ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ తొలగించిన ఉద్యోగుల్ని తిరిగి విధుల్లోకి తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఫైర్ చేసిన ఇద్దరు ఉద్యోగుల్ని సంస్థలోకి ఆహ్వానిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
ఫైర్ చేసిన ఇద్దరు పాపులర్ ఫ్రాంక్ స్టార్లు రాహుల్ లింగ్మా, డానియల్ జాన్సన్‌లను రీహైర్ చేసుకుంటున్నట్లు ఎలాన్ మస్క్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మీ ఇద్దరిని ఫైర్ చేసి పెద్ద తప్పే చేశాను. వెల్ కమ్ బ్యాక్ లింగ్మా & జాన్సన్. అంతేకాదు వారిద్దరితో కలిసి దిగిన ఫోటోల్ని మస్క్ నెటిజన్లతో పంచుకున్నారు.
Welcoming back Ligma & Johnson! pic.twitter.com/LEhXV95Njj
— Elon Musk (@elonmusk) November 15, 2022
అంతా ఉత్తుత్తే!
రాహుల్ లింగ్మా, డానియల్ జాన్సన్ విధుల్లోకి తీసుకుంటున్నట్లు మస్క్ చెప్పారు.కానీ వాళ్లిద్దరూ అస్సలు ట్విటర్ ఉద్యోగులే కాదు. మరి వాళ్లిద్దరు ఎవరంటే? ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఖర్చు తగ్గించుకునేందుకు మస్క్ ఆ సంస్థకు చెందిన ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
అదే సమయంలో మస్క్ నిర్ణయాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్న రాహుల్ లింగ్మా, డానియల్ జాన్సన్‌లు ఫ్రాంక్ చేశారు. శాన్‌ఫ్రాన‍్సిస్కోలో ఉన్న ట్విటర్ ప్రధాన కార్యాలయం నుంచి అట్టపెట్టెలు తీసుకొని వస్తూ మీడియా ప్రతినిధుల కంట పడ్డారు. దీంతో అక్కడే ఉన్న మీడియా సిబ్బంది వారిని ప్రశ్నించగా..మస్క్ తమను ఉద్యోగం నుంచి తీసేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్లీ ఒబామా ఉంటే ఈ పరిస్థితి రానిచ్చేవారు కాదంటూ బోరుమన్నారు.
అంతే వారిద్దరు చెప్పింది నిజమేనని నమ్మిన దిగ్గజ మీడియా సంస్థలు సైతం పతాక శీర్షికలతో కథనాల్ని ప్రచురించాయి. నెటిజన్లు సైతం మస్క్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్ చేస్తే ఇప్పుడు ఆ ఫ్రాంక్ స్టార్లని రీహైర్ చేసుకుంటున్నట్లు మస్క్ ఫ్రాంక్ చేయడం కొసమెరుపు.
చదవండి👉 ‘బకరాల్ని చేశాడు.. మస్క్ ట్వీట్‌తో మబ్బులు వీడాయ్’
Comments
Please login to add a commentAdd a comment