జరీ జిలుగులకు పువ్వుల జాకెట్టు అలంకరణ,లైట్‌వెయిట్ ప్లెయిన్ పట్టు చీరకు మోడ్రన్ ఫ్లోరల్స్ ,క్రీమ్ కలర్ చీరకు పువ్వుల జాకెట్టు జోడీ
ఎంత ఖరీదు పట్టు చీరైనా... బ్లౌజ్ డిజైన్‌తోనే అందం పట్టు చీరకు పట్టు ఫ్యాబ్రిక్‌తోనే డిజైన్ చేయాల్సిన అవసరం లేదు పువ్వుల ప్రింట్లు ఉన్న ఫ్యాబ్రిక్‌తో సింపుల్ డిజైన్ చేసి ఆకట్టుకోవచ్చు. ‘పట్టు చీరకు పూలరెక్కలు జత చేసావే’ అని కితాబులూ అందుకోవచ్చు
పట్టు చీరకు కాంబినేషన్‌గా కాంట్రాస్ట్ బ్లౌజ్ లేదంటే సెల్ఫ్ కలర్ బ్లౌజ్, ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వేయడం సహజమే. కానీ, పూర్తిగా ఏ మాత్రం సరిపోలని పువ్వుల ప్రింట్లు ఉన్న జాకెట్లు వేస్తే.. అదే ఇప్పటి ట్రెండ్.
పాత పట్టు కొత్త హంగు
పట్టుచీరలు బీరువాలో చేరి ఏళ్లకేళ్లకు ఎదురుచూస్తుంటాయి. ఎందుకు వాటికి అంత ఖరీదు పెట్టి కొనుక్కోవడం అని చాలా మంది యోచిస్తుంటారు. పెళ్లికో, పండగకో కట్టుకుందామని నాటి చీరను ఎంపిక చేసి బయటకు తీసినా అప్పటి బ్లౌజ్ ఇప్పటికి సూట్ అవదు. రంగు వెలిసిపోవడం, లేదంటే కొలత సరిపోకపోవడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు ఓ పరిష్కారం ఫ్లోరల్‌బ్లౌజ్. స్టైల్‌కి స్టైల్, పండగైనా, పెళ్లైనా కళగా గడిచిపోతుంది.
అమ్మాయిల ఫేవరేట్
పట్టు చీర కట్టమంటే ‘అబ్బో బరువు’ అంటూ అమ్మాయిలు అమ్మ మాటను దాటేస్తుంటారు. ఫ్లోరల్ కాన్సెప్ట్ జత చేస్తే కొంచెం మోడ్రన్ టచ్ ఇచ్చారంటే ‘వావ్’ అంటూ ఎగిరి పూల రెక్కలను బ్లౌజ్‌గా తొడిగేసుకుంటారు. అప్పుడిక అమ్మాయి సీతాకోకచిలుక చీర కట్టిన ంత బ్రైట్‌గా వేడుకలో వెలిగిపోతుంది.
ప్లెయిన్ పట్టు.. పువ్వులతో కట్టు
లైట్‌వెయిట్ పట్టు చీరలు చాలా వరకు పెద్ద అంచులు ఉండి, ప్లెయిన్‌గా ఉంటాయి. వీటి మీదకు పొడవాటి చేతుల పువ్వుల ప్రింట్లు ఉన్న బ్లౌజ్ వేసుకుంటే రెట్రోస్టైల్‌లో కొత్తగా కనువిందుచేస్తారు.
పువ్వుల ప్రింటుకు ఎంబ్రాయిడరీ జిలుగు
బ్లౌజ్‌పార్ట్‌కి ఎలాగూ పువ్వుల ప్రింట్లు ఉన్న ఫ్యాబ్రిక్ ఎంచుకుంటున్నాం. పట్టు చీర కాబట్టి కొంత వర్క్ కూడా ఉంటే బాగుంటుందనుకున్నా అలాగే సెట్ చేసుకోవచ్చు. నెక్, స్లీవ్స్ ప్యాటర్న్‌లో ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకోవచ్చు.
ఆభరణాల ఊసే అక్కర్లేదు ఈ గెటప్ మీదకు పూర్తిగా ఆభరణాలు అక్కర్లేదని చెప్పలేం. కానీ, మరీ ఎక్కువ హారాలు మాత్రం అవసరం లేదు. ఎందుకంటే ఫ్లోరల్ స్టైల్ ఆభరణం ప్లేస్‌ని భర్తీ చేసేసింది కాబట్టి. కంచిపట్టుకు ఫ్లోరల్ బోట్ నెక్ లేదా రౌండ్‌నెక్ బ్లౌజ్ ధరించి, సింపుల్‌గా చెవులకు జూకాలు, ముంజేతికి సింగిల్ బ్యాంగ్ ధరిస్తే చాలు అలంకరణ అందంగా మెరిసిపోతుంది.
(పూర్తి కాంట్రాస్ట్ ఎప్పుడూ ఆకట్టుకునే స్టైల్,కంచిపట్టుకు పువ్వుల నెటెడ్ ఫ్యాబ్రిక్‌తో బ్లౌజ్ ప్రధాన ఆకర్షణ,ఏ పట్టు అయినా పువ్వుల జాకెట్టు లేటెస్ట్ ఎంపిక)
- నిఖిత డిజైనర్ హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment