అజిత్‌ కంటే ముందే.. | Before Ajit ..Akshara Haasan | Sakshi
Sakshi News home page

అజిత్‌ కంటే ముందే..

Published Mon, May 15 2017 1:55 AM | Last Updated on Tue, Sep 5 2017 11:09 AM

అజిత్‌ కంటే ముందే..

అజిత్‌ కంటే ముందే..

విజయాల క్రెడిట్‌ను ఓన్‌ చేసుకోవడం, అపజయాలకు ఇతరులను బాధ్యుల్ని చేయడం తెలివైన వారి పని. కమలహాసన్‌ రెండో కూతురు అక్షరహాసన్‌ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారనిపిస్తోంది. ఈ బ్యూటీ తన అక్క శ్రుతీహాసన్‌ మాదిరిగానే నటిగా తొలుత బాలీవుడ్‌లో పరిచయం అయ్యారు. ఆ తరువాతనే ఇప్పుడు వివేకం చిత్రంతో కోలీవుడ్‌కు రానున్నారు. ఇందులో అజిత్‌ కథానాయకుడు, కాజల్‌అగర్వాల్‌ నాయకి. కాగా ఈ చిత్ర టీజర్‌ ఇటీవల విడుదలై మూడు రోజుల్లోనే కోటి మంది వీక్షకులను ఆకట్టుకుంది. ఇది ప్రపంచ రికార్డు అట. దీంతో అజిత్‌ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

వారితో పాటు సంతోషాన్ని పంచుకుంటున్న నటి అక్షరహాసన్‌. ఈ అమ్మడు తన ప్రపంచ రికార్డు సాధించిన చిత్రం తనదే అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తన చిత్రం ఈ రికార్డును సాధించడం ఆశ్చార్యాన్ని కలిగిస్తోందని, ఇందుకు కారణం అయిన అభిమానులకు ధన్యవాదాలు అంటూ చిత్ర కథానాయకుడు అజిత్, కథానాయకి కాజల్‌అగర్వాల్‌ల కంటే ముందే తాను వివేగం చిత్ర టీజర్‌ రికార్డును ఓన్‌ చేసుకునే ప్రయత్నంలో పడ్డారు.ఈ విధంగా పాపులర్‌ అవ్వాలనుకుంటున్నారని భావించవచ్చు. ఈ భామకు తమిళంలో వివేగం తొలి చిత్రం అన్నది గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement