Benares
-
బెనారస్ ఏంటో పాటే చెప్పేస్తోంది
‘‘అన్నం ఉడికిందా? లేదా? అని తెలియడానికి ఒక మెతుకు పట్టుకుంటే చాలన్నట్లు ‘బెనారస్’ మూవీ గురించి ‘మాయ గంగ..’ పాట చెప్పేస్తోంది. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అని డైరెక్టర్ సుకుమార్ అన్నారు. జైద్ ఖాన్, సోనాల్ మోన్‌టైరో జంటగా జయతీర్థ దర్శకత్వం వహించిన చిత్రం ‘బెనారస్’. తిలక్ రాజ్ బల్లాల్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్వరలో విడుదల కానుంది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘మాయ గంగ..’ అంటూ సాగే పాటను సుకుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా తిలక్ రాజ్ బల్లాల్ మాట్లాడుతూ– ‘‘జైద్ ఖాన్ ఎంతో డెడికేషన్, హార్డ్ వర్క్‌తో ఈ సినిమా చేశాడు. ‘పుష్ప’ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో మా సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. జయతీర్థ మాట్లాడుతూ– ‘‘నేను చిన్నప్పుడే స్కూల్ మానేశాను. అయితే వీధి నాటకాలు వేస్తూ పెరిగాను. సినిమాలను తెలుగు ప్రేక్షకుల్లా మరెవరూ ప్రేమించలేరు. భాష ఏదైనా మంచి సినిమాలను ఆదరిస్తున్నారు’’ అన్నారు. ‘‘హీరోగా నేను వేస్తున్న తొలి అడుగు ఇది’’ అన్నారు జైద్ ఖాన్. సోనాల్ మోన్‌టైరో, లిరిక్ రైటర్ కె.కె. మాట్లాడారు. -
పూచిన తామరలు
కలంకారితో అలంకరణ ఎప్పుడూ బాగుంటుంది. ఆ కలంకారి డిజైన్‌లో పూచిన తామరలు ఉంటే ఇంకా బాగుంటుంది. మరి అంచులు బెనారస్ పట్టుతో ముడిపడితే? ఇక్కడ ఉన్నట్టుగా ఉంటుంది. కొత్తలుక్కు కోసం ఈ తామర కలంకారిని ఉపయోగించి చూడండి. వికసించిన కమల సౌందర్యం సొంతం చేసుకోండి. కలంకారీ డిజైన్స్ ఎన్నో ఏళ్ల నుంచి వాడుకలో ఉన్నవే. వీటిని ఎంత కొత్తగా చూపిస్తున్నామన్నదే ముఖ్యం. సాధారణంగా కలంకారీ అనగానే నెమళ్లు, తీగలు, కొమ్మలు.. ఇవే కనిపిస్తుంటాయి. ఈ చీరలలో వివిధ రూపాలలో ఉండే తామరపువ్వు డిజైన్స్‌ను ఒక థీమ్‌గా తీసుకున్నాం. ఈ పెన్ కలంకారీలో వాడిన రంగులన్నీ నేచరుల్ కలర్స్ మాత్రమే. డల్ లుక్ రాకుండా ఉండటం కోసం బెనారస్ పట్టును అంచులుగా జత చేశాం. ఇవి ఏ ప్రత్యేక సందర్భాలలోనైనా అన్ని వయసుల వారు ధరించవచ్చు. ►కలంకారీ కళ తెలుగువారి సొంతం. అద్భుతమైన చేతిపనితనంతో దుస్తులను అందంగా తయారుచేస్తారు కళాకారులు. ప్లెయిన్ ప్యూర్ పట్టు చీర మీద రూపుదిద్దుకున్న పెన్ కలంకారీ డిజైన్లు వేడుకల సందర్భంలో ఓ అద్భుతమైన కళను తీసుకుస్తాయి. ఎక్కడ ఉన్నా ప్రత్యేకతను చాటుతాయి. ప్లెయిన్ పట్టుకు కలంకారీ డిజైన్‌ను వేయించుకున్నాక బామ్మల కాలం నాటి బెనారస్, కంచి పట్టు చీరల పెద్ద పెద్ద అంచులనూ బార్డర్స్గా వాడుకోవచ్చు. దీని వల్ల చీరకు, లెహంగా, దుపట్టా డిజైన్లకు మరింత గ్రాండ్ లుక్ వస్తుంది. ఏ వేడుకలోనైనా హైలైట్ అవుతుంది. ►జాతీయస్థాయిలో పెన్ కలంకారీకి డిజైన్స్‌కి గొప్ప పేరుంది. కలంకారీ డిజైనర్ పట్టు చీరలు ఏ వేడుకల్లో ధరించినా కళను, హుందాతనాన్ని, గొప్పదనాన్ని, మనదైన ఆత్మను ప్రతిఫలింపజేస్తుంది. ఎవర్‌గ్రీన్‌గా నిలిచే కలంకారీ డిజైనర్ చీరలను యువతరం వారి అభిరుచిమేరకు ఏ కాలమైన మరో ఎంపిక అవసరం లేకుండా ధరించవచ్చు. -
ఉగాది నేత
ఇది పూత కాలంకాదు కాదు నేత కాలంసిసలైన చే నేత కాలంఅచ్చ తెలుగు ఉగాది నాడుఅటు సంప్రదాయాన్ని ఇటు ఆధునికతను మేళవించిలంగా జాకెట్టు... దానిపై రంగు రంగుల దుపట్టా ధరించినేతల్లా ఏలండి ఫ్యాషన్ ప్రపంచాన్ని. ‘‘పండగకు కంచిపట్టు, బెనారస్ లెహంగాల ఎంపిక సహజమే. కొంత వెరైటీ కావాలనుకునేవారు ఈ మిక్సింగ్ ప్యాటర్న్‌ని ట్రై చేయవచ్చు. కలర్ కాంబినేషన్స్, హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్‌తో సరైన విధంగా మిక్స్ చేసి బ్యాలెన్స్ చేయడంలోనే మన ప్రత్యేకత కనిపిస్తుంది. ఏ కలర్‌కి ఏది బాగుంటుంది అని చెక్ చేసి, ఈ డిజైన్స్ తయారు చేశాం. మీరూ ఈ కాంబినేషన్‌ని ట్రై చేయవచ్చు. ఎంబ్రాయిడరీ చేసిన ఆర్గంజా ఫ్యాబ్రిక్‌ను, క్రష్ చేసి, అంచులు జత చేసి లెహంగాలు డిజైన్ చేశాం. ఆర్గంజా, పుట్టపాక చేనేత చీరల ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్. కళ్లకు, మేనికి హాయిగొలుపుతాయి. ఈ లెహంగాల మీదకు ఏ హ్యాండ్లూమ్ దుపట్టాలయినా సూపర్బ్ అనిపిస్తాయి. కలంకారీ, బెనారస్, టస్సర్, నేచరల్ డై చేసిన హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ దుపట్టాలు ఈ లెహంగాల మీదకు వాడాం. పండగ సందర్భాల్లోనూ ఇలా ప్రత్యేకంగా తయారు అవచ్చు అని చూపడానికి వీటిని డిజైన్ చేశాం. మీరు ట్రై చేసి చూడండి మరి. -
సబ్యసాచీరలు
సబ్యసాచి దుప్పటి చుట్టినా అందంగానే ఉంటుంది. ఇక చీర చుడితే...ఆయన డిజైన్ చేసిన చీరలకు విదేశాలలోనూ మాంచి గిరాకీ ఉంటుంది. ‘ఏమిటయ్యా నీ మ్యాజిక్’ అని అడిగితే.... చీరల్ని చీరల్లా కాకుండా సబ్యసా‘చీర’ల్లా చూడమంటున్నాడు. ఆ గొప్పతనమేంటో మీరూ చూడండి. మీ చీరలకూ ఆ కొత్త కళను తీసుకురండి. నిలయ పేరుతో సబ్యసాచి రూపొందించిన డిజైనరీ శారీ ఇది. ఎరుపు రంగు బెనారస్ పట్టుకు అదనంగా అమర్చిన ఎంబ్రాయిడరీ అంచు... దానికి తగ్గ అలంకరణ ఈ చీర అందాన్ని వెయ్యింతలు చేసింది. పువ్వుల ప్రింట్ల క్రేప్ శారీకి ఎంబ్రాయిడరీ అంచు, మోడ్రన్ బ్లౌజ్‌తో తీర్చిదిద్దిన హంగులు కిందటేడాది కాన్స్ అంతర్జాతీయ సినిమా ఉత్సవంలో హైలైట్‌గా నిలిచాయి. కథ చెబుతున్నంత అందంగా! ఇండియన్ ఫ్యాషన్ రంగానికి రాచకళను తీసుకువచ్చిన ప్రసిద్ధ డిజైనర్ సబ్యసాచి ముఖర్జి. రంగులు, హంగులతో దుస్తులకు అతనో అద్భుతమైన కళను తీసుకువస్తారు. వాటిని అలంకరించుకున్న అతివలు రాచఠీవితో వేదికలపైన అడుగులు కదుపుతారు. తన ప్రతీ డ్రెస్ డిజైన్ ఒక కథ చెబుతున్నట్టు, ఓ అందమైన కవిత అల్లుతున్నట్టు మనసులను హత్తుకుపోతుంది. ఇండియన్ ప్యాషన్ డిజైన్ కౌన్సిల్లో ముఖ్య సభ్యుడుగా కొనసాగుతున్న ‘సబ్యసాచి’ లేబుల్ డిజైన్స్ అంటే బాలీవుడ్ తారలు పోటీపడతారు. సబ్యసాచి డిజైన్స్ రూపకల్పనను పరిశీలిస్తే అత్యంత సాదాగా అనిపిస్తూనే ఒక అద్భుతమైన తత్త్వాన్ని మన కళ్లకు కడతాయి. ప్రాచీనసౌరభాలు వెదజల్లుతుతుంటాయి. ప్రాంతీయ పట్టణమైన కలకత్తా సాంస్కృతిక సంప్రదాయాల నుంచి స్ఫూర్తిపొందిన సబ్యసాచి ఆ వైభవాన్ని తన మేథాశక్తితో దుస్తుల మీద రూపొందిస్తుంటారు. అపూర్వమైన అల్లికతో కూడిన ఫ్యాబ్రిక్స్, ప్యాచ్ వర్క్స్, ఇతర అలంకారాలను సబ్యసాచి డ్రెస్ డిజైన్స్‌లో చూస్తాం. వెలకట్టలేని ఇతని డిజైన్స్ వేల రూపాయల నుంచి లక్షల్లో ధరపలుకుతున్నాయి. ఈ వైభవాన్ని కొద్దిపాటి మార్పులతో మీ చీరలకూ అద్దవచ్చు. -
రీతూ పవనాలు
ఆమె పేరే చాలు అంటారు ఫ్యాషన్ ప్రియులు. దేశీయ చేనేతలదే ఆ ఘనతంతా అంటారామె వినమ్రంగా. మన చుట్టుపక్కలే ఉన్న హస్తకళానైపుణ్యంతో విదేశీ సెలబ్రిటీలు సైతం తన ఫ్యాషన్‌కు చుట్టాలు పక్కాలుగా మారిపోయేలా చేసిన ఆ రీతూ‘పవనాలు’ మీ ఇంటా వీయాలని కోరుకుంటున్నారా... అయితే ఈ డిజైన్లు మీకోసమే... బనారస్ పట్టు చీర అనగానే పెళ్లిళ్లకు మాత్రమే అనుకుంటారు. కానీ, స్లీవ్‌లెస్ హాల్టర్ నెక్ బ్లౌజ్, బాటమ్‌గా షిమ్మర్ చుడీ ధరించి బెనారస్ పట్టు చీర కడితే సంప్రదాయ పార్టీ ఏదైనా ఆకర్షణీయంగా మెరిసిపోవచ్చు. పాలనురగ లాంటి లెహంగా , చున్నీ నైట్ పార్టీలో ప్రధాన ఆకర్షణ. చేతికి వెడల్పాటి పట్టీ, చెవులకు పెద్దపెద్ద రింగులు ధరిస్తే వెస్ట్రన్పార్టీకీ బాగా నప్పుతుంది.వేడుకలలో వైభవంగా వెలిగిపోవాలంటే ఫ్యాబ్రిక్, ఎంబ్రాయిడరీ వర్క్ కలర్స్ బ్రైట్‌గా ఉండాలి. బెనారస్, క్రేప్ ఫ్యాబ్రిక్‌పైన జరీ పువ్వులు, ఆకులు, లతలతో గ్రాండ్‌గా తీర్చిదిద్దిన లెహంగా ఇది. పూర్తి ఎంబ్రాయిడరీ వర్క్‌తో ఈ లెహంగాను తీర్చిదిద్దారు. ట్రెడిషనల్, వెస్ట్రన్ కలగలిపి డిజైన్ చేసిన టాప్, లెగ్గింగి కాంబినేషన్ ఇది. -
రోబో గురువు!
రోబోలు ఫుట్‌బాల్ ఆడుతున్నాయి. భాంగ్రా డాన్సు చేస్తున్నాయి. అలసటగా ఉందని సోఫాలో వాలిపోతే గ్లాసుతో నీళ్లు తెచ్చిస్తాయి... ఇవన్నీ రోబోటిక్ రంగం సాధించిన అద్భుతాలు. ఈ అద్భుతాల ఆవిష్కర్త పాతికేళ్లు నిండని ఒక భారతీయుడు. సాంకేతికాభివృద్ధి అనగానే మన కళ్లు అభివృద్ధి చెందిన దేశాల వైపు చూస్తాయి. ‘ఆ చూపుల్ని ఇటు మరల్చండి’ అంటున్నారు 22 ఏళ్ల దివాకర్ వైష్. పదిరోజుల క్రితం హైదరాబాద్‌లోని ఐఐటి క్యాంపస్‌లో రోబో తయారీ గురించి లెక్చర్ ఇచ్చారు దివాకర్. పాఠాలు చెప్పే పరిణతి ఎక్కడ నుంచి వచ్చిందీ అంటే... తన పరిశోధనల నుంచేనంటారు. న్యూఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో ‘ఎ-సెట్ రోబోటిక్స్’ సంస్థని నడుపుతూ రోబోల గురించి క్లాసులు ఇస్తున్నారు దివాకర్. ఇంతకుముందు రూర్కెలా, ఖరగ్‌పూర్, కాన్పూర్, బెనారస్, గౌహతి ఐఐటిల్లోనూ, తమిళనాడులోని వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోనూ ఈ అంశాల మీద ఉపన్యసించారు. ‘‘చిన్నప్పుడు ఏ ఎలక్ట్రానిక్ పరికరాన్ని చూసినా ‘ఇదెలా పనిచేస్తుంది, ఇది పని చేయడానికి లోపల ఉన్న అమరిక ఎలా ఉంటుంది’ వంటి సందేహాలు కలుగుతుండేవి. విషయం తెలుసుకోవడానికి ఎన్నింటిని పాడు చేశానో లెక్కేలేదు. టెలిఫోన్, సీడీ ప్లేయర్, కంప్యూటర్ ఏది కనిపించినా ఓపెన్ చేసి చూడాల్సిందే. అన్నింటిని నష్టపరిచినా మా అమ్మానాన్నలు నన్నెప్పుడూ తిట్టలేదు’’ గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు దివాకర్. ఎలా మొదలైందంటే! నేను స్కూల్లో చదువుతున్న రోజుల్లో అంతర్ పాఠశాలల మధ్య రోబోటిక్ కాంపిటీషన్ జరిగింది. నేను ఈ రంగం మీద దృష్టి కేంద్రీకరించడానికి కారణం ఆ పోటీనే. ఆ తర్వాత చాలా పోటీల్లో పాల్గొన్నాను. కొన్నింటిలో గెలిచాను, కొన్నిసార్లు ప్రయత్నం ఫెయిలయ్యేది. ప్రతి ప్రయత్నమూ చక్కటి ప్రాక్టికల్ ఎక్స్పీరియెన్సే. మైలురాయి! లక్నోలో జరిగిన అంతర్జాతీయ రోబోటిక్ ప్రదర్శనలో మొదటి బహుమతి రావడం నా జీవితంలో మైలురాయి. లక్నో పోటీలో గెలవడంతో నా మీద నాకు నమ్మకం కలిగింది. ఈ రంగంలో ఇంకా లోతుగా అధ్యయనం చేయాలనే తపన కూడా కలిగింది. 12వ తరగతిలో ఉన్నప్పుడు కొంత వైవిధ్యంగా ఏదైనా చేయాలనిపించింది. సొంతంగా ఒక రోబోను తయారుచేయాలనుకున్నాను. నా ప్రయోగానికి చాలా ఖర్చవుతుంది. నా ప్రయత్నం విజయవంతం అవుతుందో కాదోనని, భయపడుతూనే మా అమ్మానాన్నలను ‘నేను తయారుచేయాలనుకుంటున్న రోబో తయారీకి విదేశాల నుంచి కొన్ని విడిభాగాలను తెప్పించుకోవాలి. అందుకోసం డబ్బు కావాలి’ అని అడిగాను. వాళ్లు ఏ మాత్రం సందేహించకుండా డబ్బు అమర్చారు. ఆరు నెలల తర్వాత ఒక రోబోను తయారుచేశాను. అదే నేను చేసిన తొలి రోబో. అదే భాంగ్రా డాన్సు చేసే రోబో. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ప్రయోగం కూడ. గత ఏడాది తయారుచేసిన రోబో... మనిషి మెదడు లోని ఆలోచనను పసిగడుతుంది. మనిషి అలసటగా ఉంటే ఆ విషయాన్ని గ్రహించిన రోబో గ్లాసుతో నీటిని తెచ్చి ఇస్తుంది. రోబో రంగంలో ఆసక్తి ఉన్న విద్యార్థులకు సహాయం చేస్తే మనదేశం నుంచి చాలా అద్భుతాల ఆవిష్కారం జరుగుతుంది అనిపించింది. దాంతో న్యూఢిల్లీ, కరోల్‌బాగ్‌లో ‘ఎ-సెట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ సహకారంతో ఆ సంస్థకి అనుబంధంగా ‘ఎ-సెట్ రోబోటిక్స్’ని 2010లో స్థాపించాను. ఇందులో నాలుగవ తరగతి విద్యార్థి నుంచి పిహెచ్డి స్కాలర్స్ వరకు రోబోల గురించి నేర్చుకోవచ్చు. దీనితోపాటుగా ఇక్కడ అనేక రకాల రోబోల గురించి పరిశోధన జరుగుతూంటుంది. ఐఐటి, విఐటి, బిఐటిఎస్, ట్రిపుల్‌ఐటి వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలతోపాటు మరికొన్ని ప్రముఖమైన విద్యాసంస్థల్లో కూడా లెక్చర్లు ఇస్తున్నాను’’ అంటున్నారు దివాకర్. దివాకర్ విజయాలు: 2009లో లక్నోలో మలేసియా, రష్యా, చెక్ రిపబ్లిక్ వంటి 40 దేశాల శాస్త్రవేత్తలు పాల్గొన్న పోటీలో విజయం 2010లో దేశంలో మొదటి డ్యాన్సింగ్ హ్యూమనాయిడ్ రోబోను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. ఆ రోబో హిందీ, పంజాబీ పాటలకు డాన్సు చేస్తుంది 2010లో ‘ఎ- సెట్ రోబోటిక్స్’ స్థాపన (అప్పటికి ఇతడి వయసు 18 ఏళ్లు) 2011లో పరస్పరం ఫుట్‌బాల్ ఆడుకునే మూడు రోబోల తయారీ 2012లో ‘యూ థింక్- దే వర్క్’ పేరుతో ఆలోచనను పసిగట్టే రోబో తయారీ 2013లో పూర్తి స్థాయిలో మనిషి కదలికలను పోలిన హ్యూమన్ రోబో తయారీ