
పెయింటింగ్ ఎలా వేస్తారు? అదేం ప్రశ్న చేతితోనే కదా వేస్తాం అనుకుంటున్నారా? అయితే ఈ చిత్రం చూడండి. అచ్చం పెయింటింగ్ లాగే ఉంది కదూ! అయితే ఇది కలర్స్‌తో వేసిన పెయింటింగ్ కాదు. కుట్టు మిషన్‌తో వేసిన ఎంబ్రాయిడరీ..! చేతితోనే కాదు.. కుట్టు మిషన్‌తో కూడా అందమైన పెయింటింగ్స్ లాగా ఉండే చిత్రాలను వేయొచ్చని నిరూపించాడు హరియాణాలోని పాటియాలాకు చెందిన అరుణ్ కుమార్ బజాజ్.. చిత్రలేఖనం అంటే చాలా ఇష్టపడే అరుణ్ బాగా పెయింటింగ్స్ వేసి పెద్ద చిత్రకారుడు అవుదామనుకున్నాడట. కానీ చిన్నతనం లోనే తన తండ్రి చనిపోయాడు. దీంతో తన చదువు మధ్యలోనే ఆపేయాల్సివచ్చింది. కుటుంబ భారం తన పైనే పడింది. తన తండ్రి దర్జీ కావడంతో 16వ ఏటనే అరుణ్ దర్జీ వృత్తిలోకి అడుగుపెట్టాడు. కానీ చిత్రలేఖనంపై ఉన్న ఇష్టాన్ని వదలకుండా తను పనిచేసే కుట్టు మిషన్‌తోనే అందమైన చిత్రాలను వేయడం ప్రారంభించాడు. ఇలా ఎంబ్రాయిడరీ ద్వారా పెయింటింగ్స్ వేసిన మొదటి వ్యక్తిగా అరుణ్ నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment