సినిమానూ గ్లామర్‌నూ వేరు చేయలేం. ఇక హీరోయిన్ల నుంచి గ్లామర్‌ను ఆశించకుండా ఉండలేం. కాబట్టి ఏ నటితో చిట్‌చాట్ చేసినా, గ్లామర్ గురించి ప్రశ్న తలెత్తకుండా ఉండదు. అలాంటి ప్రశ్నకు నటి సుభిక్షకృష్ణన్ ఏం చెప్పారో చూదాం. అన్నక్కొడి చిత్రం ద్వారా భారతీరాజా పరిచయం చేసిన కన్నడ బ్యూటీ ఈ నటి. ఆ తరువాత గోలీసోడా 2, కన్నై నమ్మాదే, చంద్రముఖి 2 వంటి పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం తమిళంతోపాటు తెలుగు, మలయాళం భాషల్లోనూ నటిస్తూ బిజీగానే ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో యాక్టీవ్‌గా ఉండే సుభిక్ష తన అందాలను కాపాడుకోవడానికి ఎక్కువగా జిమ్‌లోనే గడుపుతారు.
కాగా ఇటీవల ఈమె ఒక భేటీలో పేర్కొంటూ తనకు తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, ఆంగ్లం తదితర ఐదు భాషలు తెలుసని చెప్పారు. భాష తెలియకుండా ఆయా చిత్రాల్లో నటించడం తనకు నచ్చదన్నారు. అందుకే ఇన్ని భాషలు నేర్చుకున్నట్లు చెప్పారు. సినిమా నటి అనగానే వదంతులు హల్‌చల్ చేస్తాయిగా, వాటిని ఎలా ఎ దుర్కొంటారు? అన్న ప్రశ్నకు సినిమా రంగం చాలా రక్షణ నిచ్చే రంగం అని పేర్కొన్నారు. ఇక్కడ సినిమా ప్రారంభం నుంచి పూర్తి అయ్యే వరకూ చాలా కేర్‌గా చూసుకుంటారని, పారితోషికంతో పాటు సకల మర్యాదలు అందిస్తారని అన్నారు.
అలాంటి సినిమా రంగంపై ఆరోపణలు చేయడం తప్పనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నటి మీనాకు కళ్లు అందం, నటి రంభకు తొడలందం, సిమ్రాన్‌కు నడుమందం, మీలో ఏమి అందం అన్న ప్రశ్నకు తన ముఖారవిందం అని ఠక్కున చెప్పారు. అందరూ తన గురించి ఇదే చెబుతా రని అన్నారు. సినిమాల్లో గ్లామరస్‌గా నటించడం, లిప్‌లాక్ సన్ని వేశాలు తప్పనిసరి అని, అందుకు మీరు ఓకేనా? అన్న ప్రశ్నకు తాను కచ్చితంగా మోడరన్‌గా నటిస్తానని, ఇక కథ డిమాండ్ చేస్తే గ్లామరస్‌గానూ, లిప్‌లాక్ సన్నివేశాల్లోనూ నటించడానికి సిద్ధమేనని చెప్పారు.
అయితే తనకు చెప్పిన కథను అలానే తెరపై ఆవిష్కరిస్తేనే గ్లామరస్‌గా నటించడానికి తాను తయార్ అని అన్నారు. గ్లామర్‌ను ఒక ఊరగాయలా వాడుకోవడం, అనవసరంగా చిత్రంలో జొప్పించడం వంటివి సమ్మతించనన్నారు. మీకు నచ్చిన హీరో ఎవరన్న ప్రశ్నకు నటుడు శింబు అని ఠక్కున చెప్పారు. ఆయన అంటే పిచ్చి అభిమానం అన్నారు. శింబు సరసన నటించాలని ఆశగా ఉందన్నారు. ఆయన నటన, శ్రమ తనను ఆశ్చర్యపరుస్తాయన్నారు. గోలీసోడా 2 చిత్రంలో తన నటనను తొలుత ప్రశంసించింది ఆయనేనని, అది తనకు జీవిత సాఫల్య అవార్డులాంటిదని అన్నారు. ఉదయనిధి స్టాలిన్ అభినందనలను ఎప్పటికీ మరచిపోనని నటి సుభిక్ష కృష్ణన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment