
ఇది పూత కాలంకాదు కాదు నేత కాలంసిసలైన చే నేత కాలంఅచ్చ తెలుగు ఉగాది నాడుఅటు సంప్రదాయాన్ని ఇటు ఆధునికతను మేళవించిలంగా జాకెట్టు... దానిపై రంగు రంగుల దుపట్టా ధరించినేతల్లా ఏలండి ఫ్యాషన్ ప్రపంచాన్ని.
‘‘పండగకు కంచిపట్టు, బెనారస్ లెహంగాల ఎంపిక సహజమే. కొంత వెరైటీ కావాలనుకునేవారు ఈ మిక్సింగ్ ప్యాటర్న్‌ని ట్రై చేయవచ్చు. కలర్ కాంబినేషన్స్, హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్‌తో సరైన విధంగా మిక్స్ చేసి బ్యాలెన్స్ చేయడంలోనే మన ప్రత్యేకత కనిపిస్తుంది. ఏ కలర్‌కి ఏది బాగుంటుంది అని చెక్ చేసి, ఈ డిజైన్స్ తయారు చేశాం. మీరూ ఈ కాంబినేషన్‌ని ట్రై చేయవచ్చు. ఎంబ్రాయిడరీ చేసిన ఆర్గంజా ఫ్యాబ్రిక్‌ను, క్రష్ చేసి, అంచులు జత చేసి లెహంగాలు డిజైన్ చేశాం. ఆర్గంజా, పుట్టపాక చేనేత చీరల ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్. కళ్లకు, మేనికి హాయిగొలుపుతాయి. ఈ లెహంగాల మీదకు ఏ హ్యాండ్లూమ్ దుపట్టాలయినా సూపర్బ్ అనిపిస్తాయి. కలంకారీ, బెనారస్, టస్సర్, నేచరల్ డై చేసిన హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ దుపట్టాలు ఈ లెహంగాల మీదకు వాడాం. పండగ సందర్భాల్లోనూ ఇలా ప్రత్యేకంగా తయారు అవచ్చు అని చూపడానికి వీటిని డిజైన్ చేశాం. మీరు ట్రై చేసి చూడండి మరి.