గ్లామర్‌కు మెరుగులు | akshara haasan special focus beauty | Sakshi
Sakshi News home page

గ్లామర్‌కు మెరుగులు

Published Sun, Mar 29 2015 1:02 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

గ్లామర్‌కు మెరుగులు - Sakshi

గ్లామర్‌కు మెరుగులు

 విశ్వనాయకుడు కమలహాసన్ కుటుంబం నుంచి ప్రస్తుత చివరి నట పయనం అక్షరహాసన్. ఈమె కూడా తన అక్క శ్రుతిహాసన్ మాదిరిగానే తన నట జీవితానికి బాలీవుడ్ నుంచే శ్రీకారం చుట్టారు. అయితే శ్రుతిహాసన్‌లా కాకుండా అక్షర తొలి చిత్రంతోనే పలువురు ప్రశంసల్ని, మంచి విజయాన్ని అందుకున్నారు. షమితాబ్‌లో ఒక సహాయ దర్శకురాలిగా సహజమైన నటనను ప్రదర్శించి ఆ పాత్రకు జీవం పోశారు. బాలీవుడ్ బిగ్‌బి, కోలీవుడ్ సీనియర్‌నటుడు ధనుష్‌ల మధ్య నటించడం అంత అషామాషి విషయం కాదు.
 
  అయినా అక్షర తన పాత్రను సమర్థవంతంగా పోషించారు. ఫలితం కోలీవుడ్, బాలీవుడ్‌లలో పలు అవకాశాలు ఆమె తలుపు తడుతున్నాయట. అయితే చిత్రాల ఎంపిక విషయంలో ఏ మాత్రం తొందరపడని అక్షరహాసన్ తన అందాన్ని పెంచుకునే అంశంపై ప్రత్యేక దృష్టి సారించారని సమాచారం. తొలి చిత్రం సమయంలో తన రూపంలోను, ధరించే దుస్తులపైనా ప్రత్యేక దృష్టి సారించని అక్షర చుట్టూ ప్రస్తుతం శారీరక కసరత్తులు, శిక్షకులు, కేశాలంకారణ నైపుణ్యాలు అందాన్ని మెరుగులు దిద్దే నిపుణులు అంటూ ఒక పెద్ద బృందమే చేరిపోయిందట.
 
 వీరంతా అక్షరను బాలీవుడ్ ఇండస్ట్రీకి తగ్గ ఫిగర్‌గా మార్చి చూపిస్తామని వాగ్దానాలు కూడా చేసేశారట.  సమీప కాలంలో ఈమె ముంబయిలో జరిగిన ఫ్యాషన్ షోలో ప్రముఖ మోడల్స్‌తో కలిసి కవాత్ వాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరచారట. ఈ విషయం గురించి అక్షర తెలుపుతూ ఒక నటికి దుస్తులు, అలంకార వస్తువులపై శ్రద్ధ ఎంత  అవసరం అన్నది తెలుసుకున్నానన్నారు. ఒకపక్క గ్లామర్‌లో తన సోదరి శ్రుతి దుమ్మురేపుతుండడంతో అక్షరకు అలాంటి ఆశ పుట్టడమే మార్పుకు కారణం కావచ్చునంటున్నారు కోలీవుడ్ వర్గాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement