
ఎక్కడో... కిస్!
క్రియేటివిటీ పేరుతో రాను రాను సినిమాలు విచిత్ర పోకడలు పోతున్నట్టున్నాయి. ఇప్పటి వరకు లిప్‌లాక్‌లతో వేడి పుట్టించిన తారలు ఓ లేటెస్ట్ సీన్‌లో కాస్త ఇబ్బందికరంగా కనిపించారు. రజనీకాంత్ అల్లుడు ధనుష్, కమల్‌హాసన్ రెండో కూతురు అక్షర కలసి చేస్తున్న మూవీ ‘షమితాబ్’ రెండో ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ అయింది.
అమితాబ్ ఓ కీ రోల్ పోషిస్తున్న ఈ మూవీ అక్షరకు తెరంగేట్రం. ఈ ట్రైలర్‌లో... ధనుష్ చేష్టలతో విసుగెత్తిన అక్షర... అతడిని తన పిరుదులపై ముద్దు ఇవ్వమంటుంది. రెండో ఆలోచన లేకుండా అతగాడు వెంటనే అక్కడ ముద్దు పెట్టేస్తాడు. చూసిన సామాన్యులే కాదు... సినీ జనం కూడా స్టన్నయ్యారని సమాచారం!