ఖరీదైన ఫ్లాట్ కొన్న స్టార్ హీరోయిన్ కుమార్తె! | Kamal Haasan Daughter Akshara Buys RS 15.75 Crore Apartment In Khar | Sakshi
Sakshi News home page

Akshara: లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన స్టార్ హీరో కూతురు.. ఎన్ని కోట్లంటే?

Published Fri, Nov 3 2023 3:34 PM | Last Updated on Fri, Nov 3 2023 5:10 PM

Kamal Haasan Daughter Akshara Buys RS 15.75 Crore Apartment In Khar - Sakshi

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్, సారికల కూతురు అక్షర హాసన్ గురించి చాలామందికి తెలియదు. అక్షర సినిమాల్లో నటించినప్పటికీ శృతిహాసన్‌లా గుర్తింపు రాలేదు. 2015లో షమితాబ్ సినిమాతో అక్షర ఎంట్రీ ఇచ్చింది. ఆమె హిందీ, తమిళం, తెలుగు చిత్రాల్లో నటించింది. వివేగం,  లాలీకీ షాదీ మే లాడ్డూ దీవానా అనే సినిమాల్లో కనిపించింది.

‍అయితే ప్రస్తుతం ముంబయిలో ఉంటున్న అక్షర హాసన్.. ఖార్‌ ప్రాంతంలో ఓ లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. దాని విలువ దాదాపు రూ.15.75 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 15 అంతస్తులున్న టవర్‌లో 13వ ఫ్లోర్‌లో ఇంటిని కొనుగోలు చేసింది. కాగా.. అక్షర ప్రస్తుతం  తన తల్లి సారికతో కలిసి ముంబయిలో నివసిస్తోంది. కమల్‌ హాసన్‌తో 2004లో సారిక ఠాకూర్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 

అక్షర 2015లో బాలీవుడ్ చిత్రం షమితాబ్‌లో అమితాబ్ బచ్చన్, ధనుష్‌లతో కలిసి నటించింది. ఆమె చివరిగా తమిళ చిత్రం అచ్చం మేడం నానం పయిర్పులో కనిపించింది. అక్షర హాసన్ కేవలం నటనే కాదు.. పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. మహిళల హక్కుల కోసం, లింగ సమానత్వం, మహిళ మానసిక ఆరోగ్యం వంటి సమస్యలపై పోరాటం చేస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement