పెళ్లికి ముందే గర్భవతి అయితే? అప్పటివరకూ ప్రేమగా ఉన్న ప్రియుడు తండ్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడానికి ఇష్టపడకపోతే..
పెళ్లికి ముందే గర్భవతి అయితే? అప్పటివరకూ ప్రేమగా ఉన్న ప్రియుడు తండ్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడానికి ఇష్టపడకపోతే.. అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ బాధ ఎలా ఉంటుందో అక్షరా హాసన్ అనుభవించారు. అయితే రియల్ లైఫ్‌లో కాదు. ‘లాలీ కీ షాదీ మే లడ్డూ దీవానా’ అనే హిందీ చిత్రంలో అక్షర ఈ పాత్ర చేశారు. కెరీర్ ఆరంభించిన తక్కువ సమయంలో, అది కూడా పాతికేళ్ల వయసులో ఇలాంటి పాత్ర చేయడానికి చాలామంది నాయికలు ఇష్టపడరు.
కానీ, ఈ క్యారెక్టర్ ద్వారా మంచి సందేశం ఇచ్చే వీలు ఉందని అక్షర ఒప్పుకున్నారు. ఆ విషయం గురించి ఆమె చెబుతూ – ‘‘పెళ్లికి ముందే తల్లయితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయనేది చూపించే చిత్రం ఇది. ప్రెగ్నెంట్ లేడీస్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. అందుకని ఈ పాత్ర ఎలా చేయాలా? అని ఆలోచించాను. లక్కీగా తల్లిగా ఎలా నడుచుకోవాలో మా అమ్మ (నటి సారిక) నేర్పించింది. కచ్చితంగా నా నటన అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నా’’ అన్నారు.