అక్క బాటలో అక్షర!
అక్క బాటలో అక్షర!
Published Mon, Nov 25 2013 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 12:57 AM
‘‘మా అమ్మాయిల ఇష్టాన్ని నేనెప్పుడూ కాదనను. వాళ్లు ఏ కెరీర్‌ని సెలక్ట్ చేసుకుంటే దాన్ని ఆమోదిస్తా’’ అని కమల్‌హాసన్ పలు సందర్భాల్లో చెప్పారు. ఆ మేరకు పెద్ద కుమార్తె శ్రుతిహాసన్ హీరోయిన్ అవ్వాలనుకుంటే ‘ఎస్’ అన్నారు. ఇప్పుడు రెండో కుమార్తె అక్షరహాసన్ కథానాయిక అవ్వాలని తీసుకున్న నిర్ణయానికి కూడా ఆయన ఆమోదముద్ర వేశారు. ఆ మధ్య శ్రుతిలా అక్షర కథానాయిక అవాలనుకోవడం లేదనే వార్తలు వచ్చాయి. తను డెరైక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేయడం ఆ మాటలకు ఊతం ఇచ్చింది. అయితే, ఇప్పుడు అక్షర మనసు మార్చుకుంది. చీనీ కమ్, పా చిత్రాలతో మంచి దర్శకునిగా గుర్తింపు తెచ్చుకున్న బాల్కీ దర్శకత్వం వహించనున్న చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం కాబోతోంది అక్షరహాసన్.
ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్‌బచ్చన్ నటించనుండగా, ‘రాన్‌జనా’ ద్వారా బాలీవుడ్‌కి పరిచయమైన తమిళ హీరో ధనుష్ కూడా నటించబోతున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా పాటలు స్వరపరుస్తారు. పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం చేయబోతున్నారు. ఇదిలా ఉంటే.. శ్రుతిహాసన్ కూడా ముందుగా బాలీవుడ్ చిత్రం ద్వారానే కథానాయిక అయ్యి, దక్షిణాది సినిమాలు చేయడం మొదలుపెట్టింది. అక్క బాటలో అక్షర కూడా ముందు ఉత్తరాదివారికి పరిచయం కానుంది. సో.. ఈ తేనెకళ్ల సుందరి సౌత్‌కి కూడా వస్తుందని ఊహించవచ్చు. ఇక, అక్షర వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. మాజీ తార రతి అగ్నిహోత్రి తనయుడు తనుజ్ వీర్‌వాణీతో ప్రేమాయణం సాగిస్తోందని సమాచారం.
Advertisement
Advertisement