శ్రుతీహాసన్
‘‘మీరు (ఫ్యాన్స్) చూపించే ప్రేమ.. ఐస్‌క్రీమ్... ‘యాంకర్ మ్యాన్’ (అమెరికన్ కామెడీ సినిమా)... నన్ను ఉల్లాసంగా, ఉత్సాహంగా మార్చడానికి ఇవి చాలు’’ అంటున్నారు శ్రుతీహాసన్. ‘ప్రశ్నలు అడగండి.. సమాధానం చెబుతా’ అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు ఈ బ్యూటీ. ఆ చిట్ చాట్‌లో కొన్ని ప్రశ్నలు–జవాబులు.
♦మీ నాన్న (కమల్ హాసన్) గారి నుంచి నేర్చుకున్న మూడు విషయాలు?
ప్రత్యేకంగా ఈ మూడు అని చెప్పలేను. చాలా ఉన్నాయి. నిర్భయంగా ఉండటం నేర్చుకున్నాను. జీవితం ఉల్లాసంగా సాగాలంటే హాస్యం ముఖ్యం అని కూడా నాన్న నుంచి తెలుసుకున్నాను.
♦మిమ్మల్ని నెగటివ్ రోల్స్‌లో చూడాలని ఉంది..
చేయాలని నాకూ ఉంది. కానీ కరెక్ట్‌గా కుదరాలి. ఏదో నెగటివ్ రోల్ చేయాలి కదా అని ఏది పడితే అది చేయకూడదు.
♦అదృష్టాన్ని నమ్ముతారా?
అంతకన్నా ఎక్కువగా హార్డ్‌వర్క్‌ని, మంచి అవకాశాలను నమ్ముతాను.
♦బాధని అధిగ మించడానికి ఏం చేస్తారు?
దేవుడిని పూజిస్తాను. ఫ్రెండ్‌తో మాట్లాడతాను. కొన్నిసార్లు ఏడుస్తాను... ఆ కన్నీళ్లల్లో నా బాధ కూడా కరిగిపోతుంది.
♦సంగీతంపరంగా ఏ దశాబ్దం బెస్ట్ అనుకుంటున్నారు?
ప్రతి డికేడ్‌లోనూ మంచి సంగీతం వింటున్నాం. అయితే 1970 బెస్ట్ అంటాను.
♦జీవితం ఎలా ఉంది?
ప్రతిరోజూ ఓ కొత్త పాఠం నేర్చుకుంటున్నాను. కొన్ని క్లిష్టమైనవి.. కొన్ని అందమైనవి. మొత్తం మీద జీవితం అద్భుతంగా ఉంది.
♦మిమ్మల్ని ఆనందపరిచే విషయం?
నాకు బోలెడంత ఆనందాన్ని ఇచ్చేది ‘నిజాయతీ’ అనేది ఇన్నేళ్లల్లో నేను నేర్చుకున్న ఓ పాఠం.
Comments
Please login to add a commentAdd a comment