bus fare hike
-
Odisha Train Accident: ఇటు రైలు ప్రమాదం.. అటు.. బస్సు ఛార్జీల పెంపు..!
ఒడిశా:ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైళ్ల భీకర ప్రమాదంతో పూరీకి వెళ్లే మార్గంలో అటు బంగాల్ నుంచి రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. దీంతో బస్సుల ఛార్జీలు ఆకాశాన్నంటుతున్నాయి. బస్సు యజమానులు ఛార్జీలను ఒక్కసారిగా మూడొంతులకు పెంచేశారని ప్రయాణికులు వాపోతున్నారు. 'జగన్నాథ్ స్నాన్ యాత్ర' రేపు జరగనుంది. భక్తులు పూరీకి పెద్ద సంఖ్యలో వెళుతుంటారు. బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంతో రైళ్ల రాకపోకలను సౌత్-ఈస్ట్రన్ రైల్వే నిలిపివేసింది. దీంతో ప్రయాణికులు బస్సు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ అవకాశాన్ని వాడుకుని బస్సు ఛార్జీలను యజమానులు అమాంతం పెంచేశారని ప్రయాణికులు తెలిపారు. భద్రక్, కటక్, పూరీ మీదుగా వెళ్లే బస్సు ఛార్జీ సాధారణంగా రూ.400, 600, 800 ఉండేది. కానీ ప్రస్తుతం రూ.1200 నుంచి 1500 వెచ్చించాల్సి వస్తోందని స్థానికులు తెలిపారు. మరికొంత మంది ఏజెంట్లు రూ.2000 నుంచి 2500 వరకు అడుగుతున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన భీకర రైళ్ల ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 280కు చేరింది. బెంగళూరు- హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో 900 మంది గాయపడ్డారు. ఇదీ చదవండి:'కన్న కొడుకు మృతదేహాన్ని చేతులతో మోస్తూ..' రైలు ప్రమాదంలో చెదిరిన మధ్యతరగతి కుటుంబాలెన్నో.. -
‘డైనమిక్’గా టీఎస్ఆర్టీసీ.. డీజిల్ ధర తగ్గితే బస్సు చార్జీలు తగ్గిస్తారా?
సాక్షి, హైదరాబాద్: డైనమిక్ ఫేర్ విధానం.. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు చార్జీలు పెంచుకోవడం ఎయిర్‌లైన్స్ సంస్థల్లో చూస్తుంటాం. పండుగల సమయాల్లో చార్జీలు రెట్టింపు చేసి వసూలు చేయటం ప్రైవేటు బస్సు ఆపరేటర్లకూ కొట్టినపిండే. ఇప్పుడు డీజిల్ ధరల విషయంలో ఆ తరహా విధానాన్ని అనుసరించే దిశలో టీఎస్ఆర్టీసీ నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవలే డీజిల్ సెస్ కొత్త చార్జీల పెంపు విధానాన్ని ఆర్టీసీ అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. టికెట్‌పై బస్సు కేటగిరీ వారీగా రూ.5, రూ.10 చొప్పున సెస్ విధించింది. ఇప్పుడు ఇందు లో ‘డైనమిక్’ విధానాన్ని తేవాలని భావిస్తోంది. డీజిల్ ధర భారీగా పెరిగినప్పుడల్లా ఈ సెస్‌నూ తదనుగుణంగా పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో డీజిల్ ధర స్థిరంగా ఉంది. కొద్దిరోజుల క్రితం వారంలో మూడునాలుగు పర్యాయాలు పెరిగింది. మళ్లీ ఆ పరిస్థితి వస్తే డీజిల్ సెస్‌ను సవరించే లా ఆర్టీసీ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. చదవండి👉 ఆల్‌నైన్ నెంబర్ @ రూ.4.49 లక్షలు సెస్‌ను ఎంత పెంచాలన్న విషయంలో నిర్ణ యం కూడా తీసుకునట్లు తెలుస్తోంది. నిజానికి ఆర్టీసీ కొనే బల్క్ డీజిల్ ధర రూ.119కి చేరింది. కొద్ది రోజుల్లోనే రిటైల్ ధర దానికి చేరువవుతుందన్న హెచ్చరికలు మార్కెట్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీంతో ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా డైనమిక్ ఫేర్ విధానంలో డిమాండ్ లేనప్పుడు టికె ట్ధర తగ్గించడం కూడా భాగమే. మరి డీజిల్ ధర లు తగ్గితే సెస్‌ను ఆర్టీసీ తగ్గిస్తుందేమో చూడాలి. చదవండి👉🏼 గుడ్‌న్యూస్.. సిటీబస్సు @ 24/7 -
Hyderabad: ఆర్టీసీ చార్జీల బాదుడు.. ఏ స్టాప్‌కు ఎంత పెంచారంటే?
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ గుట్టుచప్పుడు కాకుండా చార్జీలు పెంచింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చేలా గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని డిపోలకు సందేశాలు చేరాయి. సాధారణ చార్జీల పెంపు కాకుండా సేఫ్టీ సెస్ రూపంలో వీటిని పెంచింది. ప్రమాదాలు, విపత్తులు, వాహనాల బీమా తదితర అవసరాల దృష్ట్యా ఆర్టీసీ మూలనిధి కోసం కొత్తగా భద్రతా సెస్ చార్జీలను విధించినట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు గ్రేటర్లో ఆర్డినరీ బస్సులకు నాలుగు స్టేజీల వరకు అంటే 8 కిలో మీటర్ల వరకు ప్రస్తుతం ఉన్న చార్జీలే యథాతథంగా ఉంటాయి. ఆ తర్వాత ప్రతి మూడు, నాలుగు స్టేజీలకు రూ..5 చొప్పున పెంచారు. మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో మొదటి రెండు స్టేజీల వరకు చార్జీలు యథాతథంగానే ఉన్నాయి. ఆ తర్వాత రూ.5 చొప్పున పెరిగాయి. ప్రయాణికులపై తప్పని భారం.. ఆర్టీసీ మూల నిధి కోసం ఇప్పుడు ఉన్న చార్జీలపై భద్రతా సెస్ రూపంలో మాత్రమే అదనపు చార్జీలను విధిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నగరంలోని ప్రయాణికులపై ప్రతి నెలా రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్లకుపైగా అదనపు భారం పడనుంది. నగరంలో ప్రతిరోజు సుమారు 16 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు. వీరిలో మెట్రో బస్సుల్లో మొదటి రెండు స్టేజీలు, ఆర్డినరీ బస్సుల్లో మొదటి నాలుగు స్టేజీలు ప్రయాణించే వారు నాలుగైదు లక్షల మంది మాత్రమే ఉంటారు. మిగతా ప్రయాణికులకు సిటీ బస్సుల్లో ప్రయాణం భారంగా మారింది. చదవండి: యూనివర్సల్ బేకరీ.. ఓ స్వీట్ మెమొరీ.. మూతపడటానికి కారణాలేమిటి? ఆర్డినరీ బస్సుల్లో.. ►ప్రస్తుతం ఆర్డినరీ బస్సుల్లో మొదటి రెండు స్టేజీలకు ప్రస్తుతం ఉన్న రూ.10 చార్జీలో ఎలాంటి మార్పు ఉండదు. ఆ తర్వాత మరో రెండు స్టేజీల వరకు ప్రస్తుతం ఉన్న రూ.15 చార్జీ యథావిధిగా ఉంటుంది. అంటే ప్రయాణికులు తాము బయలుదేరిన చోటు నుంచి 4 స్టేజీల వరకు అంటే 8 కి.మీ వరకు పాత చార్జీల ప్రకారమే చెల్లించాల్సి ఉంటుంది. ►10 కి.మీ తర్వాత చార్జీల పెంపు అమల్లోకి వస్తుంది. ఈ మేరకు 5వ స్టేజీ నుంచి రూ.5 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు 5 స్టేజీల వరకు ఇప్పటి వరకు రూ.15 చార్జీ ఉండగా ప్రస్తుతం రూ.20 కి పెంచారు. ► 6వ స్టేజీ నుంచి 9వ స్టేజీ వరకు అంటే 12 కి.మీ నుంచి 18 కి.మీ వరకు ఇప్పుడు ఉన్న చార్జీని రూ.20 నుంచి రూ.25కు పెంచారు. ►ఆ తర్వాత 10వ స్టేజీ అంటే 20 నుంచి 28 కి.మీ (14వ స్టేజీ) వరకు ఇప్పటి వరకు రూ.25 ఉండగా తాజాగా రూ.30కి పెంచారు. ►30 కి.మీ నుంచి 40 కి.మీ వరకు అంటే 15వ స్టేజీ నుంచి 19వ స్టేజీ వరకు ఇప్పటి వరకు రూ.30 చార్జీ ఉండగా దానిని తాజాగా రూ.35కు పెంచారు. ► 40 కి.మీ వరకు (20వ స్టేజీ) ఇప్పటి వరకు రూ.35 ఉండగా, తాజాగా రూ.40కి పెంచారు. మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో... ►మూడో స్టేజీ వరకు అంటే 6 కి.మీ వరకు ఇప్పుడున్న రూ.15ను రూ.20కి పెంచారు. ఆ తర్వాత 8 నుంచి 14 కి.మీ వరకు అంటే 4వ స్టేజీ నుంచి 7వ స్టేజీ వరకు ఇప్పుడు ఉన్న రూ.20 చార్జీలను రూ.25కు పెంచారు. ►16 కి.మీ నుంచి 24 కి.మీ వరకు అంటే 8వ స్టేజీ నుంచి 12వ స్టేజీ వరకు రూ.25 నుంచి రూ.30కి పెంచారు. ఆ తర్వాత 4 స్టేజీల వరకు రూ.5 చొప్పున అంటే రూ.30 నుంచి రూ.35కు పెంచారు. 36 కి.మీ నుంచి (17వ స్టేజీ నుంచి) 40 కి.మీ వరకు (20వస్టేజీ వరకు) రూ.35 నుంచి రూ.40కి పెంపు. మెట్రో డీలక్స్ బస్సుల్లో.. ►మొదటి 2 కి.మీ వరకు రూ.15 చార్జీలో ఎలాంటి మార్పు లేదు. 4 కి.మీటర్లకు రూ.15 నుంచి రూ.20కి పెంచారు. ఆ తర్వాత 6 కి.మీ నుంచి (3వ స్టేజీ నుంచి) 12 కి.మీ వరకు (6వ స్టేజీ) రూ.20 నుంచి రూ.25కు చార్జీలు పెంచారు. ► 8వ స్టేజీ నుంచి అంటే 14 నుంచి 22 కి.మీ వరకు (11వ స్టేజీ)రూ.25 నుంచి రూ.30కి పెంచారు. ఆ తర్వాత రెండు స్టేజీల వరకు అంటే 26 కి.మీ వరకు రూ.30 నుంచి రూ.35 చొప్పున, ఆ తర్వాత వచ్చే రెండు స్టేజీల వరకు అంటే 30 కి.మీ వరకు రూ.35 నుంచి రూ.40 చొప్పున చార్జీలు పెరిగాయి. ►17వ స్టేజీ నుంచి 18వ స్టేజీ వరకు అంటే 34 కి.మీ నుంచి 36 కి.మీ వరకు రూ.40 నుంచి రూ.45కు పెంచారు. ►18వ స్టేజీ నుంచి 20వ స్టేజీ వరకు అంటే 36 నుంచి 40 కి.మీ వరకు ఇప్పటి వరకు ఉన్న చార్జీ రూ.45 నుంచి రూ.50కి పెంచారు. -
VC Sajjanar: ఆర్టీసీ ఛార్జీల పెంపుపై కీలక నిర్ణయం తీసుకున్న సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: ప్రజాసేవలో నిమగ్నమైన ఆర్టీసీ ఎన్నటికీ జనంపై భారం మోపడానికి ఇష్టపడదని సమస్యలన్నింటినీ అధిగమించాలంటే పెంపు అనివార్యమైందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. కోవిడ్ సమయంలో భారీగా పెరిగన నష్టాలు, భారీగా పెరిగిన డీజిల్ ఛార్జీలు, ఫలితంగా పెరిగిన విడిభాగాల ధరలతో తప్పడంలేదని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాజాగా పల్లెవెలుగు, ఆర్డినరీ సర్వీసులపై కి.మీ.కు 25 పైసలు, మిగతా సర్వీసులపై 30 పైసలు చొప్పున టికెట్ ధరలను పెంచాలని ప్రతిపాదించామని, పెరిగిన తర్వాత కూడా ఇతర రాష్ట్రాల ఆర్టీసీల కంటే తెలంగాణ ఆర్టీసీ ఛార్జీలు తక్కువేనని వెల్లడించారు. (చదవండి: నేనేం చేశాను నాన్నా! ) -
ముహూర్తం ఖరారు.. కి.మీ.కు 15 నుంచి 30 పైసలు పెంపు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచేందుకు కసరత్తు జరుగుతోంది. వారం పదిరోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నెల రోజుల క్రితం ఆర్టీసీ అధికారుల తో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమీక్షలో బస్సు చార్జీల అంశం ప్రస్తావనకు వచ్చిన విషయం తెలిసిందే. డీజిల్ భారం తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో చార్జీలను పెంచాలని అధికారులు సీఎంను కోరారు. తదుపరి మంత్రివర్గ సమావేశంలో దీనిపై ని ర్ణయం తీసుకుంటామని, ఈలోపు ప్రతిపాదనలు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. దీం తో నాలుగు ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయానికి సమర్పించారు. పెంపునకు ప్రభుత్వం కూడా సాను కూలంగానే ఉందన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. కొన్ని రాజకీయ కారణాలతో నెల రోజులుగా ఈ కసరత్తు పెండింగులో పడింది. తాజాగా మరో సారి ఈ అంశంలో కదలిక వచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి భేటీ పిలుపు కో సం ఎదురుచూస్తున్న ఆర్టీసీ యాజమాన్యం.. ఉన్నతాధికారులతో మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. వా రం పది రోజుల్లో సమావేశం నిర్వహించి, ఓ ప్రతిపాదనకు ఆమోదం తెలిపే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. (చదవండి: హైదరాబాద్: సదర్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు) కి.మీ.కు 25 పైసల ప్రతిపాదనకు మొగ్గు రెండేళ్ల క్రితం ఆర్టీసీలో సమ్మె తర్వాత 2019 డిసెంబరులో ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను సవరించింది. అప్పట్లో కిలోమీటరుకు 20 పైసల మేర పెంచింది. దీనివల్ల ప్రజలపై ఏటా రూ.550 కోట్ల భారం పడుతోంది. చార్జీలు పెంచిన సమయంలో డీజిల్ ధర లీటరుకు రూ.68గా ఉంది. ఇప్పుడది రూ.105కు చేరుకుంది. తాజాగా కేంద్రం సుంకం తగ్గించటంతో రూ.90 దిగువకు (ఆర్టీసీకి రాయితీ ధర మేరకు) చేరింది. అయినా... గతంలో చార్జీలు పెంచినప్పటి నుంచి ప్రస్తుత ధరతో బేరీజు వేసుకుంటే లీటరుపై రూ.20కి పైనే ఎక్కువగా ఉంది. అప్పటితో పోలిస్తే నిత్యం అదనంగా రూ.1.22 కోట్ల కంటే ఎక్కువ భారం పడుతోంది. ఈ నేపథ్యంలో చార్జీల పెంపు అనివార్యమేనన్నది ఆర్టీసీ అభిప్రాయం. ఇవీ ప్రతిపాదనలు ప్రభుత్వానికి ఆర్టీసీ ఇటీవల నాలుగు రకాల ప్రతిపాదనలు పంపింది. కి.మీ.కు 15 పైస లు, 20 పైసలు, 25 పైసలు, 30 పైసలు.. ఇలా దేని ప్రకారం ఎంత ఆదాయం పెరుగుతుందనే లెక్కలు అందించారు. 20 పైసలు పెంచితే రూ.625 కోట్ల ఆదాయం పెరుగుతుందని, 25 పైసలు పెంచితే దాదాపు రూ.750 కోట్లు పెరుగుతుందని, 30 పైసలైతే రూ.900 కోట్లకు పైగా పెరుగుతుందని పేర్కొన్నారు. ఇందులో కి.మీ.కు 25 పైసలు పెంచే ప్రతిపాదన అనుకూలంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆర్టీసీ వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. 30 పైసలైతే ఆర్టీసీకి మ రింత మెరుగ్గా ఉండనున్నా.. ప్రజలు భారం గా భావించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో మధ్యేమార్గంగా 25 పైసల పెంపుపై సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. తాజా తగ్గింపుతో రోజుకు రూ.90 లక్షలు ఆదా కేంద్రం తాజాగా ఎక్సైజ్ సుంకంపై తీసుకున్న నిర్ణయంతో చమురు ధరలు కొంతమేర తగ్గాయి. లీటరు డీజిల్‌పై రూ.10 తగ్గడంతో ఆర్టీసీకి పెద్ద ఊరటగానే మారింది. దీంతో రోజువారీ వినియోగిస్తున్న 6.50 లక్షల లీటర్ల డీజిల్‌పై లెక్కగడితే రూ.65 లక్షలు నేరుగా ఆదా అవుతుంది. ఆర్టీసీ వినియోగిస్తున్న అద్దె బస్సులపై వచ్చే ఆదాను కూడా జోడిస్తే అది రూ.90 లక్షల వరకు చేరుకుంటుంది. (చదవండి: TRS MPTC: గొర్రెల కాపరిగా టీఆర్ఎస్ ఎంపీటీసీ.. రోజూ కూలీ రూ.500) -
పండగ పూట టికేట్ల దోపిడీ
-
బస్ ఛార్జీలు తగ్గించండి: జీవీ ప్రకాశ్
చెన్నై : తమిళనాడులో సౌత్ హీరోలు రాజకీయాల్లో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కమల్ హాసన్, రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇవ్వగా, ఇక ప్రకాశ్ రాజ్, విశాల్ వంటి వారు కూడా రాజకీయాలపై స్పందిస్తున్నారు. అవసరం అయితే రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధం అంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. తాజాగా యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కూడా తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంపై స్పందించారు. పెంచిన బస్సు ఛార్జీలు తగ్గించాలంటూ అతడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. బస్సు ఛార్జీల ధరల పెంపుపై ఇప్పటికే సామాన్య ప్రజలతో పాటు విపక్షాలు విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీవీ ప్రకాశ్... బస్సు ఛార్జీల పెంపుపై ప్రభుత్వం మరోసారి సమీక్ష నిర్వహించాలని కోరారు. ధరల పెంపు సామాన్య ప్రజలతో పాటు పేదలపై పెను భారం పడుతోందంటూ అతడు తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నాడు. కాగా తమిళనాడు ప్రభుత్వం ఒక్కసారిగా బస్సు ఛార్జీలను 67శాతం పెంచేసిన విషయం విదితమే. -
చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలి
వైఎస్సార్సీపీ భారీ ధర్నాతో దద్దరిల్లిన రాజధాని హైదరాబాద్: విద్యుత్, బస్సు చార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీ శనివారం ఇక్కడ చేపట్టిన రాస్తారోకో, ధర్నాలతో రాజధాని దద్దరిల్లింది. వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి నేతృత్వంలో గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పార్టీ కమిటీలు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో నిర్వహించిన భారీ నిరసన ప్రదర్శన ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించింది. పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలం టూ పార్టీ శ్రేణులు పెద్దపెట్టున నినదించాయి. ప్రజలపై భారం మోపి బంగారు తెలంగాణ సాధిస్తారా అంటూ ప్రభుత్వపెద్దలను నిలదీ శాయి. ప్రజలపై భారం మోపుతున్న సీఎంకు బంగారు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, మహానేత వైఎస్సార్ హయాం లో ఏనాడూ ఏ చార్జీలూ పెంచలేదంటూ... కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం డౌన్ డౌన్, వెంటనే పెంచిన చార్జీలను తగ్గించాలి, వైఎస్సార్ జిందాబాద్, జై జగన్ అంటూ రోడ్డుపై బైఠాయించారు. భారీ వలయంలా ఏర్పడి రాస్తారోకో నిర్వహించారు. అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్, జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాసరెడ్డి తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. పార్టీ నేతలు మతీన్, డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, బండారు వెంకటరమణ, గ్రేటర్ మహిళా అధ్యక్షురాలు శ్యామల, రఘురామిరెడ్డి తదితరులతోపాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. రెండేళ్లలో ఎలాంటి ప్రగతీ లేదు: గట్టు నిరసన సందర్భంగా గట్టు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ టీ ఆర్ఎస్ రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో ఎలాంటి ప్రగతీ జరగలేదన్నారు. ఇప్పటికే కష్టాల్లో ఉన్న ప్రజలపై కరెంట్, బస్సు చార్జీల రూపంలో దాదాపు రూ.2 వేల కోట్ల పెనుభారాన్ని మోపడం సమంజసం కాదన్నారు. పెం చిన చార్జీలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయా న్ని నిరసిస్తూ రాష్ర్ట వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నామన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏ ఒక్క చార్జీ పెంచలేద ని, ప్రజలపై ఒక్క రూపాయి కూడా అదనపు భారాన్ని మోపలేదన్నారు. కానీ, సీఎం కేసీఆర్ అందుకు పూర్తి విరుద్ధంగా మాయమాటలు చెప్పి మభ్యపెడుతూ, వివిధ రూపాల్లో ప్రజ లపై భారాన్ని మోపుతున్నారని అన్నారు.