పాదచారులపైకి దూసుకెళ్లిన కంటైనర్: 9 మంది మృతి | 8 killed in road accident in chennai city | Sakshi
Sakshi News home page

పాదచారులపైకి దూసుకెళ్లిన కంటైనర్: 9 మంది మృతి

Published Tue, Jun 30 2015 9:06 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

8 killed in road accident in chennai city

చెన్నై: నగరంలోని ఈసీఆర్ రోడ్డులో మంగళవారం అతి వేగంతో కంటైనర్ వాహనం పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే దుర్మణం చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కంటైనర్ డ్రైవర్పై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో  ఏడుగురు పోలీసులు కాగా .. ఇద్దరు మహిళలు ఉన్నారని పోలీసులు చెప్పారు. కంటైనర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement