Samantha Decided To Buy Luxurious Apartment In Mumbai Worth Rs.15 Crore, Deets Inside - Sakshi
Sakshi News home page

Samantha: అక్కడ ఖరీదైన ఫ్లాట్ కొంటున్న సమంత.. అందుకోసమేనట!

Published Wed, Feb 8 2023 3:38 PM | Last Updated on Wed, Feb 8 2023 6:42 PM

Samantha Decided To buy luxurious apartment in Mumbai worth RS.15 crore - Sakshi

సమంత ఇప్పుడిప్పుడే మెల్లగా సినిమాలపై దృష్టి సారించింది. కొన్ని నెలలుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడిన సామ్ ఆ తర్వాత కోలుకుంది. యశోద మూవీ సక్సెస్ తర్వాత మరే ప్రాజెక్ట్‌లోనూ నటించలేదు. ప్రస్తుతం సమతం శాకుంతలం, సిటాడెల్ చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్‌లో తెరకెక్కిస్తున్నా సిటాడెల్ సినిమా కోసం ముంబయిలోనే ఉండనున్నట్లు సమాచారం. గతేడాది యశోద చిత్రంతో ప్రేక్షకులను అలరించింది సామ్. 

తాజాగా సమంత ముంబయిలో రూ.15 కోట్ల విలువైన విలాసవంతమైన ఫ్లాట్‌ను కొనుగోలు చేయడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వర్క్ కమిట్ మెంట్స్ కోసం ముంబైలో ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోంది. అందువల్లనే సామ్ ఫ్లాట్ తీసుకునేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై సమంత నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే గతంలోనూ సమంత ముంబయికి మారుతున్నట్లు వార్తలొచ్చాయి. గతంలో హైదరాబాద్‌తో తనకు ప్రత్యేక ‍అనుబంధం ఉందని సామ్ వెల్లడించింది. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. శాకుంతలం, సిటాడెల్‌తో పాటు విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ చిత్రంలోనూ కనిపించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement