బాయ్‌ఫ్రెండ్‌తో అక్షరహాసన్ రొమాన్స్ | Akshara Haasan Romance with Boy Friend Vivaan Shah | Sakshi
Sakshi News home page

బాయ్‌ఫ్రెండ్‌తో అక్షరహాసన్ రొమాన్స్

Published Mon, Dec 28 2015 2:28 AM | Last Updated on Fri, Jul 12 2019 3:07 PM

బాయ్‌ఫ్రెండ్‌తో అక్షరహాసన్ రొమాన్స్ - Sakshi

బాయ్‌ఫ్రెండ్‌తో అక్షరహాసన్ రొమాన్స్

బాయ్‌ఫ్రెండ్‌తో సినిమాలో రొమాన్స్ చేసే అవకాశం హీరోయిన్లకు రావడం అన్నది అరుదైన విషయమే. అలాంటి అవకాశాన్ని వర్ధమాన నటి అక్షరహాసన్ దక్కించుకున్నారు. శ్రుతీహాసన్,అక్షరహాసన్ విశ్వనటుడు కమలహాసన్ వారసులన్న విషయం తెలిసిందే. శ్రుతిహాసన్ నటిగా తన సినీ జీవితాన్ని లక్ అనే హిందీ చిత్రం ద్వారా ప్రారంభించారు. ఆ చిత్రం ఆమెకు అందాలారబోతలో శ్రుతి మించారనే విమర్శలను మిగిల్చింది మినహా విజయాన్ని మాత్రం అందించలేదు.

 అదే విధంగా తెలుగు, తమిళ భాషల్లో నటించిన తొలి చిత్రాలు శ్రుతిని నిరాశపరచాయి. అలాంటి శ్రుతిహాసన్ ప్రస్తుతం క్రేజీ స్టార్ దూసుకుపోతున్నారు. ఇక అక్షరహాసన్ కూడా అక్క బాటలోనే పయనించే విధంగా తన నట జీవితాన్ని బాలీవుడ్ నుంచే మొదలెట్టారు. షమితాబ్ అనే హిందీ చిత్రంలో ఏకంగా బిగ్‌బీతోనే నటించారు. అందులో కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ కూడా నటించారు. అయితే మంచి చిత్రం అంటూ విమర్శకుల ప్రశంసలు పొందింది గానీ కమర్షియల్‌గా విజయం సాధించలేదు.

దీంతో తన తొలి చిత్ర రిజల్ట్‌ను పెద్దగా ఆశించిన అక్షరకు నిరావనే మిగిలింది. మంచి చిత్రం కన్నా మంచి విజయమే పేరుకు, మరిన్ని అవకాశాలకు దోహదం చేస్తుందన్నది జీర్ణించుకోలేని నిజం. అక్షర విషయంలోనూ అదే జరిగింది. షమితాబ్ తరువాత మరో అవకాశం రాలేదు. తాజాగా ఒక చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. అదీ తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి యువ హిందీ నటుడు వివాన్‌షాకు,అక్షరహాసన్‌కు మధ్య ప్రేమాయణం నడుస్తోందన్న ప్రచారం హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.

 వివాన్‌షా ప్రముఖ బాలీవుడ్ నటుడు నజీరుద్దీన్‌షా కొడుకు అన్నది గమనార్హం. ఆయన ఇప్పటికే కొన్ని చిత్రాల్లో నటించారు. తాజాగా తన ప్రియురాలుగా ప్రచారంలో ఉన్న అక్షరతో కలిసి తెరపై రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రముఖ హిందీ దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి శిష్యుడు మనీష్ హరిశంకర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి లాలీ కీ షాదీమెన్ లట్టి దివాన్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. తొలి చిత్రం నిరాశకు గురిచేసినా మలి చిత్రం అక్షర నట జీవితంలో ఆశలు చిగురింపజేయాలని కోరుకుందాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement