Swim suits
-
స్త్రీలోక సంచారం
♦ లెగ్గింగ్స్, యోగా ప్యాంట్ ధరించి పాఠశాలకు హాజరవుతున్న విద్యార్థినులను యు.ఎస్. విస్కాన్సిన్ రాష్ట్రంలోని కెనోషాలో అనేక పాఠశాలల యాజమాన్యాలు కటువుగా శిక్షించడంపై అమెరికాలోని పౌర హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జిమ్‌కు, వర్కవుట్లకు అనువుగా ఉండే ‘అథ్లెష్యూర్’ ఫ్యాషన్ ట్రెండ్ దుస్తులను ధరించి పాఠశాలకు రాకూడదని గత మార్చిలోనే ఆంక్షలు విధించినప్పటికీ, కొంతమంది విద్యార్థినులు వాటిని లక్ష్యపెట్టకుండా అవే దుస్తులను ధరించి పాఠశాలకు వస్తున్నందున వారిపై చర్య తీసుకోవడం తప్పడం లేదని పాఠశాలలు చెబుతుండగా.. కొందరి విషయంలో మాత్రమే స్కూళ్లు ఈ విధమైన వివక్షను పాటిస్తున్నాయని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ♦ 98 ఏళ్ల ‘మిస్ అమెరికా’ అందాల పోటీల చరిత్రలోనే తొలిసారిగా ఈ ఏడాది స్విమ్ సూట్ రౌండ్ లేకుండానే పోటీలను నడిపించిన ఘనత నిర్వాహకులకు దక్కినప్పటికీ.. ఆ పోటీలను టీవీలో చూసే వీక్షకుల సంఖ్య గత ఏడాదితో పోల్చి చూస్తే 19 శాతం తగ్గినట్లు ప్రముఖ సర్వే కంపెనీ ‘నీల్సన్’ వెల్లడించడంతో వచ్చే ఏడాది మళ్లీ స్విమ్ సూట్ రౌండ్ పునరుద్ధరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి! సాధారణ పరిస్థితుల్లోనే టీవీలో అందాల పోటీలను చేసేవారి సంఖ్య గత కొన్నేళ్లుగా తగ్గుముఖం పడుతుండగా.. ఈసారి స్విమ్ సూట్ రౌడ్‌ను తొలగించడంతో.. గత ఏడాది 50 లక్షల 35 వేలుగా ఉన్న టీవీ వీక్షకులు ఈ ఏడాది 40 లక్షల 34 వేలకు పడిపోయారని నీల్సన్ తన సర్వే ఫలితాల్లో తెలిపింది. ♦ లెబనాన్ (పశ్చిమాసియా) రాజధాని బీరుట్కు రోడ్డు మార్గంలో 20 నిముషాల ప్రయాణ దూరంలో ఉన్న జియాలోని ఓన్లీ ఉమెన్ ‘బెలెవ్యూ బీచ్ క్లబ్’లో ఏ ఆంక్షలూ లేకుండా మహిళలకు ఇప్పటి వరకు కల్పిస్తున్న ప్రవేశానికి ఇప్పుడు మరిన్ని సడలింపులు ఇచ్చారు. అసలు మగ దృష్టే పడని, స్త్రీలకు మాత్రమే అయిన, అది కూడా లెబనాన్ దేశ మహిళలకు మాత్రమే ప్రవేశం ఉన్న ఈ క్లబ్బులోకి మహిళలు బికినీ సహా, ఏ విధమైన వస్త్రధారణతోనైనా వచ్చి, ఆహ్లాదంగా విహరించే అవకాశం ఉండగా ఇప్పుడు మరింత స్వేచ్ఛగా ఎండపూట ఇసుకలో బేర్ బ్యాక్స్‌తో, బేర్ ఫ్రంట్స్తో సూర్యస్నానాలు చేసే వీలు కల్పించారు. ♦ వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు వాటికన్ సిటీలో జాతీయ క్యాథలిక్ బిషప్‌ల సదస్సును నిర్వహిస్తున్నట్లు వాటికన్ మహిళా ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. యు.ఎస్., చిలి, ఆస్ట్రేలియా, జర్మనీలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లోని క్యాథిలిక్ చర్చి బిషప్‌లు.. పిల్లలపై, నన్లపై అత్యాచారం జరుపుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాటికన్ ప్రతిష్టను తిరిగి నిలుపుకోవడం కోసం పోప్ ఫ్రాన్సిస్ స్వయంగా పూనుకుని ఈ సదస్సును తలపెట్టారు. ♦ గత ఏడాది మొహర్రం రోజు దుర్గాపూజ విగ్రహాల నిమజ్జనం జరగకుండా ఆదేశాలు జారీ చేసి, ముస్లింల మెప్పు కోసం హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్న ఆరోపణలు ఎదుర్కొన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ ఏడాది కోల్‌కతాలోని 3,000 దుర్గాపూజ కమిటీలతో సహా, రాష్ట్రంలోని 28,000 కమిటీలకు.. ఒక్కో కమిటీకి 10,000 రూపాయలు చొప్పున నిధులను మంజూరు చేసింది. అయితే 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీపై పైచేయి సాధించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విధమైన హిందూ అనుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నారు తప్ప, వారిపై ఆమె ప్రత్యేకమైన ప్రేమ ఏమీ లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. -
ఈత దుస్తులకు సిద్ధం
తమిళసినిమా: క్షణ క్షణంబుల్ మారున్ జవరాలి చిత్తం అని పెద్దలు ఊరకే అనలేదు. సినీ తారల విషయానికొస్తే ఈ విషయం నూరుపాళ్లు నిజమని చెప్పాలనిపిస్తుంది. వీటి మాటలకు, చేతలకు పొంతన ఉండదు. నటి లక్ష్మీమీనన్ సంగతే చూడండి. తన శారీరక భాషకు గ్లామర్ పాత్రలు అస్సలు నప్పవు. ఇది ఇంతకు ముందు మాట. గ్లామరే కాదు, స్విమ్ దుస్తులు ధరించడానికీ సిద్ధమే. ఇది ఇప్పటి మాట. ఈ అమ్మడు పట్టుమని పది చిత్రాలయినా చేయలేదు. ఇంతలోనే అభిప్రాయంలో ఎంత మార్పో చూడండి. లక్ష్మీమీనన్ మంచి నటే. లక్కీ కథానాయకి కూడా. ప్రస్తుతం అవకాశాలు అంతంత మాత్రమే. ఇందుకు చదువు మీద దృష్టి లాంటి వ్యక్తిగత అంశాలు ఒక కారణం కావచ్చు. ఈ అమ్మడు అజిత్‌కు చెల్లెలిగా నటించిన వేదాళం చిత్రం దీపావళి పండగ సందర్భంగా ఈ నెల 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా లక్ష్మీమీనన్‌తో చిన్న భేటీ. ప్ర: కథానాయికగా నటిస్తూ వేదాళం చిత్రంలో అజిత్‌కు చెల్లెలిగా నటించడానికి కారణం? జ: చిత్ర కథ నచ్చింది. అందులో నా పాత్ర ఇంకా బాగా నచ్చింది. అందుకే చెల్లెలి పాత్రకు అంగీకరించాను. వేదాళం చిత్రం చూసిన వారికి అందులో తమిళ్ అనే నా పాత్ర బాగా నచ్చుతుంది. ప్ర: అజిత్ నుంచి నేర్చుకున్నది? జ: ప్రశాంతంగా ఉండటం. సెట్లో ఒక హలో ఒక హాయ్ అంతే. నా పని ముగియగానే ఒక పక్కన కూర్చుంటాను. అజిత్ అంతే అవసరం ఉంటేనే మాట్లాడతారు. లేకుంటే చాలా ప్రశాంతంగా ఉంటారు. ప్ర: ఇంతకు ముందు కొంబన్ లాంటి చిత్రాల్లో గ్రామీణ పాత్రల్లో నటించారు. అలాంటి పాత్రల్నే ఇష్టపడుతున్నారా లేదా నగర యువతి పాత్రలో నటించాలని కోరుకుంటున్నారా? జ: నిజం చెప్పాలంటే గ్రామీణ కథా చిత్రాలు నాకు నప్పడం లేదు. అలాంటి అవకాశాలే ఎక్కువగా వస్తున్నాయి. నాకు మాత్రం మోడ్రన్ పాత్రలు ధరించడం అంటేనే ఇష్టం. ప్ర: ప్రస్తుతం దెయ్యాల చిత్రాల ట్రెండ్ న డుస్తోంది. మీరూ అలాంటి చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నారా? జ: ఇప్పటి వరకూ అలాంటి అవకాశం రాలేదు. ఇకపై వస్తే తప్పకుండా నటిస్తాను. ఎలాంటి చిత్రం అయినా అందులో నా పాత్ర నచ్చాలి. ప్ర: ఇప్పటి వరకూ నటించిన వాటిలో మీకు నచ్చిన చిత్రం? జ: నాన్ శివప్పుమణిదన్ ప్ర: భరతనాట్యం నేర్చుకున్నారు. నటిగా రాణిస్తున్నారు. ఇప్పుడు గాయనీ అవతారం కూడా ఎత్తారు. వీటిలో ఏదంటే ఎక్కువ ఇష్టం? జ: నటనకంటే పాడటమంటేనే నాకు చాలా ఇష్టం. సంగీత దర్శకులు డీ.ఇమాన్. తమన్ చిత్రాల్లో పాడాను. ఇతర సంగీత దర్శకులు అవకాశం ఇచ్చినా పాడటానికి సిద్ధమే. పాడిన తర్వాత ఆ పాటను పూర్తిగా విన్నప్పుడు కలిగే ఆనందమే వేరు. ప్ర: అభిమానులు మిమ్మల్ని ఎలాంటి దుస్తుల్లో చూడాలని కోరుకుంటున్నారు? జ: నాకు తెలిసి అధిక మంది అభిమానులు లంగా ఓణీల్లోనే చూడాలని కోరుకుంటున్నారు. ప్ర: మీరు ఎంతకాలం ఇలా లంగా ఓణీ పాత్రల్లో నటిస్తారు. గ్లామర్ పాత్రలు పోషించాలన్న ఆశ లేదా? జ: అలాంటిదేమీ లేదు. గ్లామర్ పాత్రల్లోనూ నటిస్తాను. ప్ర: ఈత దుస్తులు ధరించి నటిస్తారా? జ: చిత్ర కథకు అలాంటి దుస్తులు అవసరం అయితే తప్పకుండా నటిస్తాను. సన్నివేశం ప్రాముఖ్యత తెలిసిన తరువాత నటించనని చెప్పను. ప్ర: మీరు నటించిన వేదాళం చిత్రం దీపావళికి తెరపైకి రానుంది. సంతోషంగా ఉందా? టెన్షన్‌గా ఉందా? జ: ఎలాంటి టెన్షన్ లేదు. టెన్షన్ అన్నది ఎరుగని క్యారెక్టర్ నాది. ఒక చిత్రం పూర్తి చేశానంటే తదుపరి చిత్రానికి రె డీ అయిపోతాను. దీపావళికి వేదాళం చిత్రం విడుదలవడం సంతోషమే. ప్ర: కేరళలో ఉంటూ షూటింగ్‌ల కోసం చెన్నై తదితర ప్రాంతాలకు వచ్చి వెళ్లడం శ్రమ అనిపించడం లేదా? జ: చెన్నైకి మకాం మార్చే ఆలోచన నాకు లేదు. ఇంతకు ముందు నాతో అమ్మ కూడా వచ్చేది. ఇప్పుడు నేను ఒంటరిగానే వస్తున్నాను. ఎప్పుడైనా అమ్మమ్మ కూడా వస్తుంటుంది. అలా షూటింగ్‌లకు వచ్చి వెళ్లడం నాకు శ్రమ అనిపించడం లేదు. ప్ర: మరి పెళ్లి మాటేమిటీ? ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన పెళ్లా? జ: అయ్యయ్యో అసలు పెళ్లే వద్దనుకుంటుంటే ప్రేమా, దోమా అంటారేమిటి. ఒక వేళ పెళ్లి చేసుకోవాలనుకుంటే అది పెద్దలు కుదిర్చిన వివాహమే అవుతుంది. ప్ర: అవకాశాలు తగ్గినట్లున్నాయే? జ: అదేమీలేదు. చాలా అవకాశాలు వస్తున్నా అన్నీ అంగీకరించడం లేదు. నచ్చిన కథా చిత్రాలే చేస్తున్నాను. వేదాళం తర్వాత జయం రవి సరసన ఒక చిత్రం చేస్తున్నాను. -
లిప్‌కిస్‌కు ఓకే
పెదవి ముద్దుకైనా, ఈత దుస్తులకయినా రెడీ అంటోంది వర్ధమాన తార అక్షర హాసన్. ఈ బ్యూటీ నేపథ్యం గురించి కొత్తగా ఏకరువు పెట్టాల్సిన అవసరం లేదు. నటనకు నడకలు నేర్పిన కుటుంబం నుంచి వచ్చింది అక్షర. విశ్వనాయకుడు కమలహాసన్ వారసురాలు అక్షర అక్క శ్రుతిహాసన్ ఇప్పటికే నాయకిగా దూసుకుపోతున్నారు. హీరోయిన్ పాత్రల్లో శ్రుతిమించిన రొమాన్స్, ఐటమ్ సాంగ్స్ అంటూ ఎడాపెడా నటించేస్తున్నారు. అక్షర కూడా అక్కబాటలోనే పయనించడానికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. తొలి చిత్రం షమితాబ్ (హిందీ)లో చక్కని పాత్రను పోషించి శభాష్ అనిపించుకున్నారు. అమితాబ్ లాంటి లెజెండ్, ధనుష్ లాంటి అనుభవజ్ఞుడైన నటులు మధ్య పరిచయ నటిగా మెప్పించడం అంత సులభమైన పని కాదు. అయితే అక్షర తన పాత్రను సమర్థవంతంగా పోషించి ప్రశంసలు అందుకుంటున్నారు. షమితాబ్ చిత్రం షూటింగ్ దశలోనే అక్షరకు పలు అవకాశాలు వచ్చినా తొలి చిత్రం విడుదల అనంతరమే అంగీకరిస్తానంటూ చెప్పుకుంటూ వస్తున్నారట. మరి ఇప్పుడెలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు? అక్క మాదిరిగా గ్లామర్ పాత్రలు పోషిస్తారా? అన్న ప్రశ్నలకు అక్షర బదులిస్తూ అవార్డు కోసం నటించాలన్న ఆశ లేదన్నారు. కమర్షియల్ కథా నాయకిగానే ఎదగాలని కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. కథ డిమాండ్ చేస్తే ఈత దుస్తులు ధరించడానికైనా, లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించడానికి కైనా రెడీ అంటూ కుండబద్ధలు కొట్టినట్లు వెల్లడించారు.