
విక్రమ్ హీరోగా, అక్షరాహాసన్, అభిహసన్ కీలక పాత్రల్లో రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘కదరమ్ కొండన్’. రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్‌నేషనల్ నిర్మాణంలో ట్రైడెంట్ ఆర్ట్స్ కె.రవిచంద్రన్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం ‘మిస్టర్ కెకె’ పేరుతో తెలుగులో విడుదలవుతోంది. టి.అంజయ్య సమర్పణలో పారిజాత మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై టి.నరేష్ కుమార్, టి. శ్రీధర్ ఈ నెల 19న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. టి.నరేష్ కుమార్, టి శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. ప్రేక్షకులకు థ్రిల్‌ని అందించేలా సెల్వ తెరకెక్కించారు. సమర్థుడైన కమాండర్‌గా విక్రమ్ యాక్షన్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ట్రైలర్‌లో విక్రమ్ గెటప్ చాలా బాగుందని అందరూ ఒకే మాట చెబుతున్నారు. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో రూపొందించిన ఈ చిత్రంలో అక్షరాహాసన్ కూడా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించారు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment