♦ నేను నటించాలనుకునే హీరోల జాబితాలో విక్రమ్ సార్ పేరు ముందువరుసలో ఉంటుంది. ఈ సినిమాలో ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ. ఆయన రియల్ హీరో. యాక్టింగ్ పరంగా నాకు సెట్‌లో సహాయం చేశారు. ఈ సినిమాలో గర్భవతిగా నటించాను. మా నాన్నగారి బ్యానర్ (రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్‌నేషనల్)లో నటించడం హ్యాపీ. ఎన్నో స్ఫూర్తిదాయక చిత్రాలు ఈ నిర్మాణసంస్థ నుంచి రావడం వచ్చాయి. మా నాన్నగారి బ్యానర్‌లో నటించినప్పటికీ పారితోషికం తీసుకున్నాను. ఎందుకంటే పని పనే. (నవ్వుతూ).
♦ ఇందులో గర్భవతిగా నటించాల్సి వచ్చింది కాబట్టి మా అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్ సలహాలు తీసుకున్నాను.. హోమ్ వర్క్ చేశాను. ఈ పాత్రను చాలెంజింగ్‌గా తీసుకుని చేశాను. కొన్ని వర్క్‌షాప్స్ కూడా చేశాం. దర్శకుడు రాజేష్‌కి టెక్నికల్‌గా చాలా నాలెడ్జ్ ఉంది.
♦ హిందీ చిత్రం ‘షమితాబ్’ సినిమాలో అమితాబ్ బచ్చన్‌గారితో కలిసి నటించాను. కొన్ని సన్నివేశాల్లో ఈజీ, మరికొన్ని సన్నివేశాల్లో కష్టం అనిపిచింది. దర్శకుడు బాల్కీసార్, అమితాబ్‌సార్, ధనుష్... ఇలాంటి అనుభవజ్ఞులతో చేయడంతో నా పని సులభంగా తోచింది. కానీ వారి యాక్టింగ్ స్టైల్‌కు తగ్గుట్లుగా నా నటన ఎలా ఉంటుందోనన్న విషయం కష్టంగా అనిపించింది. ఆ సమయంలో కాస్త ఆందోళన అనిపించింది. నా సినిమాలను ఎంచుకునే ఫ్రీడమ్ ఉంది నాకు. కాకపోతే నేను మా అమ్మనాన్నల సలహాలు తీసుకుంటాను.
♦ ప్రస్తుతానికి దర్శకత్వం ఆలోచన లేదు. హీరోయిన్‌గా నా నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాను. యాక్టింగ్ కాకుండా.. నేను బొమ్మలు వేస్తాను. కథలు రాస్తాను.
పని పనే.. డబ్బు డబ్బే
Published Wed, Jul 17 2019 12:16 PM | Last Updated on Wed, Jul 17 2019 12:41 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment