Khar
-
ఖరీదైన ఫ్లాట్ కొన్న స్టార్ హీరోయిన్ కుమార్తె!
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్, సారికల కూతురు అక్షర హాసన్ గురించి చాలామందికి తెలియదు. అక్షర సినిమాల్లో నటించినప్పటికీ శృతిహాసన్‌లా గుర్తింపు రాలేదు. 2015లో షమితాబ్ సినిమాతో అక్షర ఎంట్రీ ఇచ్చింది. ఆమె హిందీ, తమిళం, తెలుగు చిత్రాల్లో నటించింది. వివేగం, లాలీకీ షాదీ మే లాడ్డూ దీవానా అనే సినిమాల్లో కనిపించింది. అయితే ప్రస్తుతం ముంబయిలో ఉంటున్న అక్షర హాసన్.. ఖార్ ప్రాంతంలో ఓ లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. దాని విలువ దాదాపు రూ.15.75 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 15 అంతస్తులున్న టవర్‌లో 13వ ఫ్లోర్లో ఇంటిని కొనుగోలు చేసింది. కాగా.. అక్షర ప్రస్తుతం తన తల్లి సారికతో కలిసి ముంబయిలో నివసిస్తోంది. కమల్ హాసన్‌తో 2004లో సారిక ఠాకూర్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అక్షర 2015లో బాలీవుడ్ చిత్రం షమితాబ్లో అమితాబ్ బచ్చన్, ధనుష్‌లతో కలిసి నటించింది. ఆమె చివరిగా తమిళ చిత్రం అచ్చం మేడం నానం పయిర్పులో కనిపించింది. అక్షర హాసన్ కేవలం నటనే కాదు.. పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. మహిళల హక్కుల కోసం, లింగ సమానత్వం, మహిళ మానసిక ఆరోగ్యం వంటి సమస్యలపై పోరాటం చేస్తోంది. View this post on Instagram A post shared by Akshara Haasan (@aksharaa.haasan) -
ముంబైలో హైడ్రామా.. ఎంపీ నవనీత్ కౌర్ అరెస్ట్
ముంబై: మాజీ నటి, ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలు హనుమాన్ చాలీసా చాలెంజ్‌తో ముంబైలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన విషయం తెలిసిందే. వీళ్లకు కౌంటర్‌గా శివ సేన కార్యకర్తలు రంగంలోకి దిగడంతో.. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో హైటెన్షన్ నెలకొంది. ఎంపీ నవనీత్ కౌర్ ఇంటి ముట్టడికి శివసేన శ్రేణులు యత్నించగా.. ఏం జరుగుతుందో అనే ఆందోళన ఏర్పడింది. ఈ తరుణంలో..ఎంపీ నవనీత్ కౌర్ దంపతులను శనివారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 153-ఏ ప్రకారం.. నవనీత్ కౌర్ దంపతులను అరెస్ట్ చేసి ఖార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ వారిని విచారిస్తున్నట్లుగా సమాచారం. పోలీసుల చర్యపై నవనీత్ కౌర్ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తామేమీ ఉగ్రవాద చర్యలకు పాల్పడటం లేదని, సీఎం ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని మాత్రమే చెబుతున్నామంటూ వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే సీఎం నివాసం ముందు ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు వారికి సర్దిచెప్పే యత్నం చేస్తున్నారు. ఆపై ఎమ్మెల్యే రవి రానా, ఆయన భార్య ఎంపీ నవనీత్ కౌర్‌లు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేతో పాటు రవాణా శాఖ మంత్రి అనిల్ పరబ్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ల మీద పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా నవనీత్ కౌర్ ప్రకటన, ఆ తర్వాత పోలీసుల చర్యలతో ముంబైలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. హనుమాన్ జయంతి సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే హనుమాన్ చాలీసా పఠించాలని, లేకపోతే తామే సీఎం ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రానాలు ప్రకటించిన నేపథ్యంలోనే ఈ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. చదవండి👉🏾: బీజేపీ అండతో నవనీత్ కౌర్ రెచ్చిపోతోంది -
నేరుగా షిరిడి సాయిబాబాతో మాట్లాడుతానంటూ..
ముంబై : రోగాలు నయం చేస్తా, కుటుంబ సభ్యుల చిక్కులన్ని తొలగిస్తానంటూ ఓ మహిళను నమ్మించి రూ. 12.75లక్షలు దోచుకెళ్లిందో దొంగ సన్యాసిని. అంతేకాకుండా షిరిడి బాబాతో మాట్లాడి సమస్యలన్ని తీరుస్తానంటూ పూజ పేరుతో లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆలస్యంగా మోసాన్ని గమనించిన సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ స్వయం ప్రకటిత సన్యాసిని జైలుపాలయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన కిరణ్ దారువాలా అలియాస్ గురుమ తనకు తాను దైవాంశ సంభుతురాలికిగా ప్రకటించుకొని అమాయక ప్రజలకు మోసం చేస్తుండేది. నగరంలోని ఖార్ పశ్చిమ ప్రాంతానికి చెందిన ఓ 34 ఏళ్ల మహిళ ఇటీవల ఆ సన్యాసిని సంప్రదించింది. తన అత్తగారి ఆరోగ్యం బాగాలేదని, అలాగే ఇంట్లో తరచూ సమస్యలు ఎదురవుతున్నాయని వాటిని తొలగించాలని ఆ సన్యాసికి కోరింది. బాదిత మహిళ బలహీనతల్ని ఆసరా చేసుకున్న దొంగ సన్యాసిని.. తన దైవ శక్తులతో అన్ని సమస్యలను తొలగిస్తానని నమ్మపలికింది. షిరిడి బాబాతో నేరుగా మాట్లాడి సమస్యలను తొలగిస్తానని నమ్మించిది. గత జన్మలో సదరు మహిళ, ఆమె భర్త పాపాలు చేశారని, దాని ఫలితంగానే ఇప్పుడు సమస్యలు వచ్చాయని మాయమాటలుతో నమ్మపలికింది. అవన్నీ తొలగిపోవాలంటే పూజలు చేయాలని, దానికి ఖర్చు అవుతుందని మొత్తంగా రూ. 12.75లక్షలు రాబట్టింది. మరోవైపు పూజ పేరుతో మహిళపై సన్యాసిని లైంగికదాడికి పాల్పడింది. చివరకు ఆమె మోసాన్ని గమనించిన మహిళ పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిరణ్ దారువాలను అరెస్ట్ చేశారు. -
ఖార్ రైల్వే స్టేషన్ @ 90
ముంబై: నగర ప్రజలకు విశేష సేవలందిస్తున్న ఖార్ రైల్వేస్టేషన్ ఏర్పాటుచేసి ఇప్పటికి 90 ఏళ్లు నిండాయి. బాంద్రా పట్టణానికి అనుబంధంగా ఏర్పడిన ఈ స్టేషన్‌ను 1924 జూలై ఒకటో తేదీన ప్రారంభించారు. నగరాభివృద్ధికి అనుగుణంగా అంచెలంచెలుగా వృద్ధి చెందుతూ వస్తున్న ఈ స్టేషన్‌ను ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 85 వేలమంది ఆశ్రయిస్తున్నారు. ఉత్తర బాంద్రాలో ముంబై అభివృద్ధి శాఖ చేపట్టిన పలు పథకాల అమలుకు అవసరమైన సేవలందించేందుకు ఈ స్టేషన్‌ను మొదట ఏర్పాటుచేశారని పశ్చిమ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఖార్‌లో నగరావసరాలకు గాను గృహ నిర్మాణ పథకం కింద పదివేల జనాభాకు సరిపడా 842 ఫ్లాట్లను నిర్మించారు. అంతేకాక ప్రఖ్యాత పాలి హిల్ ప్రాంత వాసులకు కూడా ఈ ఖార్ స్టేషన్ అనుకూలంగా మారింది. మొదట్లో ఈ స్టేషన్‌ను రోజూ సుమారు 1,700 మంది వినియోగించుకుంటారని పశ్చిమ రైల్వేఅధికారులు అంచనా వేశారు.అయితే తర్వాత కాలంలో నగరీకరణ నేపథ్యంలో ఈ స్టేషన్ మంచి సెంటర్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ స్టేషన్ నుంచి ప్రతిరోజూ 85 వేల మందికి పైగా రాకపోకలు సాగిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతిరోజూ 648 పశ్చిమ రైల్వే రైళ్లు, 108 హార్బర్ లైన్ రైళ్లు నిలుస్తున్నాయి. ఈ స్టేషన్‌కు ఉత్తరాన శాంతాకృజ్, దక్షిణాన బాంద్రా ఉన్నాయి. 1960 నాటికే ఈ స్టేషన్ సమీపంలో పలు కార్పొరేట్సంస్థలు, బహుళ అంతస్తుల భవనాలు, ప్రముఖ పాఠశాలలు, కాలేజీలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం ఖార్ ప్రాంతం పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఇతర సెలబ్రిటీలకు నివాసప్రాంతంగా మారింది.