అతడితో డేటింగ్ చేశా | Akshara Haasan Dating with Vivaan Shah | Sakshi
Sakshi News home page

అతడితో డేటింగ్ చేశా

Published Fri, Jan 30 2015 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM

అతడితో డేటింగ్ చేశా

అతడితో డేటింగ్ చేశా

అమ్మానాన్నలు విడిపోవడం, వారి మధ్య దూరం నాకు ధైర్యానిచ్చిందంటోంది నవనటి అక్షర. ప్రఖ్యాత కమలహాసన్ చిన్న కూతురు అక్షర, అక్క శ్రుతిహాసన్ మాదిరిగానే తొలుత బాలీవుడ్‌లో తెరంగేట్రం చేస్తోంది. అక్షర అక్కడ నటిగా నిలదొక్కుకున్న తరువాత తమిళ చిత్రాలు చేస్తానంటున్నారు. ఈమె ధనుష్ సరసన నటించిన హిందీ చిత్రం షమితాబ్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అక్షర తన మనోభావాలను పంచుకంటూ తన పదేళ్ల ప్రాయంలోనే అమ్మా నాన్న విడిపోయారని చెప్పారు.
 
 దాంతో తాను, అక్క శ్రుతి అమ్మ వద్దే పెరిగామని తెలిపారు. అయినా నాన్నతో సన్నిహితంగానే మెలిగామని చెప్పారు. తనకు మాత్రం అమ్మనే రాణి అని నాన్న తమతో చాలా సరదాగా ప్రవర్తిస్తారన్నారు. అమ్మనాన్నల ముద్దుబిడ్డగా తాను పెరిగానని తెలిపారు. దేవాలయాలు, చర్చిలను మాత్రం దర్శిస్తానని చెప్పారు. అక్కడ ఏదో ఒక శక్తి ఉంటుందనిపిస్తుందన్నారు. చిన్న వయసు నుంచే నృత్యం అంటే ఆసక్తి అని అందుకే సంప్రదాయ నృత్యం భరత నాట్యం నుంచి పాశ్చాత్య నృత్యాల వరకు నేర్చుకున్నానని తెలిపారు.
 
 అమ్మానాన్నలు విడిపోవడం వల్ల తాను ఎవరన్న విషయాన్ని అర్థం అయ్యేలా చేసిందన్నారు. అదే తనకు ధైర్యాన్ని కలిగించిందని చెప్పారు. అక్క శ్రుతిహాసన్ తన కెప్పుడూ రక్షణగానే నిలుస్తుందన్నారు. దర్శకత్వం చేయాలనే ఆశ తగ్గలేదని, కథలు కూడా సిద్ధం చేసుకుంటున్నానని చెప్పారు. ఈ ప్రతిభ నాన్న నుంచే అబ్బిందని చెప్పారు. తమిళ చిత్రాల్లో నటించాలనే ఆసక్తి ఉన్నా ప్రస్తుతం బాలీవుడ్‌లో నటిగా నిలదొక్కుకోవాలన్నారు. తాను హిందీనటుడు వివన్‌షాతో డేటింగ్ చేశానని, అయితే ప్రస్తుతం స్నేహితులుగా మాత్రమే నడుచుకుంటున్నామని పేర్కొన్నారు. తాను కఠిన శ్రమ జీవి అని ఆత్మవిశ్వాసం అధికం అని అక్షర పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement