విక్రమ్ సినిమాపై బ్యాన్‌! | Vikram's Mister KK Movie Banned in Malaysia | Sakshi
Sakshi News home page

విక్రమ్ సినిమాపై బ్యాన్‌!

Published Tue, Jul 23 2019 12:58 PM | Last Updated on Tue, Jul 23 2019 12:59 PM

Vikram's Mister KK Movie Banned in Malaysia - Sakshi

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్‌ విక్రమ్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మిస్టర్ కెకె. కోలీవుడ్ లో కదరం కొండన్‌ అనే పేరుతో రిలీజ్‌ అయిన ఈ సినిమాను తెలుగులో మిస్టర్ కెకెగా రిలీజ్‌ చేశారు. ఇటీవల రిలీజ్‌ అయిన ఈ సినిమాకు తొలి షో నుంచే నెగెటివ్‌ టాక్‌ రావటంతో మరోసారి విక్రమ్‌ అభిమానులు నిరుత్సాహపడ్డారు.

అయితే తాజాగా మిస్టర్‌ కెకె టీంకు మరో షాక్ తగిలింది. ఎక్కువ భాగం మలేషియాలో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాను మలేషియా ప్రభుత్వం నిషేదించింది. మలేషియా పోలీసులను తప్పుగా చూపించినందకు గానూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని చిత్ర మలేషియా డిస్ట్రిబ్యూటర‍్స్‌ లోటస్‌ ఫైవ్‌ స్టార్‌  సంస్థ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది.

రాజేష్ ఎం సెల్వ దర్శకత్వంలో విక్రమ్‌ హీరోగా నటించిన ఈ సినిమాను లోకనాయకుడు కమల్‌ హాసన్‌ నిర్మించారు. కమల్‌ చిన్న కూతురు అక్షరా హాసన్‌తో పాటు అభి హసన్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement