
అద్దంలో మొహమే చూడని నటి
అమెరికా నటి, గాయని షెర్ మాత్రం తన మొహాన్ని అద్దంలో చూసుకోదట.
లండన్: రోజుకు ఎన్నిసార్లు అద్దంలో చూసుకుంటారు? అందులోనూ మహిళలు, ప్రత్యేకించి సినీ రంగానికి చెందినవారైతే చెప్పాల్సిన పనిలేదు. కానీ అమెరికా నటి, గాయని షెర్ మాత్రం తన మొహాన్ని అద్దంలో చూసుకోదట. రోజులో నెలలో కాదు ఏకంగా కొన్నేళ్లుగా ఇదే తంతు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజమే. కారణమేంటంటే వృద్దాప్యమంటే షెర్కు ద్వేషం. వయసు పైడిన తన మొహాన్ని చూడటానికి ఇష్టంలేకే అద్దంవైపు చూడనని 68 ఏళ్ల షెర్ చెబుతోంది.
'నాలో ఆత్మవిశ్వాసం తక్కువ. 40-45 ఏళ్ల మధ్యలో ఉన్నప్పుడు నేను చూడటానికి బాగున్నా. ఇప్పుడు ఎంతో వయసు అయినట్టుగా ఉంది. వయసు పైబడ్డ మగాళ్లు అరుదుగా నన్ను ఇష్టపడతారు. అలాగని యువకుల కోసం పరితపించడం లేదు. నేను ఎవరితోనూ డేటింగ్ చేయలేదు. కొన్నేళ్లుగా అద్దం చూడటం మానేశా. అయితే నా బాధ్యతను విజయవంతంగా నిర్వర్తిస్తా. రిటైరయ్యే ఆలోచన లేదు' షెర్ చెప్పుకొచ్చింది.