
సాక్షి, గుంటూరు: అల్లరి మూకల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. గుంటూరు నగరంలోని పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరి«ధిలో ఎనిమిదేళ్ల బాలికపై 19 ఏళ్ల యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరి ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. ఓ దశలో పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌పై దాడికి పాల్పడడం, పోలీసులపై రాళ్లు రువ్విన ఘటనను సీరియస్‌గా తీసుకుని పోలీసు ఉన్నతాధికారులు అల్లర్లకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.
ఈ ఘటనపై ఆరు కేసులు నమోదు చేసిన పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ఫుటేజీలతోపాటు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకారులు వదిలి వెళ్లిన ద్విచక్ర వాహనాల ఆధారంగా ఇప్పటికే 70 మందిని గుర్తించినట్లు తెలిసింది. గురువారం రాత్రి ఎనిమిది మంది ప్రధాన నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. మంగళవారం అర్ధరాత్రి వరకు కొనసాగిన అల్లర్లను అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులు, అక్కడి నుంచి అల్లరిమూకల కోసం వేట కొనసాగించే పనిలో పడ్డారు. బుధవారం నుంచి నగరంలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా ప్రశాంతంగా ఉన్నప్పటికీ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉండటంతో పాతగుంటూరు పరిధిలో పోలీసు పికెట్‌లను ఏర్పాటు చేశారు.
పోలీసులు ఫిర్యాదు సేకరిస్తుండగా..
బాలికపై అత్యాచారయత్నం జరిగిందనే సమాచారం తెలియగానే పోలీసులు అప్రమత్తమై నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకుని పాతగుంటూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాలికతో పాటు, తల్లి దండ్రులు, బంధువులను స్టేషన్‌కు పిలిచి ఫిర్యాదు సేకరించే పనిలో ఉన్న సమయంలో హఠాత్తుగా పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున గుమికూడిన ఆం దోళన కారులు నిందితుడిని తమకు అప్పగించా లంటూ నినాదాలు చేస్తూ స్టేషన్‌ను ముట్టడించారు
Comments
Please login to add a commentAdd a comment