vivaan shah
-
బాయ్‌ఫ్రెండ్‌తో అక్షరహాసన్ రొమాన్స్
బాయ్‌ఫ్రెండ్‌తో సినిమాలో రొమాన్స్ చేసే అవకాశం హీరోయిన్లకు రావడం అన్నది అరుదైన విషయమే. అలాంటి అవకాశాన్ని వర్ధమాన నటి అక్షరహాసన్ దక్కించుకున్నారు. శ్రుతీహాసన్,అక్షరహాసన్ విశ్వనటుడు కమలహాసన్ వారసులన్న విషయం తెలిసిందే. శ్రుతిహాసన్ నటిగా తన సినీ జీవితాన్ని లక్ అనే హిందీ చిత్రం ద్వారా ప్రారంభించారు. ఆ చిత్రం ఆమెకు అందాలారబోతలో శ్రుతి మించారనే విమర్శలను మిగిల్చింది మినహా విజయాన్ని మాత్రం అందించలేదు. అదే విధంగా తెలుగు, తమిళ భాషల్లో నటించిన తొలి చిత్రాలు శ్రుతిని నిరాశపరచాయి. అలాంటి శ్రుతిహాసన్ ప్రస్తుతం క్రేజీ స్టార్ దూసుకుపోతున్నారు. ఇక అక్షరహాసన్ కూడా అక్క బాటలోనే పయనించే విధంగా తన నట జీవితాన్ని బాలీవుడ్ నుంచే మొదలెట్టారు. షమితాబ్ అనే హిందీ చిత్రంలో ఏకంగా బిగ్‌బీతోనే నటించారు. అందులో కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ కూడా నటించారు. అయితే మంచి చిత్రం అంటూ విమర్శకుల ప్రశంసలు పొందింది గానీ కమర్షియల్‌గా విజయం సాధించలేదు. దీంతో తన తొలి చిత్ర రిజల్ట్‌ను పెద్దగా ఆశించిన అక్షరకు నిరావనే మిగిలింది. మంచి చిత్రం కన్నా మంచి విజయమే పేరుకు, మరిన్ని అవకాశాలకు దోహదం చేస్తుందన్నది జీర్ణించుకోలేని నిజం. అక్షర విషయంలోనూ అదే జరిగింది. షమితాబ్ తరువాత మరో అవకాశం రాలేదు. తాజాగా ఒక చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. అదీ తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి యువ హిందీ నటుడు వివాన్షాకు,అక్షరహాసన్‌కు మధ్య ప్రేమాయణం నడుస్తోందన్న ప్రచారం హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. వివాన్‌షా ప్రముఖ బాలీవుడ్ నటుడు నజీరుద్దీన్‌షా కొడుకు అన్నది గమనార్హం. ఆయన ఇప్పటికే కొన్ని చిత్రాల్లో నటించారు. తాజాగా తన ప్రియురాలుగా ప్రచారంలో ఉన్న అక్షరతో కలిసి తెరపై రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రముఖ హిందీ దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి శిష్యుడు మనీష్ హరిశంకర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి లాలీ కీ షాదీమెన్ లట్టి దివాన్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. తొలి చిత్రం నిరాశకు గురిచేసినా మలి చిత్రం అక్షర నట జీవితంలో ఆశలు చిగురింపజేయాలని కోరుకుందాం. -
అతడితో డేటింగ్ చేశా
అమ్మానాన్నలు విడిపోవడం, వారి మధ్య దూరం నాకు ధైర్యానిచ్చిందంటోంది నవనటి అక్షర. ప్రఖ్యాత కమలహాసన్ చిన్న కూతురు అక్షర, అక్క శ్రుతిహాసన్ మాదిరిగానే తొలుత బాలీవుడ్లో తెరంగేట్రం చేస్తోంది. అక్షర అక్కడ నటిగా నిలదొక్కుకున్న తరువాత తమిళ చిత్రాలు చేస్తానంటున్నారు. ఈమె ధనుష్ సరసన నటించిన హిందీ చిత్రం షమితాబ్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అక్షర తన మనోభావాలను పంచుకంటూ తన పదేళ్ల ప్రాయంలోనే అమ్మా నాన్న విడిపోయారని చెప్పారు. దాంతో తాను, అక్క శ్రుతి అమ్మ వద్దే పెరిగామని తెలిపారు. అయినా నాన్నతో సన్నిహితంగానే మెలిగామని చెప్పారు. తనకు మాత్రం అమ్మనే రాణి అని నాన్న తమతో చాలా సరదాగా ప్రవర్తిస్తారన్నారు. అమ్మనాన్నల ముద్దుబిడ్డగా తాను పెరిగానని తెలిపారు. దేవాలయాలు, చర్చిలను మాత్రం దర్శిస్తానని చెప్పారు. అక్కడ ఏదో ఒక శక్తి ఉంటుందనిపిస్తుందన్నారు. చిన్న వయసు నుంచే నృత్యం అంటే ఆసక్తి అని అందుకే సంప్రదాయ నృత్యం భరత నాట్యం నుంచి పాశ్చాత్య నృత్యాల వరకు నేర్చుకున్నానని తెలిపారు. అమ్మానాన్నలు విడిపోవడం వల్ల తాను ఎవరన్న విషయాన్ని అర్థం అయ్యేలా చేసిందన్నారు. అదే తనకు ధైర్యాన్ని కలిగించిందని చెప్పారు. అక్క శ్రుతిహాసన్ తన కెప్పుడూ రక్షణగానే నిలుస్తుందన్నారు. దర్శకత్వం చేయాలనే ఆశ తగ్గలేదని, కథలు కూడా సిద్ధం చేసుకుంటున్నానని చెప్పారు. ఈ ప్రతిభ నాన్న నుంచే అబ్బిందని చెప్పారు. తమిళ చిత్రాల్లో నటించాలనే ఆసక్తి ఉన్నా ప్రస్తుతం బాలీవుడ్లో నటిగా నిలదొక్కుకోవాలన్నారు. తాను హిందీనటుడు వివన్షాతో డేటింగ్ చేశానని, అయితే ప్రస్తుతం స్నేహితులుగా మాత్రమే నడుచుకుంటున్నామని పేర్కొన్నారు. తాను కఠిన శ్రమ జీవి అని ఆత్మవిశ్వాసం అధికం అని అక్షర పేర్కొన్నారు. -
అక్షరతో చెట్టపట్టాల్!
బాలీవుడ్ బాత్‌లో ఇప్పుడు లేటెస్ట్ టాక్ కమల్‌హాసన్ కూతురు అక్షర, వివాన్‌షాల రిలేషన్షిప్. ఇద్దరూ కలసి చెట్టపట్టాలేసుకుని తిరిగేస్తున్నారని అక్కడి మీడియా కోడై కూస్తోంది. ఇదే విషయాన్ని వివాన్ను అడిగితే... ‘దీనిపై కామెంట్ చేయడం నాకిష్టం లేదు’ అన్నాడే గానీ, ఖండించలేదట. ‘ప్రస్తుతం హ్యాపీ న్యూ ఇయర్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నా’ అని అడక్కుండానే చెప్పేశాడు. ఇంతకీ వివాన్ ఎవరనేగా..! క్యారెక్టర్ నటుడు నజరుద్దీన్ షా తనయుడు. షారూఖ్, దీపికలతో చేయడం ఓ చక్కని అనుభూతంటున్నాడీ కుర్రాడు.