కమలహాసన్ చిత్రంలో అక్షర | akshara in the movie of kamal haasan | Sakshi
Sakshi News home page

కమలహాసన్ చిత్రంలో అక్షర

Published Sat, Feb 28 2015 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM

కమలహాసన్ చిత్రంలో అక్షర

కమలహాసన్ చిత్రంలో అక్షర

అందరికీ ఆసక్తిని రేకెత్తించే ఒక క్రేజీ కాంబినేషన్‌లో చిత్రం రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. విశ్వనాయకుడు కమలహాసన్ చిత్రం అంటేనే అందులో అనేక విశేషాలు పొందుపరచి ఉంటాయని అంటుంటారు. మరి అలాంటి నటుడితో ఆయన రెండో కూతురు ప్రస్తుతం వరుస విజయాలతో మంచి జోరుమీదున్న నటుడు ధనుష్ లాంటి వారు కలిస్తే ఇది నిజంగా క్రేజీ చిత్రమే అవుతుంది కదు. మరి ఈ భారీ చిత్రాన్ని నిర్మించేదెవరు? దర్శకత్వం చేపట్టేదెవరు? లాంటి వివరాలు తెలుసుకోవాలని ఎవరికైనా ఆసక్తి ఉంటుందికదా.. కమలహాసన్ చిత్రంలో నటించాలనే ఆసక్తిని ఆయన పెద్ద కూతురు నేటి క్రేజీ హీరోయిన్ శ్రతిహాసన్ చాలా కాలంగా వ్యక్తం చేస్తున్నారు.

ఆ మధ్య అలాంటి ఒక అవకాశం వచ్చినా ఆమె ఇతర చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇటీవల హిందీ చిత్రం షమితాబ్ ద్వారా నాయకిగా తెరంగేట్రం అయిన తొలి చిత్రంతోనే చక్కని అభినయంతో ప్రతిభను చాటుకున్న కమల్ రెండో కూతురు అక్షర ఆయనతో నటించే అవకాశం కలిగే తరుణం ఆసన్నమైందన్నది తాజా సమాచారం. ఈ సంచలన చిత్రాన్ని యువ నటుడు ధనుష్ నిర్మించడానికి రెడీ అవుతున్నారు. ఇందులో ఆయన ఒక ముఖ్య భూమికను పోషించనున్నారు. నటి అక్షరహాసన్‌కు కూడా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement