నేను ఎటువంటి హద్దులు పెట్టుకోలేదు:అక్షర | I don't have any limitations, says Akshara Haasan | Sakshi
Sakshi News home page

నేను ఎటువంటి హద్దులు పెట్టుకోలేదు:అక్షర

Published Sun, Feb 1 2015 2:29 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

నేను ఎటువంటి హద్దులు పెట్టుకోలేదు:అక్షర - Sakshi

నేను ఎటువంటి హద్దులు పెట్టుకోలేదు:అక్షర

ముంబై:అక్షర్ హాసన్.. ఈ మధ్యనే షమితాబ్ సినిమాతో వెండి తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తాను ఇండస్ట్రీలో ఎటువంటి హద్దులు పెట్టుకోలేదని అంటోంది.చిత్ర సీమలో ఎదగాలంటే ఫలనా మూవీనే చేయాలంటూ నియమాలు పెట్టుకోకూడదని స్పష్టం చేసింది.' మీరు హద్దులు ఏర్పరుచుకుంటే నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరడం కష్టం. ఏ పాత్ర వచ్చినా చేసేందుకు సిద్ధంగా ఉండాలి. అప్పుడే లక్ష్యాన్ని చేరుకుంటాం' అని అక్షర తెలిపింది.

 

తానైతే ఎటువంటి హద్దు ఏర్పరుచుకోకుండానే రాణిస్తానని పేర్కొంది. తనకు గత కొంత కాలంగా నటించే అవకాశాలు వస్తున్నా సరైన సమయం కోసం వేచి చూశానని తెలిపింది.తాను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా కావడం వల్ల ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేక పోయానని పేర్కొంది. ధనుష్-అమితాబ్ బచ్చన్ లు నటించిన షమితాబ్ సినిమాలో తనకు అవకాశం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement