
కమల్‌హాసన్ చిన్న కుమార్తె, నటి అక్షరాహాసన్ పర్సనల్ ఫొటోలు ఇటీవల లీక్ అయ్యాయి. ఓ ఫొటోషూట్‌కి సంబంధించి అక్షర దిగిన ఫొటోలను ఆమె ఫోన్‌లో నుంచి ఎవరో అజ్ఞాత వ్యక్తి హ్యాక్ చేసి ఇంటర్‌నెట్‌లోకి వదిలాడు. నెట్‌లో ఇప్పుడు చక్కర్లు కొడుతున్న ఆ హాట్ హాట్ ఫొటోలు అక్షరని వార్తల్లో నిలిచేలా చేశాయి. ఈ విషయం గురించి అక్షర స్పందించారు. ‘‘ఇటీవల నా పర్సనల్ ఫొటోలు కొన్ని ఇంటర్‌నెట్‌లో లీక్ అయ్యాయి. అది ఎవరు చేశారు? ఎందుకు చేశారో ఇంకా తెలియదు. కామాంధుడైన ఒక సైకోను అతడి ఆలోచనలు ఒక అమ్మాయి పర్సనల్ విషయాల్ని లీక్ చేయమని ప్రేరేపిస్తే.. ఇతరులు ఆమెను బాధితురాలిగా నిలబెట్టడం, ఆ ఫొటోలకు ఏదో ఓ హెడ్డింగ్ పెట్టి షేర్ చేయడం నన్ను ఇంకా భయానికి గురిచేసింది.
అలాగే నన్ను వేధించడంలో, నిస్సహాయురాలిని చేయడంలో మీ (ఫొటోలు షేర్ చేసిన వ్యక్తులు) అందరూ పాల్గొన్నారనిపిస్తోంది. తాజాగా ‘మీటూ’ అనే ఉద్యమం ద్వారా దేశం మొత్తం స్త్రీల సంరక్షణ విషయంలో జాగ్రత్తపడుతుంటే.. ఇంకా కొంతమంది వ్యక్తులు అమ్మాయిల పర్సనల్ ఫొటోలు షేర్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఈ విషయాన్ని ముంబై పోలీసులకు తెలియజేశాను. త్వరలోనే అతణ్ని ఎలాగూ పట్టుకుంటారు. అప్పటివరకూ నేను అందర్నీ వేడుకునేది ఒక్కటే.. ‘లివ్ అండ్ లెట్ లివ్’. మీరు హుందాగా బతకండి.. మరొకర్ని బతకనివ్వండి’’ అని అక్షర ఆగ్రహావేదన వ్యక్తం చేశారు.