అశ్లీల దృశ్యాలను ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేశాడా? | Akshara Haasan private pics leaked: Ex-boyfriend Tanuj Virwani | Sakshi
Sakshi News home page

అశ్లీల దృశ్యాలను ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేశాడా?

Published Sun, Nov 18 2018 11:59 AM | Last Updated on Tue, Sep 3 2019 8:44 PM

Akshara Haasan private pics leaked: Ex-boyfriend Tanuj Virwani  - Sakshi

ఆ అశ్లీల ఫొటోల వ్యవహారంలో అక్షరహాసన్‌ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పెరంబూరు: నటి అక్షరహాసన్‌ మాజీ ప్రియుడే ఆమె అశ్లీల దృశ్యాలను ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేశాడా? అనే అంశం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. నటుడు కమల్‌హాసన్‌ రెండవ కూతురు అక్షరహాసన్‌. బాలీవుడ్, కోలీవుడ్‌ల్లో నటిగా పరిచయం అయిన ఈ అమ్మడు కొంత కాలం నటుడు తనూజ్‌తో ప్రేమ కలాపాలను సాగించింది. గత ఏడాదే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో బ్రేకప్‌ చెప్పేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో నటి అక్షరహాసన్‌ ఆంతరంగ దృశ్యాలు ఇంటర్నెట్‌లో ప్రసారం అయ్యి కలకలం రేపాయి. 

దీంతో ఆ అశ్లీల ఫొటోల వ్యవహారంలో అక్షరహాసన్‌ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అక్షరహాసన్, తనూజ్‌ ప్రేమ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తనూజ్‌ ఎవరో కాదు ఒకప్పుడు హీరోయిన్‌గా వెలిగిన నటి రతీఅగ్నిహోత్రి పుత్రుడు. అతను, అక్షరహాసన్‌ 2013లోనే ప్రేమలో మునిగిపోయారు. అలా ఐదేళ్ల పాటు సాగిన ఈ సంచలన జంట ప్రేమ 2017లో బ్రేకప్‌ అనే మూడక్షరాల పదంతో ముగిసింది. అయితే వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలిన సమయంలో తీసుకున్న ఆంతరంగిక ఫోటోలు ఒకరి సెల్‌ఫోన్‌కు మరోకరు షేర్‌ చేసుకున్నారట. ఆ ఫోటోలను ఇప్పుడు అక్షరహాసన్‌ మాజీ ప్రియుడు ఇంటర్నెట్‌లో విడుదల చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

దీనిపై తనూజ్‌ తరఫు వ్యక్తి మీడియాకు వివరణ ఇచ్చాడు. తనూజ్‌ అక్షరహాసన్‌ ప్రేమించుకున్న మాట నిజమేనన్నారు. అదే విధంగా వారిద్దరూ ఆంతరంగిక దృశ్యాలను సెల్‌ఫోన్‌లో పొందుపరిచిన విషయం వాస్తవమేనన్నారు. అయితే తనూజ్, అక్షర్ల విడిపోయినా వారి మధ్య ఇప్పటీకి స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు. అందుకు రెండు రోజుల క్రితం వారిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు ఆధారాలు కావాలంటే చూపడానికి సిద్దం అని పేర్కొన్నారు. అక్షర ఆంతరంగిక దృశ్యాలను తనూజ్‌ ఎలాంటి సోషల్‌ మాధ్యమాల్లోనూ విడుదల చేయలేదన్నారు.  పోలీసులు తనూజ్‌ను విచారించలేదన్నారు. ఒక వేళ విచారించినా, తన నిజాయితీని నిరూపించుకోవడానికి తనూజ్‌ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement