సాక్షి, హైదరాబాద్: పదే పదే హెచ్చరిస్తోన్న టీఎస్‌ఆర్టీసీ సిబ్బందిపై ఉద్దేశ్యపూర్వకంగా కొందరు దాడులకు దిగుతుండటం దురదృష్టకరమని, ఇది సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని తెలగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా అన్నారు.
‘తాజాగా హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఇద్దరు ఫరూక్‌నగర్ డిపోకు చెందిన డ్రైవర్, కండక్టర్‌పై విచక్షణరహితంగా ఆదివారం రాత్రి దాడి చేశారు. క్రికెట్ బ్యాట్‌తో వారిని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో కండక్టర్ రమేష్ ఎడమ చేయి విరగింది. డ్రైవర్ షేక్ అబ్దుల్‌కి గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు హైదరాబాద్ కమిషనరేట్ దోమలగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే కేసు నమోదైంది. నిందితులు మహ్మద్ మజీద్, మహ్మద్ ఖాసీంలను పోలీసులు అరెస్ట్ చేశారు. అతి తక్కువ సమయంలో నిందితులను పట్టుకుని పోలీసులు అరెస్ట్ చేశారు’ అని సజ్జనార్ తెలిపారు.
పదే పదే హెచ్చరిస్తోన్న #TSRTC సిబ్బందిపై ఉద్దేశ్యపూర్వకంగా కొందరు దాడులకు దిగుతుండటం దురదృష్టకరం. ఇది సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. తాజాగా #Hyderabad ట్యాంక్ బండ్ పై ఇద్దరు ఫరూక్ నగర్ డిపోనకు చెందిన డ్రైవర్, కండక్టర్ పై విచక్షణరహితంగా ఆదివారం రాత్రి దాడి చేశారు. క్రికెట్… pic.twitter.com/qSgAk4zTYy
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) February 5, 2024
Comments
Please login to add a commentAdd a comment