
అక్షరతో చెట్టపట్టాల్!
బాలీవుడ్ బాత్‌లో ఇప్పుడు లేటెస్ట్ టాక్ కమల్‌హాసన్ కూతురు అక్షర, వివాన్‌షాల రిలేషన్‌షిప్. ఇద్దరూ కలసి చెట్టపట్టాలేసుకుని తిరిగేస్తున్నారని అక్కడి మీడియా కోడై కూస్తోంది. ఇదే విషయాన్ని వివాన్‌ను అడిగితే... ‘దీనిపై కామెంట్ చేయడం నాకిష్టం లేదు’ అన్నాడే గానీ, ఖండించలేదట. ‘ప్రస్తుతం హ్యాపీ న్యూ ఇయర్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నా’ అని అడక్కుండానే చెప్పేశాడు. ఇంతకీ వివాన్ ఎవరనేగా..! క్యారెక్టర్ నటుడు నజరుద్దీన్ షా తనయుడు. షారూఖ్, దీపికలతో చేయడం ఓ చక్కని అనుభూతంటున్నాడీ కుర్రాడు.