ఇళయరాజాకు ఘన సత్కారం
నేనెప్పటికీ ఇళయరాజానే అందులో ఏమార్పూ ఉండదు అంటున్నారు ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజ. ఈ సంగీత మాంత్రికుడిని ఇప్పటికే పలు అవార్డులు వరించాయి. తాజాగా తరైతప్పట్టై చిత్రంతో వెయి చిత్రాలకు సంగీతా న్ని అందించి అసాధారణ రికార్డును సాధించి ఘన సత్కారాన్ని అందుకున్నారు. ప్రఖ్యాత నటుడు అమితాబ్‌బచ్చన్, ధనుష్, అక్షరహాసన్ జంటగా నటించిన హిందీ చిత్రం షమితాబ్‌కు సంగీతాన్ని అందించారు. వెయ్యి చిత్రాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమితాబ్ బచ్చన్ మంగళవారం ముంబయిలో ఇళయరాజాను ఘనంగా సత్కరించారు.
షమితాబ్ చిత్ర ఆడియో ఆవిష్కరణ ఈ అభినందన వేడుకకు వేదికైంది. బుధవారం చెన్నైకి తిరిగి వచ్చిన ఇళయరాజా చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో ముచ్చటిస్తూ తనకు తెలియకుండానే బాలీవుడ్ బిగ్‌బి ముంబయిలో అభినందన సభ ఏర్పాటు చేశారని తెలిపారు. వేదికపైన తనకంటే ముందే రజనీకాంత్, కమలహాసన్ లాంటి ప్రఖ్యాత నటులు ఆశీస్సులైవున్నారని తెలిపారు. వాళ్లంతా తనను ప్రశంసిస్తూ మాట్లాడడం సంతోషం కలిగించిందన్నారు. అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఇళయరాజా ఇలా బదులిచ్చారు.
ప్రశ్న: నేటి తరం సంగీత దర్శకులు చాలామంది రాత్రి 11 గంటలకు సంగీతాన్నిఅందిస్తున్నారు. ఇకపై మీరు ఈ తరహా బాణిని అవలంభిస్తారా?
జవాబు: నేనెప్పుడూ ఇళయరాజానే. నాలో ఎలాంటి మార్పు ఉండదు. నాకంటూ కొందరు నిర్మాతలు ఉన్నారు. ఇంతకుముందు ఎలాగైతే వేకువజామును నాలుగు లేక ఐదుగంటలకు సంగీతాన్ని మొదలెట్టే వాడినో ఇకపై కూడా తన దినచర్య అలానే కొనసాగుతుంది.