎంబ్రాయిడరీ బార్డర్స్‌ మీటర్‌ చొప్పున రెడీమేడ్‌గా లభిస్తాయి. ఇవి రూ.100 నుంచి రూ.1000/– దొరికేవీ ఉన్నాయి. మీ బడ్జెట్‌ బట్టి వీటిని ఎంపిక చేసుకోవడమే. 

సుమారుగా డ్రెస్‌ ఖర్చు
∙సెమీ కాటన్‌ సిల్క్‌ ఫ్యాబ్రిక్‌కి మీటర్‌కి సుమారు 
రూ.150/– నుంచి రూ.500/– (5 మీటర్లు)
∙అంచులకి వాడే  సెమీ బ్రొకేడ్‌ ఫ్యాబ్రిక్‌ మీటర్‌కి
దాదాపు రూ.300/– నుంచి రూ.500/– (3 మీటర్లు)
∙ఎంబ్రాయిడరీ బార్డర్స్‌ మీటర్‌కి రూ.100/– నుంచి 
రూ.1000/– (3 మీటర్లు) 
∙దుపట్టా ఫ్యాబ్రిక్‌ 2  1/2 మీటర్లకు దాదాపు 
రూ.300 నుంచి రూ.500 /– 
ఈ మొత్తం డ్రెస్‌ డిజైన్‌కి దాదాపు రూ.2500/– నుంచి ఖర్చు అవుతుంది.
తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి డ్రెస్‌ కావాలనుకుంటే ఫ్యాబ్రిక్‌ ఎంపికయే ప్రదానం.
- మంగారెడ్డి ఫ్యాషన్‌ డిజైనర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement