సాక్షి, హైదరాబాద్: ప్రజాసేవలో నిమగ్నమైన ఆర్టీసీ ఎన్నటికీ జనంపై భారం మోపడానికి ఇష్టపడదని సమస్యలన్నింటినీ అధిగమించాలంటే పెంపు అనివార్యమైందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. కోవిడ్ సమయంలో భారీగా పెరిగన నష్టాలు, భారీగా పెరిగిన డీజిల్ ఛార్జీలు, ఫలితంగా పెరిగిన విడిభాగాల ధరలతో తప్పడంలేదని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజాగా పల్లెవెలుగు, ఆర్డినరీ సర్వీసులపై కి.మీ.కు 25 పైసలు, మిగతా సర్వీసులపై 30 పైసలు చొప్పున టికెట్ ధరలను పెంచాలని ప్రతిపాదించామని, పెరిగిన తర్వాత కూడా ఇతర రాష్ట్రాల ఆర్టీసీల కంటే తెలంగాణ ఆర్టీసీ ఛార్జీలు తక్కువేనని వెల్లడించారు.
(చదవండి: నేనేం చేశాను నాన్నా! )
Comments
Please login to add a commentAdd a comment